🙏అశ్విని నక్షత్రము గుణగణాలు🙏
- అశ్వినీ నక్షత్ర అధిదేవత అశ్వినీ దేవతలు.
- సూర్యభగవానుడి భార్య సజ్ఞాదేవికి, సూర్యభవానుడికి పుట్టిన వారు అశ్వినీదేవతలు.
- అశ్వినీ నక్షత్రజాతకులు అశ్వము వలె ఉత్సాహవంతులుగా ఉంటారు.
- వీరికి పోటీ మనస్తత్వము అధికము.
- క్రీడల అందు ఆసక్తి అధికము. అశ్వినీదేవతలు శసత్రచికిత్స, ఆయుర్వేద వైద్యములో నిపుణులు కనుక అశ్వినీ నక్షత్రజాతకులు ఆయుర్వేదము వంటి వైద్యము అందు ఆసక్తి కలిగి ఉంటారు.
- వీరు ఉద్రేకపూరిత మనస్తత్వము కలిగి ఉంటారు.
- రాశ్యాధిపతి కుజుడు కనుక వీరికి ధార్యసాహసాలు అధికం.
- ఎటువంటి పరిస్థితులనైనా మనోస్థైర్యంతో ఎదుర్కొనగలరు. ఓర్పు, నేర్పు, సామర్ధ్యంతో కార్యనిర్వహణ చేస్తారు.
- ఉత్సాహవంతుతుగా ఉంటారు.
- పోటీ మనస్త్వంతో విజయం వైపు అడుగులు వేస్తారు.
- వీరు ఇతరుల సలహాలు విన్నా తమకు నచ్చినట్లు నిర్ణయము తీసుకుంటారు.
- ఈ నక్షత్రము దేవగణ నక్షత్రము కనుక న్యాయము, ధర్మము పాటించడములో ఆసక్తి కనపరుస్తారు.
- వీరు రుజువర్తనులై ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక అధికారులుగా చక్కగా రాణిస్తారు.
- నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యము, దైవోపాసనా, భక్తి వంటి లక్షణాలు వీరికి అధికము.
- కొంత అలసత్వము కలిగి ఉండడము సహజమే.
- తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల అధికమే.
- ఇతరులకు లొంగి పనిచేయడం వీరికి నచ్చదు.
- అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వము కలిగి ఉంటారు.
- క్రీడాకారులుగా, వైద్యులుగా, సైనికపరమైన ఉద్యోగులుగా చక్కగా రాణించగలరు.
ఇవి అశ్వినీ నక్షత్రజాతకుల సాధారణ గుణాలు అయినా జాతకచక్రము, లగ్నము, పుట్టినసమయము, మాసముల వలన గుణగణాలలో మార్పులు ఉంటాయి.
ఈ నక్షత్ర జాతకులకు 45 సంవత్సరముల వరకు జీవితము సాఫీగా జరుగుతుంది.
బాల్యము నుండి యుక్తవయస్కులు అయ్యే వరకు వీరికి జీవితము వీరికి ఆనందదాయకముగా జరుగుతుంది.
ఇక్కడ నొక్కండి -> పూర్వఫల్గుణిి నక్షత్రము గుణగణాలు
ఇక్కడ నొక్కండి -> రోహిణి నక్షత్రము గుణగణాలు
ఇక్కడ నొక్కండి -> ఉత్తరాభద్రా నక్షత్రము గుణగణాలు
ఇక్కడ నొక్కండి -> మృగశిరా నక్షత్రము గుణగణాలు
ఇక్కడ నొక్కండి -> పుష్యమి నక్షత్రము గుణగణాలు
ఇక్కడ నొక్కండి -> స్వాతి నక్షత్రము గుణగణాలు
ఇక్కడ నొక్కండి -> అశ్విని నక్షత్రము గుణగణాలు
ఇక్కడ నొక్కండి -> కృత్తిక నక్షత్రము గుణగణాలు
ఇక్కడ నొక్కండి -> రేవతీ నక్షత్రము గుణగణాలు
ఇక్కడ నొక్కండి -> శతభిషా నక్షత్రము గుణగణాలు
ఇక్కడ నొక్కండి -> పూర్వాభద్ర నక్షత్రము గుణగణాలు
ఇక్కడ నొక్కండి -> శ్రవణా నక్షత్ర గుణగణాలు
ఇక్కడ నొక్కండి -> ధనిష్ఠా నక్షత్రము గుణగణాలు
ఇక్కడ నొక్కండి -> పూర్వాషాఢ నక్షత్రము గుణగణాలు
ఇక్కడ నొక్కండి -> మూలా నక్షత్రము గుణగణాలు
ఇక్కడ నొక్కండి -> జ్యేష్టా నక్షత్రము గుణగణాలు
ఇక్కడ నొక్కండి -> అనూరాధ నక్షత్రము గుణగణాలు
ఇక్కడ నొక్కండి -> విశాఖ నక్షత్రము గుణగణాలు
నవాంశ ఆధారిత గుణాలు
అశ్వినీ నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు, నవాంశ రాశ్యధిపతి కుజుడు కనుక వీరు ధైర్యసైహసాలు అత్యధికంగా కలిగి ఉంటారు. ఎటువంటి ఉద్రేకపూరిత వాతావరణంలో కూడా వీరు ముందు ఉంటారు. క్రీడాకారులు, సైనికాధికారులు, అగ్నిమాపకదళం వంటి ఉద్యోగాలు చేయడానికి ఉత్సుకత చూపిస్తారు.అశ్వినీ నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు నవాంశ రాశ్యధిపతి శుక్రుడు
అశ్వని నక్షత్రము ఏపాదంలో జన్మించినవారైనా అందం పెంపొదించుకోవాలని తాపత్రయపడతారు. ఎంతమందిని సలహాలు అడిగినా తన నిర్ణయాన్ని అమలు చేస్తారు.
అశ్వినీ నక్షత్ర జాతకులకు తారాఫలాలు
తార నామం. తారలు. ఫలం జన్మ తార
అశ్విని, మఖ, మూల.
శరీరశ్రమ
సంపత్తార
భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢధనలాభం
విపత్తార
కృత్తిక, ఉత్తరఫల్గుణి, ఉత్తరాషాఢకార్యహాని
క్షేమత్తార
రోహిణి, హస్త, శ్రవణం
క్షేమం
ప్రత్యక్తార
మృగశిర, చిత్త, ధనిష్ట
ప్రయత్న భంగం
సాధనతార
ఆరుద్ర, స్వాతి, శతభిష
కార్య సిద్ధి, శుభం
నైత్యతార
పునర్వసు, విశాఖ, పూర్వాభాద్రబంధనం
మిత్రతార
పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్రసుఖం
అతిమిత్రతార
ఆశ్లేష, జ్యేష్ట, రేవతి
సుఖం, లాభం
అశ్వని నక్షత్రము కొన్ని వివరణలు
నక్షత్రం - అశ్వని
అధిపతి- కేతువు
గణము - దేవ
జాతివృక్షం- పురుష అడ్డరస
జంతువు- గుర్రం
నాడి -ఆది
పక్షి -గరుడ
అధిదేవత- అశ్వని దేవతలు
రాశి -మేషం
అశ్విని కేతువు దేవ పురుషఅడ్డరస గుర్రం ఆది గరుడ అశ్వినీదేవతలు మేషం.
అశ్విని నక్షత్రము నవాంశ
1 వ పాదము - మేషరాశి.
2 వ పాదము - వృషభరాశి.
3 వ పాదము - మిధునరాశి.
4 వ పాదము - కర్కాటకరాశి.
నక్షత్రానికి ఉన్న గుణలు కలిగిఉన్నా నవాంశని అనుసరించి నాలుగు పాదాల వారికి ప్రత్యేక గుణలు కొన్ని ఉంటాయి.
- అశ్వినీ నక్షత్రము మొదటి పాదములో పుట్టిన వారు క్రీడాకారులుగా రాణిస్తారు. వీరు వీరవైద్యల అమ్దు ఆసక్తి కలిగి ఉంటారు.
- అశ్వినీ నక్షత్రము రెండవ పాదములో పుట్టిన వారు అలంకరణ అందు ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి సంభందించిన అన్ని విషయాలు సౌందర్యంగా ఉండడానికి శ్రద్ధవహిస్తారు.
- అశ్వినీ నక్షత్రము మూడవపాదములో పుట్టిన వారు విద్యలయందు అసక్తి కలిగి ఉంటారు.
- అశ్విణీ నక్షత్రము నాల్గవ పాదములో పుట్టిన వారు ఆయుర్వేదము వంటి వైద్యము, ఔషధతయారీ వంటి వాటి అందు ఆసక్తి కలిగి ఉంటారు.
అశ్విని నక్షత్రమునకు అదృష్ట సంఖ్యలు, మణి, వారములు, ఫలములు
అశ్విని నక్షత్రమునకు అదృష్ట సంఖ్యలు, మణి, వారములు, ఫలములు
సంఖ్యలు - 1, 4, 5, 9
మణి - వైఢూర్యం/రత్నం
వారములు - ఆదివారము, బుధవారము, శుక్రవారము
ఫలములు - ఏకాగ్రత నక్షత్రములో మొదటిదైన అశ్వని నక్షత్రంలో పుట్టిన జాతకులు స్వశక్తితో అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానాన్ని సొంతం చేసుకుంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. కేతు గ్రహ నక్షత్రమైన అశ్వనిలో పుట్టిన జాతకులు వృత్తి ఉద్యోగాలలో ప్రథమ స్థానాన్ని కోరుకుంటారు. దీనికోసం తీవ్రంగా కృషి చేస్తారు.ఎంతో మంది సలహాలను స్వీకరించి, మంచిచెడులను పరిశీలించి చివరికి తన నిర్ణయాన్నే అమలు చేస్తారు. స్వశక్తితో స్థిరాస్తులను సంపాదిస్తారు. అయితే అంతరంగిక వర్గం సలహాలు స్వీకరించకపోతే ఈ జాతకులు గొప్పవాళ్లవుతారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. గణపతి పూజ, గోపూజ చేయడం వల్ల శుభఫలితాలుంటాయని వారు చెబుతున్నారు. ఇంకా ఈ జాతకులకు పూజా ఫలితాలు తొందరగా ఫలిస్తాయి.ఇకపోతే.. ఈ జాతకులకు ఆయుర్వేద వైద్యము, హోమియో వైద్యము, ధనూర్ విద్యలయందు ఆసక్తి ఉంటుంది. వైద్య, క్రీడ, రాజకీయ రంగంలోను రాణిస్తారు. అవకాశం లభిస్తే ఏ రంగంలోనైనా పురోగతి సాధిస్తారు. సౌందర్యవంతులుగా, వాక్చాతుర్యంతో ఇతరులను ఆకట్టుకునే ఈ జాతకులు అనుకున్న కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేంతవరకు నిద్రపోరు.కాగా.. అశ్వని నక్షత్రంలో పుట్టిన జాతకులకు ఎరుపు, తెలుపు రంగులు అన్ని విధాలా అనుకూలిస్తాయి. ఈ జాతకులు ధరించే దుస్తుల్లో కొంతైనా ఎరుపు రంగు ఉండేలా చూసుకోవడం మంచిది. ఇంకా ఎరుపు రంగు చేతి రుమాలును వాడటం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.ఇకపోతే.. అశ్వని నక్షత్ర జాతకులకు అదృష్ట సంఖ్య 9. ఇంకా 9, 18, 27, 36, 45, 54, 63, 72 అనే సంఖ్యలు కూడా శుభ ఫలితాలనిస్తాయి. అలాగే అశ్వని నక్షత్ర జాతకులకు మంగళవారం అన్ని విధాలా అనుకూలిస్తుంది. బుధవారం, ఆదివారాల్లో శుభకార్యాలు ఆరంభించడం మంచిది. అయితే గురువారం మాత్రం అశ్వని నక్షత్ర జాతకులకు ఏ మాత్రం కలిసిరావడం కష్టం.
అశ్వని నక్షత్ర విశేషాలు:
ప్రాథమికంగా అశ్వనీ నక్షత్రం సన్య నక్షత్రంగా పురుష లక్షణంతో క్షిపుతారగా గుర్తింపు పొందింది. దీనికి అధిపతి కేతువు.
ఈ నక్షత్రంలో జన్మించినవారు పరమేశ్వరార్చన చేసి వైడూర్యాన్ని ధరించవలసి ఉంటుంది. అశ్వని 4పాదాలూ మేష రాశిలోనే ఉన్నాయి.
అశ్వని మొదటి పాదం
సామాన్య స్థితితో ఆరాటం ఎక్కువగా ప్రదర్శిస్తారు. అస్థిర చిత్తంతో ఉంటారు. రాజీ ధోరణితో ఉండాల్సి ఉంటుంది. అనవసర విషయాలపై దృష్టి పెట్టడంవల్ల రకరకాల ఆలోచనలు బుర్రను తొలుస్తుంటాయి. సామాజికంగా గౌరవం పొందాలన్న తపన కనబరుస్తారు.
గ్రహ దశలు
పుట్టిననాటినుంచి కేతు మహర్దశ 7 సం.లు, శుక్ర మహర్దశ 20 సం.లు, రవి మహర్దశ 6 సం.లు, చంద్ర మహర్దశ 10 సం.లు, కుజ మహర్దశ 7 సం.లు అనుభవిస్తారు.
దర్శనీయ క్షేత్రం
తూర్పు గోదావరి జిల్లాలోని బ్రహ్మపురిలోని అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి వారిని సందర్శించుకుంటే అస్థిరత ఉపశమించగలదు.
అశ్వని మూడో పాదం
వీరికి ప్రాచీన శాస్త్రాలపై ముఖ్యంగా జ్యోతిష, తర్క శాస్త్రాలపై మక్కువ ఉంటుంది. చక్కటి సలహాలు ఇవ్వడంలో పేరుగాంచుతారు. అయితే ఆయా సలహాలవల్ల తమకు తాము ఎలాంటి లాభాన్ని పొందలేరు. స్వధర్మ నిరతులై ఉంటారు. నలుగురిలో కలిసేందుకు ఇష్టపడరు.
గ్రహ దశలు
పుట్టినప్పటినుంచి కేతు మహర్దశ (సుమారుగా) మూడున్నర సం.లు, శుక్ర 20 సం, రవి 6 సం, చంద్ర 10 సం, కుజ దశ 7 సం., రాహు దశ 18 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం
కుయ్యేరులోని శ్రీబాలా త్రిపురసుందరి సమేత మల్లేశ్వరస్వామిని అర్చిస్తే శుభం కలుగుతుంది
అశ్వని నాలుగో పాదం
అలంకార ప్రియులుగానూ, నిదానమైన ప్రవర్తనతోనూ ఉంటారు. చక్కటి ఆలోచనలు కలిగి మేధావులుగా గుర్తింపు పొందుతారు. విభిన్నమైన విషయాలపై ఆసక్తి కనబరుస్తారు. లక్ష్యసాధనలో వెనుకంజ వేయరు. వీరికి ఫలితం సునాయాసంగా అందదు. శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది.
గ్రహ దశలు
పుట్టినప్పటి నుంచి కేతు మహర్దశ (సుమారుగా) 7 సం. 9 నెలలు, శుక్ర 20 సం, రవి మహాదశ 6 సం, చంద్ర మహర్దశ 10 సం, కుజ దశ 7 సం, రాహు దశ 18 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం
ఈ పాద జాతకులు దుగ్గుదుర్రులోని శ్రీపార్వతీ సమేత మల్లేశ్వరస్వామి వారిని అర్చించుకోవాలి.
అశ్వని]CAT’S EYE [వైడూర్యము. నామ అక్షరము (చూ.)
2 వ పాదము - మేషరాశి . ASHVINI [అశ్వని]CAT’S EYE [వైడూర్యము] నామ అక్షరము ( చే)
3 వ పాదము - మేషరాశి . ASHVINI [అశ్వని]CAT’S EYE [వైడూర్యము] నామ అక్షరము (చో)
4 వ పాదము - మేషరాశి . ASHVINI [అశ్వని]CAT’S EYE [వైడూర్యము] నామ అక్షరము (లా)
అను అక్షరములు గల పేర్లు పెట్టవలెను.
Ashwini is the star goddess Ashwini. The Ashwini deities were born to Surya Bhagavan's wife Sajnadevi and Surya Bhagavan. Ashwini constellations are as enthusiastic as a horse. They have a high competitive mindset. There is a lot of interest in sports. Since the Ashwini deities are experts in surgery and ayurvedic medicine, the Ashwini constellations are interested in medicine like Ayurveda. They have an impulsive mentality. Since Mars is the ruler, they have a lot of adventures. Can face any situation with composure. Performed with patience, skill, ability. Be enthusiastic. Steps towards success with a competitive mindset. They listen to the advice of others and make their own decisions. Since this star is the star of the gods, they are interested in practicing justice and righteousness. They are proofreaders. They have high leadership qualities so they excel as officers. Since Ketu is the constellation, they have a lot of qualities like despair, devotion and devotion. It is natural to have some sluggishness. The perseverance to achieve what they set out to do is high. They do not like to be submissive to others. Have a dominant mentality in all things. Can excel as athletes, doctors, military personnel. Although these are common characteristics of Ashwini constellations, there are changes in attributes due to horoscope, lagna, time of birth and months. Life goes smoothly for these horoscopes up to 45 years. From infancy to adulthood, their lives are enjoyable.