🙏శ్రవణా నక్షత్ర గుణగణాలు
- శ్రవణానక్షత్ర అధిపతి చంద్రుడు.
- అధిదేవత మహా విష్ణువు, గణము దేవగణము, రాశ్యాధిపతి శని, జంతువు వానరం.
- ఈ నక్షత్రజాతకులు మితభాషులు.
- కోపతాపాలు, మొండి వైఖరి, అల్లరితనం ఉన్నా నీరు ధర్మం తప్పక జీవితం సాగిస్తారు.
- వీరు చక్కని తీర్పులు చెప్పగలరు.
- వీరి అంతర్గత ఆలోచన, మేధస్సు ఎవరికి అర్ధం కాదు.
- ఓర్పు ఉంటుంది కాని దానికి హద్దులు ఉంటాయి.
- ఎవరికి ఎటువంటి మర్యాద ఇవ్వాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో వీరిని చుసి నేర్చుకోవాలి.
- ఆభరణాలు, స్థిరాస్థులు, వస్తువులు స్థిరాస్థులుగా లభించిన దాని కంటే స్వార్జితము ఎక్కువగా ఉంటుంది.
- మనోధైర్యంతో సాహస నిర్ణయాలు తీసుకుంటారు.
- విజయం సాధించి అఖండమైన ఖ్యాతి గడిస్తారు.
- చనువుగా మాట్లాడే స్వభావం ఉన్నా ఎవరిని నెత్తికి ఎక్కించుకోరు.
- ఊహ తెలిసిన నాటి నుండి ధనానికి లోటు ఉండదు.
- అంచెలు అంచెలుగా పైకి వస్తారు.
- శత్రువర్గం అడుగడుగునా ఇబ్బందులు పెడుతుంది.
- ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు. బంధుప్రీతి ఎక్కువ.
- స్నేహితులకు గుప్తంగా సహకరిస్తారు.
- చదువు పట్ల శ్రద్ధ, సమాజములో ఉన్నత స్థితి, అవకాశాలను సద్వినియోగపరచుకొనుట,
- సందర్భాను సారము వ్యూహం చేయుట వీరి స్వంతం.
- అందరు వీరిని మొండి వాళ్ళు అని భావించినా విరికి విశాలహృదయం, సున్నిత మనస్తత్వం ఎవరికి అర్ధం కాదు.
- వ్యాపారంలో ముందుగా భాగస్వాముల వలన నష్టపొయినా తరువాత మంచి లాభాలు గడిస్తారు. వారసత్వ విషయాలు లాభిస్తాయి.
- జీవితంలో ఊహించని స్థాయికి చేరుకుంటారు.
- బాల్య జీవితానికి జీవితంలో చేరుకున్న స్థాయికి ఎంతో తేడా ఉంటుంది.
- అడుగడుగునా దైవం కాపాడుతాడు.
- వీరికి దైవాను గ్రహం ఎక్కువ. వీరికి ఉండే దైవభక్తి, గుప్తదానాలు ఇందుకు కారణం. సంతానం వలన ఖ్యాతి లభిస్తుంది.
శ్రవణ నక్షత్రము – గుణగణాలు, ఫలితాలు
నక్షత్రములలో శ్రవణ నక్షత్రము 22వది. శ్రవణానక్షత్ర అధిపతి చంద్రుడు. అధిదేవత మహా విష్ణువు, గణము దేవగణము, రాశ్యాధిపతి శని, జంతువు వానరం.
శ్రవణ నక్షత్రము మొదటి పాదము
ఈ నక్షత్ర జాతకులకు ఎనిమిది సంవత్సరాల వరకు చంద్ర దశ ఉంటుంది. చంద్ర దశ కాలంలో వీరికి బాల్యంలో ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కుజదశ కాలంలో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. 15 సంవత్సాలకు వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కాలంలో ఉన్నత విద్యకు ఆటంకాలు ఎదురవుతుంటాయి. కనుక పట్టుదలతో వీటిని అధిగమించి విద్యలో విజయం సాధించాలి. రాహు దశ అనుకూలిస్తే విదేశాలలో విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం ఉంటుంది. జీవితంలో స్థిరపడడానికి కొంత జాప్యం జరగవచ్చు. వివాహంలో కూడా కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది.
ఇక 33 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో సమస్యలు క్రమంగా తగ్గుతాయి. సంపదనలో కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది. సంపాదించినది పదిలపరచుకోవాలి. 49 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో అభివృద్ధి కొంత తగ్గినా సాఫీగా జరిగి పోతుంది. అయినప్పటికీ అనుకోని ఖర్చులు అధికమవుతాయి. ఇక 68 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపసమనం కలిగి మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది. వృద్ధాప్య దశ సమస్యారహితంగా సాగిపోతుంది.
శ్రవణ నక్షత్రము రెండవ పాదము
ఇక ఈ జాతకులకు ఆరు సంవత్సరాల వరకు వీరికి చంద్రదశ ఉంటుంది. చంద్రదశలో వరకు వీరికి బాల్యంలో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కుజ దశ కాలంలో ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. 13 సంవత్సాలకు వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో మాధ్యమిక విద్యలోఆటంకాలు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా వీటిని అధిగమించి విద్యలో విజయం సాధించవచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశాలలో విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం. జీవితంలో స్థిరపడడానికి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఇక వివాహంలో కొంత ఆలస్యం అవుతుంది.
ఇక 31 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో సమస్యలు తగ్గుముఖం పట్టడమే కాక సంపదలో , సంపాదనలో మంచి అభివృద్ధి కలుగుతుంది. సంపాదించింది పదిలపరచుకుని ఇబ్బందులను ఎదుర్కొవాలి. 47 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో అభివృద్ధి కొంత తగ్గినా సాఫీగా జరిగి పోతుంది. అయినప్పటికీ అనుకోని ఖర్చులు అధికమవుతాయి. సంపాదనకు మించిన ఖర్చులు ఉంటాయి. 66 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపసమనం కలిగి మిగిలిన జీవితం సాఫీగా జరిగి పోతుంది. ఇక వృద్ధాప్య దశ సమస్యారహితంగా సాగిపోతుంది.
శ్రవణ నక్షత్రము మూడవ పాదము
ఇక ఈ జాతకులకు నాలుగు సంవత్సరాల వరకు చంద్ర దశ ఉంటుంది. చంద్రదశలో వరకు వీరికి బాల్యంలో ఆరోగ్య సమస్యలు ఉంటాయి. తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కుజ దశ కాలంలో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. 11 సంవత్సరాలకు వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా వీటిని అధిగమించి విద్యలో విజయం సాధించవచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశాలలో విద్యాభ్యాసం కొనసాగుతుంది. ఇక జీవితంలో స్థిరపడడానికి ఆలస్యమయ్యే అవకాశం. వివాహం విషయంలోనూ కొంత జాప్యం ఉంటుంది. 29 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో సమస్యలు తగ్గుముఖం పట్టడమే కాక సంపదలో, సంపాదనలో మంచి అభివృద్ధి కలుగుతుంది. సంపాదించింది పదిలపరుచువలసిన అవసరం ఎంతో ఉంది. 45 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో అభివృద్ధి కొంత తగ్గినా సాఫీగా జరిగిపోతుంది. అయినప్పటికీ అనుకోని ఖర్చులు అధికమవుతాయి. సంపాదనకు మించిన ఖర్చులు ఉంటాయి. 64 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం కలిగి మిగిలిన జీవితం సాఫీగా జరిగి పోతుంది. వృద్ధాప్యం సమస్యారహితంగా సాగిపోతుంది.
శ్రవణ నక్షత్రము నాలుగవ పాదము
ఈ నక్షత్రంలో జన్మించిన వారికి రెండు సంవత్సరాల వరకు వీరికి చంద్రదశ ఉంటుంది. చంద్రదశలో వరకు వీరికి బాలారిష్టాలు సమస్యలు ఉంటాయి. తరువాత వచ్చే 7 సంవత్సరాల కుజ దశ కాలంలో ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. 9 సంవత్సరాలకు వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో విద్యలోఆటంకాలు ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా వీటిని అధిగమించి విద్యలో విజయం సాధించవచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశాలలో విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం ఉంటుంది. జీవితంలో స్థిరపడడానికి కొంత జాప్యం జరగవచ్చు.వివాహంలో కొంత జాప్యం ఉంటుంది.
ఈ నక్షత్ర జాతకులు వీలైనంత తక్కువగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. కోపతాపాలు, మొండి వైఖరి, అల్లరితనం ఉన్నా వీరు ధర్మంతో జీవితం సాగిస్తారు. చదువు పట్ల శ్రద్ధ.. సమాజంలో ఉన్నత స్థితి.. అవకాశాలను సద్వినియోగపరచుకొనుట.. సందర్భాను సారము వ్యూహం చేయుట వీరి సహజ లక్షణములు.
వీరు చక్కని తీర్పులు చెప్పగలరు. వీరి అంతర్గత ఆలోచన, మేధస్సు ఎవరికి అర్ధం కాదు. ఓర్పు ఉంటుంది కాని దానికి హద్దులు ఉంటాయి. ఎవరికి ఎటువంటి మర్యాద ఇవ్వాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో వీరిని చుసి నేర్చుకోవాలి. ఆభరణాలు, స్థిరాస్థులు, వస్తువులు స్థిరాస్థులుగా లభించిన దాని కంటే స్వార్జితము ఎక్కువగా ఉంటుంది. మనోధైర్యంతో సాహస నిర్ణయాలు తీసుకుంటారు. విజయం సాధించి అఖండమైన ఖ్యాతి గడిస్తారు. చనువుగా మాట్లాడే స్వభావం ఉన్నా ఎవరిని నెత్తికి ఎక్కించుకోరు. ఊహ తెలిసిన నాటి నుంచి ధనానికి లోటు ఉండదు. అంచెలు అంచెలుగా పైకి వస్తారు. జీవితంలో ఊహించని స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయి.
శత్రువర్గం అడుగడుగునా ఇబ్బందులు పెడుతుంది. ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు. బంధుప్రీతి ఎక్కువ. అందరు వీరిని మొండి వాళ్ళు అని భావించినా వీరికి ఉండే విశాల హృదయం, సున్నిత మనస్తత్వం ఎవరికి అర్ధం కాదు. వ్యాపారంలో ముందుగా భాగస్వాముల వలన నష్టపొయినా తరువాత మంచి లాభాలు గడిస్తారు. ఏ విషయాన్నైనా అంతర్గత ఆలోచించే వీరికి ఓర్పు కాస్త ఎక్కువ. అయితే కొన్నిసార్లు సహనం కోల్పోతారు. వీరికి ధైర్యం, మనోనిబ్బరం ఎక్కువగా ఉంటుంది. జీవితంలో అంచెలంచెలుగా పైకి వస్తారు.
శ్రవణ నక్షత్రం
వృక్షం : తెల్ల జిల్లేడు
శ్లోకం : శ్రోణాత్రితారాశ్చ న్యగ్రోధోదీషుమత్యాకృతిః
కృష్ణమయూరజాతి పుషశ్చ మౌక్తికంచైవపుకాశితః
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 85 నుండి 88 వరకు గల శ్లోకములు శ్రవణ నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును.
ఫలితం : శ్రవణ నక్షత్రం వారు పైన చెప్పిన విధంగా చేయుట వలన ఆర్ధిక సమస్యలు తొలగుతాయి. మానసిక సమస్యలు తొలగుతాయి. సకల కార్యములు విజయవంతం అవుతాయి.
నక్షత్ర వివరము
నక్షత్రములలో ఇది 22వది.
నక్షత్రం - శ్రవణం
అధిపతి - చంద్రుడు
గణము - దేవ
జాతి - స్త్రీ
జంతువు - వానరము
వృక్షము - జిల్లేడు
నాడి - అంత్య
అధిదేవత - విష్ణువు
రాశి - 1,2,3,4 మకరము
శ్రవణా నక్షత్ర జాతకుల తారా ఫలాలు
తార నామం తారలు ఫలం
జన్మ తార
రోహిణి, హస్త, శ్రవణం
శరీరశ్రమ
సంపత్తార
మృగశిర, చిత్త, ధనిష
్టధన లాభం
విపత్తార
ఆర్ద్ర, స్వాతి, శతభిష
కార్యహాని
క్షేమాతార
పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర
క్షేమం
ప్రత్యక్ తార
పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర
ప్రయత్న భంగం
సాధన తార
ఆశ్లేష, జ్యేష్ట, రేవతి
కార్య సిద్ధి, శుభం
నైత్య తార
అశ్విని, మఖ, మూల
బంధనం
మిత్ర తార
భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ
సుఖం
అతిమిత్ర తార
కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ
సుఖం, లాభం
శ్రావణ నక్షత్రము నవాంశ
1వ పాదము - మేషం
2వ పాదము - వృషభం రాశి.
3వ పాదము - మిథునంరాశి.
4వ పాదము - కర్కాటకం రాశి.
అదృష్ట సంఖ్య లు
1,5,9
అదృష్ట వారం
సోమవారం
అదృష్ట రత్నం
ముత్యం
నామ ప్రథమ అక్షరాలు
వరుసగా
ఖీ,ఖూ,ఖే,ఖో
Translated by Google: