🙏శతభిషా నక్షత్రము గుణగణాలు [Telugu WhatsApp]





🙏శతభిషా నక్షత్రము గుణగణాలు

  • ఇది రాహుగ్రహ నక్షత్రం, అధిదేవత వరుణ దేవుడు, రాక్షసగణము, 
  • జంతువు గుర్రం, రాశ్యాధిపతి శని. 
  • ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అన్ని మార్గలలో స్నెహితులు ఉంటారు కాని వీళ్ళ వలన వారు ఉపయోగాలు ఆశించరు. 
  • సహోదరీ వర్గంతో, న్యాయపరమైన చిక్కులు ఎదురౌతాయి. ఇంట్లో అనాదరణ, వ్యతిరేక వాతావరణం ఎదురౌతుంది. 
  • విద్య కొంతకాలం మందకొడిగా సాగినా క్రమంగా ఎగుమతి వ్యాపారం కలసి వస్తుంది. 
  • రవాణా వ్యాపారం కొంత కాలం కలసి వస్తుంది. 
  • సకాలంలో వివాహం జరుగుతుంది. 
  • మధ్యవర్తిగా, కమీషన్ ఏజెంటుగా, వ్యాపార వేత్తలుగా రాణిస్తారు. 
  • పురాతన ఆస్థుల వలన లాభాలు, చిక్కులు ఎదురౌతాయి. 
  • వీలునామా వలన లాభపడతారు. స్థిరమైన ఉద్యోగం, సంపాదన లేక కొంత కాలం ఇబ్బందులు ఎదురౌతాయి. 
  • శని మహర్ధశలో స్థిరత్వం సాధిస్తారు. 
  • రాజకీయ వ్యూహం ఫలిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తారు. 
  • ఎవరికో ఒకరికి ఎప్పుడూ ఆర్థిక సహాయం చెయవలసి ఉంటుంది. 
  • జూదం వలన జీవితంలో అపశృతులు ఉంటాయి. 
  • సంతానం మంచి స్థితి సాధిస్తారు. వారి కొరకు జీవితంలో అనేక సౌఖ్యాలను త్యాగం చేస్తారు. 
  • వివాహాది శుభకార్యాలు మొండికి పడినా పట్టుదలతో వాటిని సాధిస్తారు. 
  • కోరికలు, అవసరాలు అనంతంగా ఒకదాని వెంట ఒకటి పుట్టుకు వస్తూనే ఉంటాయి అన్నది మీ విషయంలో సత్యం. 
  • ఆత్మియులతో అరమరికలు లేకుండా మెలగడం వలన మేలు జరుగుతుంది. 
  • ఇతరుల మెప్పు కొరకు అయిన వారిని దూరం చెసుకోవద్దు. 
  • ఆధ్యాత్మిక చింతన, నైతిక ధర్మం సదా కాపాడుతుంది. 
  • బాల్యం కొంత జరిగిన తరువాత సౌఖ్యంగా జరుగుతుంది. 
  • జీవితం సాధారణంగా చిక్కులు లేకుండా సాగుతుంది. 
  • జాతక చక్రంలోని గ్రహస్థితుల వలన మార్పులు సంభవం. 
  • ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ సాధారణ ఫలితాలు మాత్రమే.

ఇక్కడ నొక్కండి -> శ్రవణా నక్షత్ర గుణగణాలు
ఇక్కడ నొక్కండి -> మూలా నక్షత్రము గుణగణాలు

శతభిష నక్షత్రము  – గుణగణాలు, ఫలితాలు

నక్షత్రములలో ఇది 24వ నక్షత్రము. శతభిషము రాహుగ్రహ నక్షత్రం, అధిదేవత వరుణ దేవుడు, రాక్షసగణము, జంతువు గుర్రం, రాశ్యాధిపతి శని.

శతభిష నక్షత్రము మొదటి పాదము

శతభిషా నక్షత్ర మొదటి పాదము ధనసు రాశిలో ఉంటుంది. ధనసురాశి అధిపతి గురువు, శతభిషా నక్షత్ర అధిపతి రాహువు. ఈ నక్షత్ర జాతకుల మీద గురు రాహు గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రం. ఈ కారణం వల్ల వీరు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. ఈ జాతకులకు ఆధ్యాత్మిక విశ్వాసం,  ధార్మిక గుణం ఉంటుంది. రచయితలుగా రాణించగలరు. ఉపాధ్యాయ వృత్తి  అనుకులిస్తుంది. పసుపు వర్ణ వస్తు సంబంధిత ఉద్యోగ, వృత్తి వ్యాపారాలు వీరికి అనుకూలం.

ఈ జాతకులకు 16 సంవత్సరాల కాలం రాహు దశ ఉంటుంది. కనుక తొలి నుంచే విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. రాహు దశ అనుకూలిస్తే అడ్డంకులు తక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల పెంపక దశలో రాహు దశ సమస్యలు కనిపించకుండా పోతాయి. తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో ఉన్నత చదువులలో అభివృద్ధి కనిపిస్తుంది. ఇక జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలో అవుతుంది. వీరు సంపాదించింది జాగ్రత్త చేసుకోవాల్సిందే. లేదంటే 32 సంవత్సరాలలో వచ్చే 19 సంవత్సరాల శని దశలో సంపాదన కంటే ఖర్చులు అధికమవుతాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.

51 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కారణంగా జీవితంలో కొంత ఉపశమనం కలుగుతుంది. 68 సంవత్సరాల కాలంలో వచ్చే ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలిస్తేనే సమస్యలు తగ్గుతాయి. తీర్ధయాత్రకు, విదేశీ పర్యటనకు అవకాశం ఉంటుంది. 75 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇక వృద్ధాప్య దశ సుఖంగా గడిచిపోతుంది.

శతభిష నక్షత్రము రెండవ పాదము

ఈ నక్షత్ర జాతకుల మీద రాహు శని గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రం.. కనుక వీరు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. శ్రమించి పట్టుదలతో కార్యాలను నెరవేర్చగలరు. ఈ జాతకులకు పరిశ్రమలు, కర్మగాలు సంబంధిత ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

ఈ జాతకులకు 12 సంవత్సరాల కాలం రాహు దశ ఉంటుంది. కనుక తొలి నుంచే విద్యలో ఆటంకాలు ఏర్పడతాయి. రాహు దశ అనుకూలిస్తే అడ్డంకులు తగ్గుతాయి. తల్లిదండ్రుల పెంపక దశలో రాహు దశ సమస్యలు కనిపించకుండానే ముగిసిపోతాయి. తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో మాధ్యమిక చదువులలో అభివృద్ధి కనిపిస్తుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. ఇక వీరు సంపాదించింది జాగ్రత్త చేసుకోవాల్సిందే. లేదంటే 28 సంవత్సరాలలో వచ్చే 19 సంవత్సరాల శని దశలో సంపాదన కంటే ఖర్చులు అధికమవుతాయి. దీంతో ఆర్థిక కష్టాలు వెంటాడుతాయి.

47 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. 64 సంవత్సరాల కాలంలో వచ్చే ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలంగా ఉంటే సమస్యలు తగ్గుతాయి. తీర్ధయాత్రలకు అవకాశం ఉంటుంది. 71 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుతాయి. వృద్ధాప్య దశ సుఖంగా గడిచిపోతుంది.

శతభిష నక్షత్రము మూడవ పాదము

వీరు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. పట్టుదలతో, శ్రమించి కార్యాన్ని పూర్తి చేయగలరు. వీరికి  పరిశ్రమలు, కర్మగాలు సంబంధిత ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరికి స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి.

ఈ జాతకులకు ఎనిమిది సంవత్సరాల కాలం రాహుదశ ఉంటుంది. కనుక ఆరంభ విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. రాహుదశ అనుకూలిస్తే అడ్డంకులు తక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల పెంపక దశలో రాహు దశ సమస్యలు ప్రభావం చూపే అవకాశం లేదు. తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో చదువులలో అభివృద్ధి కనిపిస్తుంది. జీవితంలో త్వరగానే స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగవచ్చు. 24 సంవత్సరాలలో వచ్చే 19 సంవత్సరాల శని దశ వస్తుంది. దీంతో సంపాదన కంటే ఖర్చులే అధికంగా ఉంటాయి. 43 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది.

60 సంవత్సరాల కాలంలో వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతుదశ అనుకూలంగా ఉంటే సమస్యలు తగ్గుతాయి. తీర్ధ యాత్రకు, విదేశీ పర్యటనకు అవకాశం ఉంటుంది. 67 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుతాయి. తరువాత 20 సంవత్సరాల శుక్ర దశ కాలంలో తిరిగి సుఖం మొదలవుతుంది. వృద్ధాప్య దశ సుఖంగానే గడిచిపోతుంది.




శతభిష నక్షత్రము నాలుగవ పాదము 

వీరు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. ఇక వీరికి ఆధ్యాత్మిక విశ్వాసం, ధార్మిక గుణం ఉంటుంది. వీరు రచయితలుగానూ రాణించే నేర్పు ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తి  వీరికి అనుకులిస్తుంది. పసుపు వర్ణ వస్తు సంబంధిత ఉద్యోగ, వృత్తి వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి.

ఈ జాతకులకు నాలుగు సంవత్సరాల కాలం మాత్రమే రాహు దశ ఉంటుంది. కనుక తొలి నుంచే విద్యభ్యాసం నిరాటంకంగా కొనసాగుతుంది. నాలుగు సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా చదువు ఆటంకాలు లేకుండా సాగుతుంది.  అయితే ఉన్నత విద్యాభ్యాసంలో అడ్డంకులు తప్పకపోవచ్చు. పట్టుదలతో విజయం సాధించాల్సి ఉంటుంది. 20 సంవత్సరాలలోవచ్చే 19 సంవత్సరాల శని దశలో సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలుగుతుంది.

39 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. 56 సంవత్సరాల కాలంలో వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలంగా ఉంటే సమస్యలు తగ్గుతాయి. తీర్ధయాత్రకు, విదేశీ పర్యటనకు అవకాశం  ఉంటుంది. 63 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుతాయి. తరువాత వచ్చే 20  సంవత్సరాల శుక్రదశ కాలంలో తిరిగి సుఖం మొదలవుతుంది. వృద్ధాప్య దశ సుఖంగా గడిచిపోతుంది.

శతభిష నక్షత్రము – ఫలితాలు

ఈ నక్షత్ర జాతకులకు విద్యభ్యాసం కొంతకాలం మందకొడిగా సాగినా.. క్రమంగా ఎగుమతి వ్యాపారం కలసి వస్తుంది. రవాణా వ్యాపారం కొంత కాలం కలసి వస్తుంది. వీరికి సకాలంలో వివాహం జరుగుతుంది. మధ్యవర్తిగా, కమీషన్ ఏజెంటుగా, వ్యాపారవెత్తలుగా రాణిస్తారు. పురాతన ఆస్తుల వలన లాభాలతో పాటు, చిక్కులు కూడా ఎదుర్కొంటారు. స్థిరమైన ఉద్యోగం, సంపాదన లేక కొంతకాలం ఇబ్బందులు ఎదురవుతాయి. శని మహర్ధశలో స్థిరత్వం సాధిస్తారు. రాజకీయ వ్యూహం ఫలిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తారు.

వివాహాది శుభకార్యాలు వాయిదా పడినా పట్టుదలతో వాటిని సాధిస్తారు. కోరికలు, అవసరాలు అనంతంగా ఒకదాని వెంట ఒకటి పుట్టుకు వస్తూనే ఉంటాయి. ఆత్మీయులతో అరమరికలు లేకుండా మెలగడం వల్ల మేలు జరుగుతుంది. ఇతరుల మెప్పు కొరకు అయిన వారిని దూరం చేసుకోవద్దు. ఆధ్యాత్మిక చింతన, నైతిక ధర్మం సదా కాపాడుతుంది. బాల్యం దశలో కొంత కాలం జరిగిన తరువాత సుఖం మొదలవుతుంది. జీవితం సాధారణంగా చిక్కులు లేకుండా సాగుతుంది. జాతక చక్రంలోని గ్రహస్థితుల వల్ల మార్పులు తప్పవు

శతబిష నక్షత్రం

వృక్షం : కదంబ

శ్లోకం : శతభిశత తారాశ్చ కదంబ పుష్పాంనిభాకృతిః
          రక్తవర్ణ కోకిలశ్చైవ గోమేధికంచ యధాక్రమాత్!

ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 93 నుండి 96 వరకు గల శ్లోకములు శతబిష నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును.

ఫలితం : శతబిష నక్షత్రం వారు పైన చెప్పిన విధంగా చేయుట వలన జీవితంలో త్వరగా స్థిరపడతారు. శరీర పుష్టి కలుగుతుంది. కీళ్ళ సమస్యలు రావు.

నక్షత్ర వివరాలుసవరించు

నక్షత్రములలో ఇది 24వ నక్షత్రము. ఈ నక్షత్రమును శతభిషము మరియు శతభిషం అని కూడా వ్యవహరింతురు.

నక్షత్రం - శతాభిషం
అధిపతి - రాహువు
గణము - రాక్షస
జాతి - స్త్రీ
జంతువు - గుర్రం
వృక్షము - అరటి
నాడి - ఆది
అధిదేవత - వరుణ
రాశి 1,2,3,4 పాదాలు కుంభం

శతభిషా నక్షత్ర జాతకుల తారా ఫలాలు

తార నామం తారలు ఫలం

జన్మ తార
ఆర్ద్ర, స్వాతి, శతభిష
శరీరశ్రమ

సంపత్తార
పునర్వసు, విశాఖ, పూర్వాభద్రధన లాభం

విపత్తార
పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర
కార్యహాని

సంపత్తార
ఆశ్లేష, జ్యేష్ట, రేవతి
క్షేమం

ప్రత్యక్ తార
అశ్విని, మఖ, మూల
ప్రయత్న భంగం

సాధన తార
భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ
కార్య సిద్ధి, శుభం

నైత్య తార
కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ
బంధనం

మిత్ర తా
రోహిణి, హస్త, శ్రవణం
సుఖం

అతిమిత్ర తార
మృగశిర, చిత్త, ధనిష్ట
సుఖం, లాభం

శతభిషానక్షత్రము నవాంశ

1వపాదము - ధనసురాశి.
2వ పాదము - మకరరాశి.
3వ పాదము - కుంభరాశి.
4వ పాదము - మీనరాసి.

అదృష్ట సంఖ్యలు

6,8

అదృష్ట వారం

శుక్రువారం

అదృష్ట రత్నం

గోమేధికం

నామ ప్రథమ అక్షరాలు వరుసగా

గో,సా,సీ,సూ




It is the star of Rahugraha, the goddess Varuna, the demon, the animal horse, the ruler Saturn. Those born under this star have friends in all ways but they do not expect benefits because of them. With sisterhood, there are legal implications. Disrespectful, hostile atmosphere at home. Although education has been sluggish for some time, the export business is gradually coming together. The transportation business comes together for a while. Timely marriage takes place. Excel as an intermediary, commission agent, and entrepreneur. Profits and implications due to antiques. Benefit from the will. Stable job, earnings or difficulties for a while. Stability is achieved in Saturn Mahardhasa. Political strategy pays off. Overcome them no matter the difficulties on the job. Someone will always need financial help. Gambling can make life miserable. The offspring will achieve good status. Many comforts in life are sacrificed for them. Bridal good deeds are achieved with perseverance even when stubborn. The truth is that desires and needs are endlessly born one after the other. It is good to wake up without making arrangements with the saints. Do not shun those who are for the praise of others. Spiritual thought and moral virtue are always preserved. Childhood happens comfortably after a while. Life usually goes on without complications. The occurrence of changes due to asteroids in the horoscope cycle. These are just some of the goal setting shareware that you can use.
Although education for these horoscopes has been sluggish for a while .. gradually the export business comes together. The transportation business comes together for a while. They get married in a timely manner. Excel as an intermediary, commission agent, and entrepreneur. In addition to the benefits due to antique assets, there are also implications. Stable job, earnings or difficulties for a while. Stability is achieved in Saturn Mahardhasa. Political strategy pays off. Overcome them no matter the difficulties on the job.

Bridal good deeds are accomplished with perseverance even if they are postponed. Desires and needs are endlessly born one after the other. It is good to wake up without making arrangements with the saints. Do not shun those who are for the praise of others. Spiritual thought and moral virtue are always preserved. Happiness begins after some time in childhood. Life usually goes on without complications. Changes due to asteroids in the horoscope cycle are not wrong.

1 కామెంట్‌లు

కొత్తది పాతది