🙏పూర్వాషాఢ నక్షత్రము గుణగణాలు [Telugu WhatsApp]




🙏పూర్వాషాఢ నక్షత్రము గుణగణాలు 

  • పూర్వాషాఢ నక్షత్రముకు అధిపతి శుక్రుడు, అది దేవత గంగ, మనుష్య గణం , జంతువు వానరం, రాశి అధిపతి గురువు. 
  • వీరు విలాసమంతమైన జీవితాన్ని కోరుకుని సాధిస్తారు. 
  • స్త్రీలు జీవితంలో ఉన్నత స్థాయిని చవి చూసి తిరిగి దిగువ స్థాయికి చేరుకుంటారు. 
  • పూర్వీకుల ఆస్తులు హరించుకు పోయి కొంత భాగం మాత్రం మిగులుతుంది. 
  • చాకచక్యం, కొంటె తనం వీరి స్వంతం. 
  • బాల్యజీవితం సుఖవంతము. వివాహ జీవితం సాధారణం. 
  • పుట్తిన ప్రామ్తానికి దూరంగా రాణిస్తారు. 
  • నాయకత్వ లక్షణాలు ఉంటాయి. జీవితంలో అనుభవాలను చూసి పాఠాలు నేర్చుకుంటారు. 
  • స్నేహితుల సహాయ సహకారాలతో ఉన్నతస్థాయి సాధిస్తారు. 
  • స్నేహితులతో కలసి జీవితంలో విజయాలు సాధిస్తారు. 
  • విద్యా, వ్యాపార, రాజకీయ రంగాలలో ఖ్యాతి రాణింపు లభిస్తుంది. 
  • కొంత కాలం తరువాత వీరున్న రంగంలో వీరి స్నెహితులు ఉన్నతి సాధించి వీరిని దూరంగా ఉంచుతారు. 
  • వీరి ఓర్పుకు సహనానికి పరీక్షలు ఎదురౌతాయి. 
  • ఎక్కువ కాలం ఓర్పు వహించ లేరు. 
  • సమాజంలో గౌరవానికి బదులు భయం చోటు చేసుకుంటుంది. 
  • ఏ రంగంలోనైనా ఓటమిని అంగీకరించరు. సహోదరుల వలన అపఖ్యాతి లభిస్తుంది. 
  • నమ్మిన సేవకాజనం మోసం చెస్తారు. 
  • సహోదరీ వర్గం అన్ని విధాలా సహకరిస్తారు. 
  • ఆధ్యాత్మిక జీవితం మీద ఆసక్తి స్వామీజీల పతల సదభిప్రాయం ఉంటుంది. 
  • దైవభీతి ఉంటుంది. విదేశీయానం కలుగుతుంది. 
  • విదేశీ వ్యాపారము, వ్యవహారము లాభిస్తాయి. సంతానము మీద ఎవ్వరి నీడ పడకుండా కాపాడతారు. 
  • వ్యక్తిగతమైన వృత్తి సంబంధిత వ్యవహారాల నీడలు కుటుంబం మీద పడకుండా జాగ్రత్త వహిస్తారు. 
  • కుటుంబ జీవితానికి సామాజిక జీవితానికి మధ్య గోడను నిర్మించి జీవించడం మంచికి దారి తీస్తుంది.

ఇక్కడ నొక్కండి -> శ్రవణా నక్షత్ర గుణగణాలు
ఇక్కడ నొక్కండి -> మూలా నక్షత్రము గుణగణాలు

పూర్వాషాడ నక్షత్రం

వృక్షం : అశోక/ నిమ్మ

శ్లోకం : పూర్వాషాడా ద్వితారాశ్చ నెమ్మి వృక్ష దండా కృతిః
          శ్వేతవర్ణశ్చశుకశ్చ కల్వారపుప్పేషు వజ్రం తధా!

ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 77 నుండి  80 వరకు గల శ్లోకములు పూర్వాషాడ నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును.

ఫలితం :  పూర్వాషాడ నక్షత్రం వారు పైన చెప్పిన విధంగా చేయుట వలన వీరి వినయ విధేయతలు పెరుగుతాయి. వ్యవహార శైలిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వాతం, కీళ్ళ సమస్యలు తొలగుతాయి.

నక్షత్రములలో ఇది 20వ నక్షత్రము. పూర్వాషాఢ నక్షత్రముకు అధిపతి శుక్రుడు. అది దేవత – గంగ. మనుష్య – గణం. జంతువు – వానరం. రాశి – అధిపతి గురువు.

పూర్వాషాఢ నక్షత్రము మొదటి పాదము 

పూర్వాషాఢ ఒకటవ పాదము సింహరాశిలో ఉంటుంది. సింహరాశి సూర్యుడు. పూర్వాషాఢ నక్షత్ర అధిపతి శుక్రుడు. ఈ నక్షత్ర జాతకుల మీద సూర్య, శుక్ర గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు మానవ గణ ప్రధానులు కాబట్టి వీరికి సమయానుకూలంగా వ్యవహరించే నేర్పు ఉంటుంది. వీరికి అతిశయభావం, నిర్వహణ సామర్ధ్యం ఉంటుంది. విలాసాల మీద,  సౌందర్యపోషణ మీద అంతులేని ఆసక్తి ఉంటుంది. కళాత్మకమైన వృత్తులు, వ్యాపారం, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.

ఈ జాతలకులు చిన్న వయసు నుంచే  కళాత్మక రంగంలో ప్రతిభాపాటవాలు చూపిస్తారు. విద్య ఆరంభం నుంచి బాగా సాగుతుంది. శుక్ర దశ కారణంగా విలాసాలు సౌందర్య పోషణ అంటే ఆసక్తి ఉంటుంది. అయితే పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించాలి. 18 సంవత్సరాల వరకు వీరికి శుక్ర దశ ఉంటుంది. అప్పటి వరకు సాఫీగా సాగే జీవితంలో తరువాత కాస్త సుఖం తగ్గినా 41 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 59 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో సంపద సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. వృద్ధాప్యం సాఫీగా, ప్రశాంతంగా సాగుతుంది.

పూర్వాషాఢ నక్షత్రము రెండవ పాదము

వీరి మీద శుక్ర, బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు  బుద్ధి కుశలత కలిగి ప్రవర్తిస్తారు. ఈ జాతకులు మానవగణ ప్రధానులు కనుక వీరికి సమయానుకూలంగా వ్యవహరించగల నేర్పు ఉంటుంది. అంతేకాదు కళాత్మక వస్తువుల మీద ఆసక్తి అధికం.

చిన్న వయసు నుంచే కళాత్మక రంగంలో ప్రకాశించగలుగుతారు. పర్యాటక ప్రదేశాలలో వీరికి ఉద్యోగావకాశాలు అనుకూలిస్తాయి. భూ సంబంధిత , కళా సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. విద్య ఆరంభం నుంచే బాగా సాగుతుంది. శుక్ర దశ కారణంగా విలాసాల  మీద, సౌందర్య పోషణ అంటే ఆసక్తి ఉంటుంది. పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి.

14 సంవత్సరాల వరకు వీరికి శుక్ర దశ ఉంటుంది. అప్పటి వరకు సుఖంగా సాగే జీవితంలో తరువాత కొంత సౌఖ్యం తగ్గినా 37 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా జీవితంలో అనుకోని కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఇక రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 55 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో సంపద సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. వృద్ధాప్యం సాఫీగా సాగుతుంది.

పూర్వాషాఢ నక్షత్రము మూడవ పాదము 

వీరికి సమయానుకూలంగా వ్యవహరించే నేర్పు ఉంటుంది. అంతేకాదు వీరి మీద పరిపూర్ణంగా శుక్రుడి ప్రభావం ఉంటుంది కనుక వీరు  కళారంగంలో విశేషంగా ప్రకాశిస్తారు. వీరికి కళాపిపాస అత్యధికంగా ఉంటుంది. కళాత్మక వస్తుసేకరణ అంటే ఆసక్తి అధికం. పరిశుభ్రమైన వాతావరణం అంటే ఇష్టపడతారు. అటువంటి చోటే నివసిస్తారు. పర్యాటక ప్రదేశాలలో, విహార ప్రదేశాలలో, విలాస ప్రదేశాలలో వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలం.

ఇక ఈ జాతకులు చిన్న వయసులోనే కళారంగంలో ప్రకాశిస్తారు. విద్య ఆరంభం నుంచి బాగా అబ్బుతుంది. శుక్ర దశ కారణంగా విలాసాల  మీద, సౌందర్య పోషణ అంటే అధిక ఆసక్తి. కాబట్టి పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి. 9 సంవత్సరాల వరకు వీరికి శుక్ర దశ ఉంటుంది. అప్పటి వరకు సుఖంగా సాగే జీవితంలో తరువాత కొంత సుఖం తగ్గినా 32 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. సకాలంలోనే స్థిరపడతారు. సకాలంలోనే వివాహం కూడా జరుగుతుంది.

తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణంగా జీవితంలో కొన్ని అనుకోని అవంతరాలు ఏర్పడతాయి. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 50 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో సంపద సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. 66 సంవత్సరాల కాలంలో 19  సంవత్సరాల శని దశ కాలంలో వృద్ధాప్యం సాఫీగా సాగుతుంది.

పూర్వాషాఢ నక్షత్ర నాలుగవ పాదము

వీరికి సమయానుకూలంగా వ్యవహరించే నేర్పు స్వభావ రీత్య ఉంటుంది. వీరు భావ తీవ్రత కలిగి ఉంటారు. అయినా కూడా తమ భావాల మీద నియంత్రత కలిగి ఉంటారు. ఈ జాతకులకు భూ సంబంధిత , కళా సంబంధిత, పర్యాటక సంబంధిత,  జలసంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

ఈ జాతకులు బాల్యం నుంచే కళారంగంలో ప్రకాశిస్తారు. విద్య ఆరంభం నుంచే బాగా సాగుతుంది. శుక్ర దశ కారణంగా విలాసాల  మీద, సౌందర్య పోషణ అంటే ఆసక్తి అధికంగా ఉంటుంది. కాబట్టి పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించాలి. 5 సంవత్సరాల వరకు వీరికి శుక్ర దశ ఉంటుంది. అప్పటి వరకు సౌఖ్యంగా సాగే జీవితంలో తరువాత కొంత సుఖం తగ్గినా… 28 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 45 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో సంపద సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. 61 సంవత్సరాల కాలంలో 19 సంవత్సరాల శని దశ కాలంలో అనుకోని ఖర్చులు ఉంటాయి. మిగిలిన జీవితం.. వృద్ధాప్య దశ సాఫీగా సాగుతుంది.

పూర్వాషాఢ నక్షత్రము గుణగణాలు, ఫలితాలు

ఈ నక్షత్ర జాతకులు ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉంటారు. ఇతరులను ఆకట్టుకునే వాక్చాతుర్యత, అందం వీరి సొంతం. విలాసమంతమైన జీవితాన్ని కోరుకుని సాధిస్తారు. ముఖ్యంగా స్నేహితులతో ఉమ్మడిగా జీవితంలో చెప్పుకోదగిన విజయాలు సాధిస్తారు. జన్మించిన ప్రాంతానికి దూరంగా రాణిస్తారు. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. జీవితంలో అనుభవాలను చూసి పాఠాలు నేర్చుకుంటారు. విద్యా, వ్యాపార, రాజకీయ రంగాల్లో రాణిస్తారు. నాయకత్వ లక్షణాలు ఉంటాయి.

విదేశీయానం, విదేశీ వ్యాపారము, వ్యవహారము లాభిస్తాయి. సంతానం మీద ఎవరి నీడ పడకుండా కాపాడతారు. వ్యక్తిగతమైన వృత్తి సంబంధిత వ్యవహారాల నీడలు కూడా కుటుంబం మీద పడకుండా జాగ్రత్త వహిస్తారు. సహోదరుల వలన అపఖ్యాతి వస్తుంది.

ఇకపోతే.. బుధవారం వీరికి అదృష్టమైన రోజు. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శనివారాల్లో ఎలాంటి పనులు చేపట్టినా ఆశించిన ఫలితాలుండవు. నలుపు, సిల్వర్ రంగులు గల దుస్తులను ధరించడం మంచిది. నలుపు చేతి రుమాలును వాడటం ద్వారా కొన్ని సమస్యల నుంచి తప్పించుకునే ఆస్కారం ఉంది. ఇంకా శుక్ర గ్రహ శాంతి కోసం శనివారాల్లో నేతి దీపమెలిగించడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయి. వీరి అదృష్ట సంఖ్య 3. ఇక 5, 6 సంఖ్యలు కలిసి రావు.



నక్షత్రములలో ఇది 20వ నక్షత్రము.

నక్షత్రం - పూర్వాషాడా
అధిపతి - శుక్రుడు
గణము - మానవ
జాతి - స్ర్తీ
జంతువు- వానరము
వృక్షము - నెమ్మి
నాడి - మధ్య
పక్షి - గడి పాఠ్యమ్
అధిదేవత - గంగ
రాశి - 1,2,3,4 పాదాలు ధనుస్సు

పూర్వాషాఢ నక్షత్రజాతకుల తారా ఫలాలు

తార నామం తారలు ఫలం

జన్మ తార
భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ
శరీరశ్రమ

సంపత్తార
కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ
ధన లాభం

విపత్తార
రోహిణి, హస్త, శ్రవణం
కార్యహాని

సంపత్తార
మృగశిర, చిత్త, ధనిష
క్షేమం

ప్రత్యక్ తార
ఆర్ద్ర, స్వాతి, శతభిష
ప్రయత్న భంగం

సాధన తార
పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర
కార్య సిద్ధి, శుభం
నైత్య తార
పుష్యమి, అనూరాధ, ఉత్తరా

మిత్ర తార
ఆశ్లేష, జ్యేష్ట, రేవతి
సుఖం

అతిమిత్ర తారఅశ్విని, మఖ, మూలసుఖం, లాభం

పూర్వాషాఢ నక్షత్రము నవాంశ

1 వ పాదము _ సింహరాశి.
2 వ పాదము - కన్యారాశి.
3 వ పాదము - తులారాశి.
4 వ పాదము - వృశ్చికరాశి.

అదృష్ట వారం

శుక్రువారం

అదృష్ట సంఖ్యలు

8,9

అదృష్ట రత్నం

వజ్రం

నామ ప్రథమ అక్షరాలు వరుసగా

బూ,దా,థా,ఢా



Translated by Google:
Venus is the head of the constellation Purvashadha, which is the goddess Ganga, the human group, the animal monkey, and the zodiac head Guru. They seek and achieve a life of luxury. Women rock the high level in life and return to the lower level. The ancestral property is drained and only a part of it remains. Cunning, naughty self whose own. Childhood life is comfortable. Marital life is normal. Excel away from the point of birth. There are leadership qualities. Lessons are learned by looking at life experiences. Achieve excellence with the help of friends. Achieve success in life with friends. Reputation in education, business and politics. After some time, their friends in the field are exalted and put away. Their patience will be put to the test. Can't wait long. Fear takes place instead of respect in society. Do not accept defeat in any field. Infamy is caused by brothers. Believers are deceived by the servant. The sisterhood will cooperate in all ways. Swamijis who are interested in the spiritual life will have the same opinion. There will be piety. Expatriation is caused. Foreign trade, business is profitable. Protect the offspring from any shadow. Care is taken not to cast the shadows of personal professional affairs on the family. Building a wall between family life and social life leads to a better life.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది