🙏జ్యేష్టా నక్షత్రము గుణగణాలు [Telugu WhatsApp]




🙏జ్యేష్టా నక్షత్రము గుణగణాలు

  • జ్యేష్టా నక్షత్రమునకు అధిపతి బుధుడు. 
  • ఇది రాక్షసగణ నక్షత్రము, అధిదేవత ఇంద్రుడు, జంతువు జింక. 
  • ఈ నక్షత్ర జాతకులు తమ రహస్యాలు కాపాడుకోవడానికి ఇతరుల రహస్యాలు తెలుసుకోవడనికి ప్రయత్నిస్తారు. 
  • ఇతరులలో చిన్న విషయాలను కూడా పరిశీలించి లోపాలను ఎత్తి చూపుతారు. 
  • తగాదాలు పెట్టడమే ధ్యేయంగా ఉన్న వారిలా పేరు తెచ్చుకుంటారు. 
  • తమకు శక్తి లేకున్నా అనుకున్న కార్యం సాధించడనికి ప్రయత్నిస్తారు. 
  • ఇతరుల సహాయాన్ని తమ హక్కులుగా వాడుకుంటారు. 
  • విమర్శలు సహించ లేరు. ఆత్మన్యూన్యతా భావం కలిగి ఉంటారు. 
  • ఎదుటి వారు సరదాగా చేసే వ్యాఖ్యలు తమను అపహాస్యం చేయడానికే చేసారని భావిస్తారు. 
  • మిత్రభేదం కలిగించి, తప్పుడు సలహాలు ఇచ్చి ఇతరులను అపఖ్యాతి పాలు చేయడంలో అందెవేసిన చేయిగా పేరు తెచ్చుకుంటారు. 
  • నమ్మిన స్నేహితులు కూడా వీరిని అలాగే మోసం చెస్తారు. 
  • వీరికి నచ్చని వారి మీద తీవ్రమైన ద్వేషం పెంచుకుంటారు. 
  • విశేషమైన దైవభక్తి ఉంటుంది. 
  • తమవరకు వచ్చే వరకు వీరికి సమస్యలు కూడా సౌందర్యంగానే కనిపిస్తాయి. 
  • భాషలకు భాష్యం వ్రాయగలిగిన పాండిత్యం కలిగి ఉంటారు. 
  • సామాజిక కార్యక్రమాలలో ముందు ఉంటారు. 
  • సౌకర్యవంతమైన ఉద్యోగం, అన్యోన్య దాంపత్యం వీరికి సుఖంను కలిగిఉస్తుంది. 
  • సంతానం నష్టంము కావచ్చు. 
  • అయినా సంతాన ప్రాప్తికి వంశాభివృద్ధికి లోపం ఉండదు. 
  • అన్నమాట, ఇచ్చిన వాగ్ధానం నిలబెట్టుకోలేరు. 
  • సందర్భానుసారంగా అభిప్రాయాలు మార్చుకుంటారు. 
  • శాశ్వత మిత్రత్వం, శాశ్వత స్నేహం ఉండదు. 
  • సాంకేతిక రంగంలో ప్రత్యేక విభాగంలో నిపుణత ఉంటుంది. 
  • విదేశాల మిద మోజు, విహారయాత్రల మీద ఆసక్తి ఉంటుంది. 
  • వ్యసనాలకు దూరంగా ఉంటే జీవితం సాఫిగా సాగుతుంది. 
  • బాల్యం నుండి విద్యలో ప్రకాశిస్తారు. కాని ఉన్నత విద్యలకు కొంత ఆటంకం కలిగినా అడ్డంకులను అధిగమిస్తే అభివృద్ధి సాధించ గలరు. 
  • తగిన వయసులో సంపాదన మొదలౌతుంది. 
  • సంపాదించిన ధనంను భవిష్యత్తుకు జాగ్రత్త పరచుకోవాలసిన అవసరం ఎంతైనా ఉంది. 
  • వృద్ధాప్యంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. 
  • ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే. 
  • జాతక చక్రంలో గ్రపరిస్థితులను అనుసరించి ఫలితాలలో మార్పులు ఉంటాయి.

ఇక్కడ నొక్కండి -> శ్రవణా నక్షత్ర గుణగణాలు
ఇక్కడ నొక్కండి -> మూలా నక్షత్రము గుణగణాలు

జ్యేష్ఠ నక్షత్రము - గుణగణాలు, ఫలితాలు

నక్షత్రములలో ఇది 18వ నక్షత్రము. జ్యేష్టా నక్షత్రమునకు అధిపతి బుధుడు. ఇది రాక్షసగణ నక్షత్రము, అధిదేవత ఇంద్రుడు, జంతువు లేడి, స్త్రీ జాతి. జ్యేష్ఠ నక్షత్రము కలిగిన వధూవరులిద్దరూ జ్యేష్టులైనచో వారికి వివాహము నిశ్చయించరాదని శాస్త్రం చెబుతోంది. 

జ్యేష్ఠ నక్షత్ర మొదటి పాదము

ఈ నక్షత్రము మీద గురు బుధ గ్రహ ఆధిక్యత ఉంటుంది. ఇది రాక్షసగణ నక్షత్రము. వీరికి పట్టుదల అధికం. వీరు మేధా సంపన్నులుగా ఉంటారు. అందువల్ల వీరికి మేధోసంబందిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరు విద్యాసంస్థలు స్థాపించి నిర్వహించగలరు. అధికార పదవులను సమర్ధవంతగా నిర్వహించగలరు. ఉన్నత స్థాయి ఉద్యోగావకాశాలు కూడా అందివస్తాయి.

14 సంవత్సరాల వరకు బుధ దశ ఉండటం వల్ల వీరు విద్యారంభం నుంచి విద్యలో ప్రతిభ చూపిస్తారు. తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కారణంగా విద్యలో అడ్డంకులు ఎదుర్కొంటారు. ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విద్యలో విజయం సాధించాలి. కేతుదశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఉండవు. 21 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా కాస్త ఉపశమనం  కలుగుతుంది. ఈ  సమయంలో విద్య కంటే అలంకరణ, విలాసాల మీదకు మనసు మళ్లుతుంది కనుక మనసును ప్రయత్నపూర్వకంగా విద్యవైపు మళ్ళించి విజయం సాధించాలి. జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది.

41 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. తరువాత కొంత సుఖం తగ్గినా 64 వయసు వరకు జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవ్వచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు సాధ్యమవుతాయి.

ఇక్కడ నొక్కండి -> మృగశిరా నక్షత్రము గుణగణాలు

ఇక్కడ నొక్కండి -> పుష్యమి నక్షత్రము గుణగణాలు

జ్యేష్ఠ నక్షత్ర రెండవ పాదము

వీరికి పట్టుదల అధికం. వీరు శ్రమకు ఓర్చి పని చేయగలరు. బుద్ధి కుశలత కలిగి ఉంటారు. వీరికి వ్యాపారం అంటే కూడా ఇష్టమే. వీరికి  పరిశ్రమలు, కర్మాగారాలు, మెకానిక్ షెడ్ వంటి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. భూ సంబంధిత, విద్య సంబంధిత ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. న్యాయవాద వృత్తి వీరికి అనుకూలిస్తుంది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరగల అవకాశాలు మెండుగా ఉంటాయి.

ఈ జాతకులకు పదేళ్ల వరకు బుధ దశ ఉంటుంది కాబట్టి విద్యారంభం బాగుంటుంది. తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విద్యలో విజయం సాధించాల్సి ఉంటుంది. కేతు దశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఎదురుకావు. 17 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా కొంత ఉపశమనం  కలుగుతుంది. ఉన్నత విద్య సుగమంగా సాగుతుంది. ఈ  సమయంలో విద్యకంటే అలంకరణ, విలాసాల మీద  మనసు ఉంటుంది కనుక మనసును ప్రయత్నపూర్వకంగా విద్యవైపు మళ్ళించి విజయం సాధించాలి.

ఈ నక్షత్ర జాతకులు జీవితంలో త్వరగానే స్థిరపడతారు. సకాలంలో వివాహం అవుతుంది. 37 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. తరువాత కొంత సుఖం తగ్గినా 60 వయసు వరకు జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు సాధ్యమవుతాయి.

ఇక్కడ నొక్కండి -> స్వాతి నక్షత్రం వారి గుణగణాలు

ఇక్కడ నొక్కండి -> అశ్విని నక్షత్రము గుణగణాలు

జ్యేష్ఠ నక్షత్ర మూడవ పాదము

వీరు తమ అభిప్రాయాలను అంత సులువుగా మార్చుకోరు. వీరికి వ్యాపారం అంటే కూడా ఆసక్తి అధికంగానే ఉంటుంది. వీరికి  పరిశ్రమలు, కర్మాగారాలు, మెకానిక్ షెడ్ వంటి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. భూ సంబంధిత, విద్య సంబంధిత ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. న్యాయవాద వృత్తి వీరికి అనుకులిస్తుంది.

ఆరు సంవత్సరాల వరకు బుధ దశ ఉండటం వల్ల విద్యారంభం బాగుంటుంది. తరువాత వచ్చే  7 సంవత్సరాల కేతుదశ కారణగా  విద్యారంభంలోనే కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. ప్రయత్న పూర్వకంగా వాటిని అధిగమించి విద్యలో విజయం సాధించాలి. కేతు దశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఎదురవ్వవు. 13 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా కొంత ఉపశమనం  కలుగుతుంది. మాధ్యమిక విద్య నుంచి సుగమంగా సాగుతుంది. అయితే ఈ సమయంలో విద్యకంటే అలంకరణ, విలాసాల మీదికి మనసు మళ్లుతుంది కాబట్టి.. ప్రయత్నపూర్వకంగా విద్య వైపు వెళ్లి విజయం సాధించాలి.

ఈ నక్షత్ర జాతకులు జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 33 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత కొంత సుఖం తగ్గినా 56 వయసు వరకు జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు సాధ్యమవుతాయి. 74 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల గురు దశ కారణంగా తిరిగి సుఖమైన జీవితం మొదలవుతుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా కొనసాగుతుంది.

ఇక్కడ నొక్కండి -> కృత్తిక నక్షత్రము గుణగణాలు

ఇక్కడ నొక్కండి -> ఉత్తరాభద్రా నక్షత్రము గుణగణాలు

జ్యేష్ఠ నక్షత్ర నాలుగవ పాదము

వీరి మీద గురు బుధ గ్రహ ఆధిక్యత ఉంటుంది. ఇది రాక్షసగణ నక్షత్రం కనుక వీరికి పట్టుదల అధికం. వీరు మేధాసంపన్నులుగా ఉంటారు. మేధోసంబందిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. వీరు విద్యాసంస్థలు స్థాపించి నిర్వహించగలరు. అధికార పదవులను సమర్ధవంతగా నిర్వహించగలరు. వీరికి ఆధ్యాత్మిక విశ్వాసం ఉంటుంది. వీరికి ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కలుగవచ్చు.

రెండు సంవత్సరాల వరకు బుధ దశ ఉంటుంది. తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కారణంగా విద్యలో అడ్డంకులు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విద్యను ప్రారంభం చేయాలి . 4వ తరగతి నుండి విద్యలో అభివృద్ధి ఉంటుంది. కేతుదశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఉండవు. 11 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా కొంత ఉపశమనం  కలుగుతుంది. ఈ  సమయంలో విద్యకంటే అలంకరణ, విలాసాల మీద మనసు మళ్లే అవకాశం ఉంటుంది కనుక.. ప్రయత్నపూర్వకంగా విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి. జీవితంలో తొందరగానే స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 31 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తరువాత కొంత సుఖం తగ్గినా 54 వయసు వరకు జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు.  రాహుదశ  అనుకూలిస్తే విదేశీ పర్యటనలు ఉంటాయి.

ఇక్కడ నొక్కండి -> పూర్వాభద్ర నక్షత్రము గుణగణాలు

ఇక్కడ నొక్కండి -> శ్రవణా నక్షత్ర గుణగణాలు



జ్యేష్ట నక్షత్రము గుణగణాలు

జ్యేష్ట నక్షత్రంలో పుట్టిన జాతకులు సందర్భానుసారంగా అభిప్రాయాలు మార్చుకుంటారు. తమ రహస్యాలను కాపాడుకోవడానికి ఇతరుల రహస్యాలను తెలుసుకుంటారు. చిన్న విషయాలను కూడా సూక్ష్మంగా పరిశీలించి, లోపాలను ఎంచుకుంటారు. ఇతరులలో చిన్న విషయాలను కూడా పరిశీలించి లోపాలను ఎత్తి చూపుతారు. తగాదాలు పెట్టడమే ధ్యేయంగా ఉన్న వారిలా పేరు తెచ్చుకుంటారు. తమకు శక్తి లేకున్నా అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నిస్తారు. ఇతరుల సహాయాన్ని తమ హక్కులుగా వాడుకుంటారు. ఇక ఇతరుల నుంచి వచ్చే విమర్శలు సహించ లేరు. ఆత్మన్యూన్యతా భావం కలిగి ఉంటారు. ఎదుటి వారు సరదాగా చేసే వ్యాఖ్యలు తమను అపహాస్యం చేయడానికే చేసారని భావిస్తారు.

వీరికి శాశ్వత మిత్రత్వం, శాశ్వత స్నేహం ఉండదు. సాంకేతిక రంగంలో ప్రత్యేక విభాగంలో నిపుణత ఉంటుంది. విదేశాల మీద మోజు, విహారయాత్రల మీద ఆసక్తి ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉంటే జీవితం సాఫిగా సాగుతుంది. బాల్యం నుంచి విద్యలో ప్రకాశిస్తారు. కాని ఉన్నత విద్యలకు కొంత ఆటంకం కలిగినా అడ్డంకులను అధిగమిస్తే అభివృద్ధి సాధించగలరు. తగిన వయసులో సంపాదన మొదలవుతుంది. సంపాదించిన ధనాన్ని భవిష్యత్తుకు జాగ్రత్త పరచుకోవాలసిన అవసరం ఉంటుంది. వృద్ధాప్యంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే. జాతక చక్రంలో గ్రహ పరిస్థితులను అనుసరించి ఫలితాలలో మార్పులు ఉంటాయి.

ఇక్కడ నొక్కండి -> రేవతీ నక్షత్రము గుణగణాలు

ఇక్కడ నొక్కండి -> శతభిషా నక్షత్రము గుణగణాలు

ఈ నక్షత్ర జాతకులకు పసుపు, నలుపు రంగులు కలిసివస్తాయి. ఇంకా మంగళవారం వీరికి అన్ని విధాలా అనుకూలిస్తుంది. అలాగే సోమ, బుధవారాలు సామాన్య ఫలితాలనిస్తాయి. జ్యేష్ట నక్షత్రంలో పుట్టిన జాతకులకు 9వ సంఖ్య అన్ని విధాలా కలిసివస్తుంది. అలాగే 9, 18, 36, 1, 2, 3 అనే సంఖ్యలు కూడా అన్ని విధాలా అనుకూలిస్తాయి. కానీ 4, 5, 6 అనే సంఖ్యలు ఈ జాతకులకు కలిసిరావు.

జ్యేష్ట నక్షత్రం:

వృక్షం : తెల్ల లొద్ది

శ్లోకం : జ్యేష్టాత్రితారాశ్చ విషవృక్షశ్చే కంచులా కృతిః
          రక్తవర్ణ చాతకశ్చేవ పటోలీ  మకరం తధా!

ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 69 నుండి  72 వరకు గల శ్లోకములు నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును.

ఫలితం: ఈ నక్షత్రం వారు పైన చెప్పిన విధంగా చేయుట వలన వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భాద్యతలను విజయవంతంగా నిర్వహించ గలుగుతారు. వీరికి వాతం, కాళ్ళు, చేతులకు చెందిన నొప్పులు తగ్గుతాయి.

ఇక్కడ నొక్కండి -> ధనిష్ఠా నక్షత్రము గుణగణాలు

ఇక్కడ నొక్కండి -> పూర్వాషాఢ నక్షత్రము గుణగణాలు

నక్షత్రములలో ఇది 18వ నక్షత్రము.

నక్షత్రం - జ్యేష్ట
అధిపతి - బుధుడు
గణము- రాక్షస
జాతి - స్త్రీ
జంతువు - లేడి
వృక్షము - విష్టి
నాడి - ఆది
అధిదేవత - ఇంద్రుడు
రాశి - 1,2,3,4 పాదాలు వృచ్చికము

జ్యేష్టా నక్షత్ర జాతకుల తారా ఫలాలు

తార నామం తారలు ఫలం

జన్మ తార
ఆశ్లేష, జ్యేష్ట, రేవతి
శరీరశ్రమ

సంపత్తార
అశ్విని, మఖ, మూల
ధన లాభం

విపత్తార
భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ
కార్యహాని

సంపత్తార
కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ
క్షేమం

ప్రత్యక్ తార
రోహిణి, హస్త, శ్రవణం
ప్రయత్న భంగం

సాధన తార
మృగశిర, చిత్త, ధనిష్ట
కార్య సిద్ధి, శుభం

నైత్య తార
ఆరుద్ర, స్వాతి, శతభిష
బంధనం

మిత్ర తార
పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర
సుఖం

అతిమిత్ర తార
పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర
సుఖం, లాభం

జ్యేష్టానక్షత్రము నవాంశ

1 వ పాదము - ధనసురాశి.
2 వ పాదము - మకరరాశి.
3 వ పాదము - కుంభరాశి.
4 వ పాదము - మీనరాశి.

ఇక్కడ నొక్కండి -> మూలా నక్షత్రము గుణగణాలు

అదృష్ట రత్నం

పచ్చ

అదృష్ట వారం

బుధవారం

అదృష్ట సంఖ్యలు

4,5,6

నామ ప్రథమ అక్షరాలు నాలుగు పాదాలు వరుసగా

నో,యా,యీ,యూ



Mercury is the head of the Jyeshta star. It is the demon star, the goddess Indra, the animal deer. These horoscopes try to find out the secrets of others to keep their secrets. Others also look at small things and point out flaws. They make a name for themselves with the goal of getting into fights. They try to achieve the intended task without the power. Use the help of others as their rights. Criticisms are not tolerated. Have a sense of selflessness. Others think the comments they make are meant to ridicule themselves. They make a name for themselves by making false friends and giving bad advice to others. Believers' friends also deceive them as well. They develop a deep hatred for those they do not like. There will be remarkable piety. Even problems seem aesthetically pleasing to them until they get to themselves. Have the mastery of being able to interpret languages. Are at the forefront of social events. A comfortable job and a reciprocal marriage make them happy. The offspring may be at a loss. However, there is no defect in procreation. Annamata, the promise given cannot be kept. Opinions change from time to time. There will be no lasting friendship, no lasting friendship. Specializes in a specialized field of technology. Overseas craze, interest in vacations. Life goes smoothly if addictions are avoided. Shine in education from childhood. But progress can be achieved if obstacles are overcome, even if there are some obstacles to higher education. Earnings begin at the appropriate age. There is a need to take care of the money earned for the future wherever possible. Face some problems in old age. These are just some of the goal setting shareware that you can use. Outcomes vary according to the circumstances of the horoscope cycle.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది