🙏ఉత్తరాభద్రా నక్షత్రము గుణగణాలు
- ఉత్తరాభద్ర నక్షత్ర అధిపతి శని, రాశ్యధిపతి గురువు, మానవగణం, జంతువు ఆవు.
- ఈ నక్షత్ర జాతకులు వినయవిధేయతలు కలిగి ఉంటారు.
- పెద్ద చిన్న తారతమ్యం కలిగి ఉంటారు.
- చదువు మీద మంచి పట్టు సాధిస్తారు.
- ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు. విదేశీ విద్య, అధికార పదవులు, వ్యాపారం కలసి వస్తాయి.
- వివాహ జీవితం బాగా ఉంటుంది. చక్కటి వ్యూహరచనతో పొదుపుగా సంసారాన్ని సాగిస్తారు.
- గొప్పలు చెప్పుకోరు. ఇతరులను కించపరచరు. ఇతరులకు అనవసరంగా ఖర్చు చేయరు.
- ఇతరుల సొమ్మును ఆశించరు.
- భూమి వాహనముల మీద అధికారం కలిగి ఉంటారు.
- కుటుంబ చరిత్ర తండ్రి వలన మేలు జరుగుతుంది.
- ఇతర భాషలు నేర్చుకుంటారు. మంచి హాస్య ప్రియులు.
- అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది.
- అబద్ధాలు చెప్పి ఇతరులను మోసగించరు.
- మంచి స్నేహస్పూర్తి కలిగి ఉంటారు.
- ఉన్నత స్థితిలో ఉన్నవారికి ఇష్టులుగా, సలహాదారులుగా ఉంటారు.
- మంచి స్నేహస్పూర్తి కలిగి ఉంటారు.
- జివితం సాఫీగా జరిగి పోతుంది.
- ముప్పై నుండి నలభై సంవత్సరాల తరువాత జీవితంలో అభివృద్ధి కలుగుతుంది.
- ఇది నక్షత్ర జాతకులు అందరికీ సామాన్య ఫలితాలు.
- జాతక చక్రములో గ్రహస్థితులను అనుసరించి ఫలితాలలో మార్పులు చేర్పులు ఉంటాయి.
ఉత్తరాభాద్ర నక్షత్రం
వృక్షం : వేప
శ్లోకం : ఉత్తరా భాద్ర ద్వితారాశ్చ నింబోద దండాకృతిః
కృష్ణ చక్రవాకశ్చ కరంజ పత్తీషు నీలం తధా!
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 101 నుండి 104 వరకు గల శ్లోకములు ఉత్తరాభాద్రా నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును.
ఫలితం : ఉత్తరాభాద్ర నక్షత్రం వారు పైన చెప్పిన విధంగా చేయుట వలన మంచి వైవాహిక జీవనం ఉంటుంది. ఉన్నత విద్య, ఉన్నత పదవులు లభిస్తాయి. సంతాన సౌఖ్యం కలుగుతుంది. శ్వాసకు సంబందించిన వ్యాదుల నుండి ఉపశమనం లభిస్తుంది.
ఉత్తరాభద్ర నక్షత్రము – గుణగణాలు, ఫలితాలు
నక్షత్రములలో ఉత్తరాభద్రా 26వ నక్షత్రము. ఉత్తరాభద్ర నక్షత్ర అధిపతి శని, రాశ్యాధిపతి గురువు, మానవగణం, జంతువు ఆవు.
ఉత్తరాభద్ర నక్షత్రము మొదటి పాదము
ఈ జాతకులకు 17 సంవత్సరాల పాటు శని దశ ఉంటుంది. శని దశ కాలంలోవిద్య కాస్త మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో అనుకూలత ఏర్పడి ఉన్నత విద్యాభ్యాసం బాగాసాగుతుంది. సకాలంలోనే జీవితంలో స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలో అవుతుంది. 34 సంవత్సరాల తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు, విదేశీ ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. 41 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కాలంలో సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. తరువాత జీవితం సాఫీగా సాగుతుంది. వృద్ధాప్య దశ కూడా సాఫీగానే సాగుతుంది.
ఉత్తరాభద్ర నక్షత్రము రెండవ పాదము
ఈ జాతకులకు 13 సంవత్సరాలు శని దశ ఉంటుంది. శని దశ కాలంలో విద్య మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో అభివృద్ధి కలిగి ఉన్నత విద్యాభ్యాసం సక్రమంగా సాగుతుంది. సకాలంలోనే జీవితంలో స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలోనే జరుగుతుంది. 30 సంవత్సరాల తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కేతుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగావకాశాలు, విదేశీ పర్యటనలు కలిసి వస్తాయి. 37 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కాలంలో సంపాదనలో మంచి ఫలితాలు కలుగుతాయి. తరువాత జీవితం సాఫీగా సాగుతుంది. వృద్ధాప్య దశ కూడా సాఫీగా గడిచిపోతుంది.
ఉత్తరభద్ర నక్షత్రము మూడవ పాదము
ఈ జాతకులకు తొమ్మిది సంవత్సరాలు శని దశ ఉంటుంది. శని దశ కాలంలో విద్య మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో అభివృద్ధి కలిగి ఉన్నత విద్యాభ్యాసం సాఫీగా సాగుతుంది. ఈ జాతకులు సకాలంలో జీవితంలో స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలోనే జరుగుతుంది. 26 సంవత్సరాల తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు, అక్కడిఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. 33 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కాలంలో సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. తరువాత జీవితం, వృద్ధాప్య దశ సాఫీగా సాగిపోతుంది.
ఉత్తరాభద్ర నక్షత్రము నాలుగవ పాదము
ఈ జాతకులకు ఐదు సంవత్సరాలు శని దశ ఉంటుంది. శని దశ కాలంలో విద్య మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో అభివృద్ధి కలిగి ఉన్నత విద్యాభ్యాసం సాఫీగా సాగుతుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలోనే జరుగుతుంది. 22 సంవత్సరాల తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు, అక్కడి ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. 29 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కాలంలో సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. తరువాత జీవితం సాఫీగా సాగుతుంది. 72 సంవత్సరాల వచ్చే18 సంవత్సరాల రాహు దశ కాలంలో కాస్త ఒడిదుడికులు ఎదుర్కొంటారు.
ఉత్తరాభద్ర నక్షత్రము ఫలితాలు
ఈ నక్షత్ర జాతకులకు అన్ని విషయాల మీద కనీస అవగాహన ఉంటుంది. ఇతరులకు అనవసరంగా ఖర్చు చేయరు. ఇతరుల సొమ్మును ఆశించరు. వీరు చదువు మీద మంచి పట్టు సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు. విదేశీ విద్య, అధికార పదవులు, వ్యాపారం కలసి వస్తాయి. వివాహ జీవితం బాగా ఉంటుంది. చక్కటి వ్యూహరచనతో పొదుపుగా సంసారాన్ని సాగిస్తారు.
కుటుంబ చరిత్ర, తండ్రి వలన మేలు జరుగుతుంది. ఇతర భాషలు నేర్చుకుంటారు. మంచి హాస్య ప్రియులు. అబద్ధాలు చెప్పి ఇతరులను మోసగించరు. మంచి స్నేహస్పూర్తి కలిగి ఉంటారు. ఉన్నత స్థితిలో ఉన్నవారికి ఇష్టులుగా, సలహాదారులుగా ఉంటారు. మంచి స్నేహస్పూర్తి కలిగి ఉంటారు. వీరి జీవితం సాఫీగా జరిగి పోతుంది. 30 నుండి 40 సంవత్సరాల తరువాత జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. ఇది నక్షత్ర జాతకులు అందరికీ సామాన్య ఫలితాలు.
నక్షత్ర వివరాలు
నక్షత్రములలో ఇది 26వ నక్షత్రము.
నక్షత్రం - ఉత్తరాభద్ర
అధిపతి - శని
గణము - మానవ
జాతి - స్త్రీ
జంతువు - గోవు
వృక్షము - వేప
నాడి - మధ్య
అధిదేవత - అహిర్పద్రువ్యుడు
రాశి - 1,2,3,4 పాదాలు మీనం
ఉత్తరాభద్రా నక్షత్ర జాతకుల తారా ఫలాలు
తార నామం తారలుఫలం
జన్మ తార
పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర
శరీరశ్రమ
సంపత్తార
ఆశ్లేష, జ్యేష్ట, రేవతి
ధన లాభం
విపత్తార
అశ్విని, మఖ, మూల
కార్యహాన
ిసంపత్తార
భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ
క్షేమం
ప్రత్యక్ తార
కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ
ప్రయత్న భంగం
సాధన తార
రోహిణి, హస్త, శ్రవణం
కార్య సిద్ధి, శుభం
నైత్య తార
మృగశిర, చిత్త, ధనిష్ట
బంధనం
మిత్ర తార
ఆరుద్ర, స్వాతి, శతభిష
సుఖం
అతిమిత్ర తార
పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర
సుఖం, లాభం
ఉత్తరాభద్రానక్షత్రము నవ్వాంశ
1వ పాదము - సింహరాశి.
2వ పాదము - కన్యారాశి.
3వ పాదము - తులారాశి.
4వ పాదము - వృశ్చికరాశి.
అదృష్ట రత్నం
నీలంఅదృష్ట వారం
గురువారంఅదృష్ట సంఖ్యలు
3,8
నామ ప్రథమ అక్షరాలు వరుసగా
దు,శం,ఛా,దా
Uttarabhadra Nakshatra chief Saturn, Rashyadhipati Guru, human race, animal cow. These horoscopes are humble. Have big to small distinctions. Gain a good grasp on education. Do higher education. Foreign education, positions of power, business come together. Marriage life is good. Samsara is carried out sparingly with a good strategy. Don’t say great. Do not humiliate others. Don’t spend unnecessarily on others. Do not expect money from others. Have authority over land vehicles. Family history is best done by the father. Learn other languages. Good comedy lovers. There will be awareness of all things. Do not lie and deceive others. Have good friendships. Those who are in a high position are like, advisors. Have good friendships. Life goes smoothly. Thirty to forty years later life develops. These are common results for all horoscopes. There are changes and additions in the results according to the planets in the horoscope cycle.
I know my life history
రిప్లయితొలగించండిSame that you're given
Curet information thanks