🙏పూర్వాభద్ర నక్షత్రము గుణగణాలు [Telugu WhatsApp]




🙏పూర్వాభద్ర నక్షత్రము గుణగణాలు

  • పూర్వాబాధ్ర నక్షత్రాధిపతి గురువు, అధిదేవత అజైకపాదుడు, మానవగణము.
  • జంతువు సింహము, 
  • రాశ్యాధిపతులు శని, గురువులు. 
  • ఈ నక్షత్రములో జన్మించిన వారికి గురువుల సహకారము, మేధావుల సహకారము, సలహాదారుల వలన మంచి స్థితిని సాధిస్తారు. 
  • అనేక రంగాల గురించి అవగాహన ఉంటుంది. 
  • పెద్దల పట్ల గౌరవం, భయం ఊంటాయి. 
  • వృత్తి, ఉద్యోగాల పరంగా ఎవరి సలహాలు తీసుకోరు. 
  • ఏక పక్ష ధోరని వలన కష్టాలు ఎదుర్కొంటారు. 
  • తమకు అన్నీ తెలుసన్న భావన మంచి చేయదు. 
  • స్నేహాలు, విరోధాలు వెంట వెంటనే ఏర్పడతాయి. 
  • వ్యతిరేకమైన అభిప్రాయాలను వ్యక్తపరచి సమస్యలను ఎదుర్కొంటారు. 
  • ఆతురత వలన తగిన సమయం కొరకు ఎదురు చూసే ఓర్పు నశిస్తుంది. 
  • ఉద్యోగపరంగా నిజాయితీ, సత్ప్రవర్తన కారణంగా విరోధాలు వస్తాయి. 
  • వీరి శక్తిని వీరికి ఇతరులు చెప్పె వరకు వీరికి తెలియదు. 
  • సాహిత్య, కళారంగాలలో రాణిస్తారు. 
  • దేశదేశాలలో విహరిస్తారు. జీవితంలో ఇబ్బందులు ఉంటాయి కాని ధనం అప్పటికప్పుడు అంది వస్తుంది. 
  • అదృష్టం వలన పైకి వచ్చారన్న ప్రచారం సదా ఉంటుంది. 
  • సంతానాన్ని అతిగారాబం చేస్తారు లేక పోతే విచక్షణా రహితంగా కొడతారు. 
  • ఆర్థిక స్థిరత్వం సాధించిన తరువాత దానగుణం ఉంటుంది. 
  • పిసినారితనం ఉండదు. తనకు మాలిన దానం చెయ్యరు. 
  • సామాజిక సేవలో పేరు వస్తుంది. రాజకీయంలో రాణిస్తారు. 
  • ఆధిపత్యపోరు ఇబ్బందికి గురి చేస్తుంది. 
  • వైవాహైక జీవితం సాధారణం. బాల్యం సౌఖ్యవంతంగా ఉంటుంది. 
  • తరువాత జీవితం సాధారణంగా ఉంటుంది.

ఇక్కడ నొక్కండి -> శ్రవణా నక్షత్ర గుణగణాలు
ఇక్కడ నొక్కండి -> మూలా నక్షత్రము గుణగణాలు

పూర్వాభద్ర నక్షత్రము – గుణగణాలు, ఫలితాలు

నక్షత్రములలో పూర్వాభద్ర 25వ నక్షత్రము. పూర్వాబాధ్ర నక్షత్రాధిపతి గురువు. అధిదేవత అజైకపాదుడు. మానవ గణము. జంతువు సింహము. రాశ్యాధిపతులు శని, గురువులు.

పూర్వాభాద్ర నక్షత్రము మొదటి పాదము 

పూర్వాభాద్ర నక్షత్రము మొదటి పాదము మేషరాశిలో ఉంటుంది. మేషరాశి అధిపతి కుజుడు. పూర్వాభాద్ర నక్షత్రము అధిపతి గురువు. ఈ జాతకుల మీద కుజ, గురు ప్రభావం ఉంటుంది. ఇది దేవగణ నక్షత్రము. ఈ నక్షత్ర జాతకులు సత్వగుణ ప్రధానులుగా ఉంటారు. కుజ ప్రభావం కారణంగా ఆవేశం ఉన్నా దాని మీద నియంత్రణ కలిగి ఉంటారు. వీరికి ధైర్యసాహసాలు అధికం. అధ్యాత్మిక విశ్వాసం కలిగి ఉంటారు. ఈ జాతకులకు భూ సంబంధిత, సైనికపరమైన, సాహసాలు ప్రదర్శించగలిగిన రక్షణ శాఖ అగ్నిమాపకం, ఆటవిక సంబంధిత ఉద్యోగాలు అనుకూలిస్తాయి. శిక్షకులు, ఉపాధ్యాయులు వంటి ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. పసుపు వర్ణ, రక్తవర్ణ సంబంధ ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలం. వీరికి వ్యవసాయం కూడా కలిసి వస్తుంది.

ఈ జాతకులకు 14 సంవత్సరాల వరకు గురు దశ ఉంటుంది. ఈ కారణం వల్ల మొదటి నుంచి విద్యభ్యాసంలో రాణిస్తారు. అయినప్పటికీ 14 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా విద్యలో మందకొడితనం నెలకొంటుంది. పట్టుదలతో విద్యలో విజయం సాధించవచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరగవచ్చు. సంపాదన కంటే ఖర్చులు అధికం. 33 సంవత్సరాలలో వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం లభిస్తుంది. 50 సంవత్సరాల తరువత వచ్చే కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలంగా ఉంటే విదేశీ పర్యటనలు, తీర్ధయాత్రలు అనుకూలిస్తాయి. 57 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో మళ్లీ సుఖం మొదలువుతుంది. మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది. వృద్ధాప్య దశ కూడా సుఖంగా గడిచిపోతుంది.

పూర్వాభాద్ర నక్షత్ర రెండవ పాదము

వీరు సత్వగుణ ప్రధానులుగా ఉంటారు. ఉపాధ్యాయులు, ఉన్నత ఉపాద్యాయులు, మత బోధకులు, మత గురువులు వంటి వృత్తి ఉద్యోగాలు అనుకూలం. పసుపు వర్ణ, శ్వేత వర్ణ సంబంధిత ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. జల సంబంధిత, పర్యాటక సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలం.

ఈ జాతకులకు పది సంవత్సరాల వరకు గురు దశ ఉంటుంది. కనుక ఆరంభం నుంచి విద్యలో రాణిస్తారు. అయినప్పటికీ 14 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా విద్యభ్యాసంలో మందకొడితనం నెలకొంటుంది. పట్టుదలతో విద్యలో విజయం సాధించాల్సి ఉంటుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరిగే అవకాశం. 29 సంవత్సరాలలో వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం లభిస్తుంది. 46 సంవత్సరాల తరువత వచ్చే కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలంగా ఉంటే విదేశీ పర్యటనలు, తీర్ధయాత్రలు అనుకూలిస్తాయి. 53 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ  కారణంగా జీవితంలో మళ్లీ సుఖం మొదలవుతుంది. మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది. వృద్ధాప్య దశ కూడా సుఖంగా గడిచిపోతుంది.

పూర్వాభాద్ర నక్షత్రము మూడవ పాదము

పూర్వాభాద్ర  నక్షత్రం వారు సత్వగుణ ప్రధానులుగా ఉంటారు. ఉపాధ్యాయులు, ఉన్నత ఉపాధ్యాయులు వంటి వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. పసుపు వర్ణ వస్తు సంబంధిత ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలం. భూ సంబంధిత, విద్యా సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలం.

ఈ జాతకులకు ఆరు సంవత్సరాల వరకు మాత్రమే గురు దశ ఉంటుంది. ఆరు సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా విద్యలో మందకొడితనం నెలకొంటుంది. పట్టుదలతో విద్యలో విజయం సాధించవచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలిగే అవకాశం. 25 సంవత్సరాలలో వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో జీవితం సాఫీగా సాగిపోతుంది. 42 సంవత్సరాల తరువత వచ్చే కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలంగా ఉంటే విదేశీ పర్యటనలు, తీర్ధయాత్రలు అనుకూలిస్తాయి. 49 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ కారణంగా జీవితంలో మళ్లీ సుఖం మొదలవుతుంది. మిగిలిన జీవితం, వృద్ధాప్య దశ సాఫీగా సాగిపోతుంది.



పూర్వాభాద్ర నక్షత్ర నాలుగవ పాదము

వీరికి ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. పసుపు వర్ణ, శ్వేతవర్ణ వస్తు సంబంధిత ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలం. ఔషధ సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.

ఈ జాతకులకు రెండు సంవత్సరాల వరకు మాత్రమే గురు దశ ఉంటుంది. రెండు సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా విద్యలో మందకొడితనం నెలకొంటుంది. పట్టుదలతో విద్యలో విజయం సాధించవచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలిగే అవకాశం. 21 సంవత్సరాలలో వచ్చే 17 సంవత్సరాల బుధ దశ  కాలంలో ఉన్నత విద్యలో అభివృద్ధి కనిపిస్తుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. జీవితం సాఫీగా సాగిపోతుంది. 38 సంవత్సరాల తరువత వచ్చే కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలంగా ఉంటే విదేశీ పర్యటనలు, తీర్ధయాత్రలు అనుకూలమవుతాయి. 45 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ  కారణంగా మళ్లీ సుఖ జీవనం మొదలవుతుంది. మిగిలిన జీవితం, వృద్ధాప్య దశ సాఫీగా సాగిపోతుంది.

పూర్వాభద్ర నక్షత్రము – ఫలితాలు

ఈ నక్షత్ర జాతకులు సాహిత్య, కళారంగాలలో రాణిస్తారు. వీరికి ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగాలు అనుకూలం. దేశవిదేశాలలో విహరిస్తారు. జీవితంలో ఇబ్బందులు ఉంటాయి కాని ధనం అప్పటికప్పుడు అందివస్తుంది. అదృష్టం వలన పైకి వచ్చారన్న ప్రచారం ఉంటుంది. వీరికి గురువుల, మేధావుల సహకారం ఉంటుంది. ఇతర రంగాల గురించి కూడా మంచి అవగాహన ఉంటుంది. పెద్దల పట్ల గౌరవం, భయం ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా ఎవరి సలహాలు తీసుకోరు. ఏక పక్ష ధోరని వలన కష్టాలు ఎదుర్కొంటారు.

స్నేహాలు, విరోధాలు వెంటవెంటనే ఏర్పడతాయి. వ్యతిరేకమైన అభిప్రాయాలను వ్యక్తపరచి సమస్యలను కొని తెచ్చుకుంటారు. ఉద్యోగపరంగా నిజాయితీ, సత్ప్రవర్తన కారణంగా విరోధాలు వస్తాయి. వీరి శక్తిని వీరికి ఇతరులు చెప్పె వరకు వీరికి తెలియదు. ఆర్ధిక స్థిరత్వం సాధించిన తరువాత దానగుణం మొదలవుతుంది. పిసినారితనం ఉండదు. తనకు మాలిన దానం చెయ్యరు. సామాజిక సేవలో పేరు వస్తుంది. రాజకీయంలో రాణిస్తారు.  వైవాహిక జీవితం సాధారణము. బాల్యం సాఫీగా, తరువాత జీవితం సాధారణంగా ఉంటుంది.

పూర్వాభాద్ర నక్షత్రం

వృక్షం : మామిడి

శ్లోకం : పూర్వాభాద్రాద్వితారాశ్చ ఆమ్రోచఖడ్గాకృతిః
          కృష్ణవర్ణ కపోతశ్చ అర్క పుష్యరాగమేవచ!

ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 97 నుండి 100 వరకు గల శ్లోకములు పూర్వాభాద్ర నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును.

ఫలితం : పూర్వాభాద్ర నక్షత్రమునకు చెందిన వారు పైన చెప్పిన విధంగా చేయుట వలన ఆర్ధిక స్థిరత్వం లభిస్తుంది, రాజకీయ లబ్ధి వరిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కళారంగములలో రాణించగలుగుతారు. పిక్కలకు సంబందించిన సమస్యలు రావు.

నక్షత్ర వివరాలు

నక్షత్రములలో ఇది25వ నక్షత్రము.

నక్షత్రం - పూర్వాభాద్ర
అధిపతి - గురువు
గణము  - మానవ
జాతి - పురుష
జంతువు - సింహం
వృక్షము మామిడి
నాడి.  ఆది
అధిదేవత- అజైక పాదుడు
రాశి - 1,2,3 పాదాలు కుంభం
         4 వ పాదం మీనం

పూర్వాబాధ్ర నక్షత్ర జాతకుల తారా ఫలాలు

తార నామం తారలు ఫలం

జన్మ తార
పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర
శరీరశ్రమ

సంపత్తార
పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర
ధన లాభం

విపత్తార
ఆశ్లేష, జ్యేష్ట, రేవతి
కార్యహాని

సంపత్తార
అశ్విని, మఖ, మూల
క్షేమం

ప్రత్యక్ తార
భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ
ప్రయత్న భంగం

సాధన తార
కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ
కార్య సిద్ధి, శుభం

నైత్య తార
రోహిణి, హస్త, శ్రవణం
బంధనం

మిత్ర తార
మృగశిర, చిత్త, ధనిష్ట
సుఖం

అతిమిత్ర తార
ఆరుద్ర, స్వాతి, శతభిష
సుఖం, లాభం

పూర్వాభద్రా నక్షత్రము నవాంశ

1వ పాదము - మేషరాశి.
2వ పాదము - వృషభరాశి.
3వ పాదము - మిధునరాశి.
4వ పాదము - కర్కాటకరాశి.

అదృష్ట వారం

శనివారం, గురువారం

అదృష్ట రత్నం

పుష్యరాగం

అదృష్ట సంఖ్యలు

5,9

నామ ప్రథమ అక్షరాలు వరుసగా

సే,సో,దా,దీ



Purvabadhra Nakshatradhipati Guru, Goddess Ajaikapadu, Mankind, Animal Lion, Princes Saturn, Gurus. Those born under this star achieve good status due to the cooperation of teachers, the cooperation of intellectuals and advisors. There will be awareness of many areas. Respect for adults and fear. Do not take anyone's advice in terms of profession and jobs. Difficulties due to unilateralism. Feeling we have 'Run out of gas' emotionally. Friendships and antagonisms are formed immediately. Expressing opposing views and facing problems. Anxiety destroys the patience of waiting for the right time. Conflicts come because of job honesty and good behavior. They do not know their power until others tell them. Excel in literature and the arts. Wander in countries. Life is hard but money comes in handy. There is always a campaign to come up with luck. The offspring are abused or otherwise beaten indiscriminately. Donation will be after financial stability is achieved. There will be no misery. He will not donate filth to himself. The name comes from social service. Excel in politics. The struggle for supremacy is embarrassing. Marital life is normal. Childhood is comfortable. Later life will be normal.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది