🙏మూలా నక్షత్రము గుణగణాలు [Telugu WhatsApp]




🙏మూలా నక్షత్రము గుణగణాలు

  • మూలానక్షత్ర అధిదేవత నిరుతి, ఇది రాక్షసగణ నక్షత్రం, రాశ్యధిపతి గురువు, జంతువు శునకం. 
  • ఈ నక్షత్రములో పుట్టిన వారు శక్తిమంతులు. 
  • అసాధారాణ శక్తి వీరి స్వంతము. 
  • అసాధారణ ప్రతిభాపాతవాలు వీరి స్వంతం. 
  • చిన్న తనంలో బంధువుల నిరాదరణకు గురి ఔతారు. 
  • జీవితంలో ప్రతి మెట్టును స్వయం కృషితో సాధిస్తారు. 
  • పోటీ ప్రపంచంలో సాధించడానికి కావలసిన తెలివితేటలు వీరి స్వంతం. 
  • జీవితంలో సాధించిన ప్రతి మెట్టుకు కృతజ్ఞతలు చెప్తూ ఆగిపోక ముందుకు సాగడమే జీవితధ్యేయంగా ముందుకు సాగిపోతారు. 
  • అభివృద్ధి, ఆధిపత్యమే వీరి లక్ష్యం. 
  • బంధుత్వానికి, స్నేహాలకు, నైతిక ధర్మాలకు, దైవభీతికి వీరి మనసులో స్థానం లేదు. 
  • కుటుంబం కొరకు, తల్లి తండ్రుల కొరకు కొంత త్యాగం చేస్తారు. 
  • అణుకువగా ఉండి సంసారం అన్యోన్యంగా ఉంది అనిపించుకుంటారు. 
  • ఆర్థిక వ్యవహారాలు నిర్మొహమాటంగా నడిపిస్తారు. 
  • తాము అనుభవించిన కష్టాలు ఇతరులు అనుభవిస్తున్నప్పుడు సాయం చేయరు. 
  • తనకు తెలిసినా మంచి మార్గాలు, సూచనలు వేరొకరికి చెప్పారు. 
  • రవి, చంద్ర, కుజ దశలు యోగిస్తాయి. 
  • స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువ. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. 
  • శుభకార్యాలు చెయ్యడం కష్టతరమైన యజ్ఞం ఔతుంది. 
  • కీలక సమయాలలో బంధువర్గ అండదండలు నయనో భయానో సాధిస్తారు. 
  • ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. 
  • భాగస్వాములు మోసగిస్తారు. 
  • ఆధ్యాత్మిక చింతన, దానగుణం సామాన్యంగా ఉంటాయి. 
  • స్త్రీదేవతార్చన మంచిది. 
  • అరవై సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగి పోతుంది.

ఇక్కడ నొక్కండి -> శ్రవణా నక్షత్ర గుణగణాలు
ఇక్కడ నొక్కండి -> మూలా నక్షత్రము గుణగణాలు

మూల నక్షత్రం

వృక్షం : తెల్ల గుగ్గిలం

శ్లోకం :  మూలా నవతారాశ్చ వేగీశ కృష్ణే హలాకృతిః
           చక్రవాకేషు రక్తాశోక పుష్పశ్చ రత్నే వైడూర్యం తధా!

ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 73 నుండి 76 వరకు గల శ్లోకములు మూల నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును.

ఫలితం : మూల నక్షత్రం వారు పైన చెప్పిన విధంగా చేయుట వలన ఉత్తమ వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది. సత్ సంతానం కలుగుతుంది. దీర్ఘ వ్యాదులయిన మధుమేహం వంటి వ్యాధులు దరి చేరవు. 

మూల నక్షత్రములో జన్మించిన వారు దైవజ్ఞానము కలవారు .జరగబోవు విషయములను ముందుగానే ఊహించి చెప్పగలరు . అమాయకత్వము కలిగి ఉందురు . అనర్గలముగా మాట్లాడగలరు . ఉపన్యాసములుచేయుదురు .కానీ సభా పిరికి ఉండును . సాహసించి ఏ పనీ చేయరు . అంతా దైవ నిర్ణయమని తలచెదరు . ఏ విషయముల నైనా విడ మరచి చెప్పగల నేర్పరులు . తాము నమ్మిన సిద్ధాంతములకు కట్టుబడి యుందురు . అన్యాయము , అక్రమములను సహించలేరు .

విద్యా సంభంద విషయములలో చాలా తెలివైన వారు . ఏక సంధాగ్రాహులు . విషయ పరిజ్ఞానము కలవారు . కానీ విద్యార్ధి దశలో కొన్ని ఆర్ధిక పరిస్థితుల వలన గానీ , కుటుంబ పరిస్థితుల వలన గానీ విద్యకు ఆటంకము ఏర్పడగలదు . ఈ సమయాన తల్లిదండ్రులు వీరిపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొనుట అవసరము .

నీతి , నిజాయితీ కలవారు . మోసములను తట్టు కొనలేరు . భోధనా సంభంద వృత్తులలో స్థిర పడగలరు . కొంచెం గర్వము , అహంభావము కలవారు . వీరు తమ జీవితములలో రెండు లేక మూడు వృత్తులను చేపట్టగలరు . ధనమే ముఖ్యము అను భావము వీరికి ఉండదు . కుటుంబము , బంధువులు , స్నేహితుల పట్ల మంచి అభిప్రాయమును కలిగి ఉంటారు .అందరూ నీతిగా ఉండాలని కోరు కొంటారు .

వీరు దైవమునకు సంభందించిన కార్యక్రమములలోనూ , ఆధ్యాత్మిక కార్యక్రమములలోనూ ఎక్కువగా పాల్గొంటారు . దైవ సేవ , సమాజ సేవ చేయుటలో ముందుంటారు . మాయా మర్మములు తెలియని వారు . వీరు అందరిని నమ్ముతారు . లౌకికము తెలియని వారు . బంధువులు స్నేహితులు అందరూ దూరమవుతారు . వీరు చివరకు ఏకాకిగా మిగులుతారు. స్వార్ధము , స్వాభిమానము కలవారిని అసహ్యించు కొందురు .

అన్యాయము , అక్రమాలను తట్టుకోలేరు. ఉన్నదానితో తృప్తి చెందుతారు .ప్రగల్భములు పలికెదరు . చేసే పని తక్కువ చెప్పే సోది ఎక్కువగా ఉంటుంది . అసూయ ద్వేషములు కూడా ఉంటాయి . ఈ నక్షత్రములో పుట్టిన వారిని వివాహము చేసుకోన్నచో జీవితభాగస్వామి తండ్రికి అనగా మామ గారికి దోషమని శాస్త్రము ద్వారా తెలియు చున్నది .

అయితే మూలా నక్షత్ర 4 వ పాదములో జన్మించిన వారికి మాత్రమే ఈ దోషము వర్తించు చున్నది . కానీ 1 2 ౩ పాదములలో పుట్టిన వారికి వర్తించుట లేదు . తదుపరి కుటుంబములో మొదటి సంతానము గా జన్మించిన వారికి ఇచ్చి వివాహము జరిపించుట వలన కూడా పై దోషము వర్తించు చున్నది.

మూల నక్షత్రము - గుణగణాలు, ఫలితాలు

నక్షత్రములలో ఇది 19వ నక్షత్రము. మూలానక్షత్ర అధిదేవత నిరుతి, ఇది రాక్షసగణ నక్షత్రం, రాశ్యధిపతి గురువు, జంతువు శునకం, పురుష జాతి.

మూల నక్షత్రము మొదటి పాదము

మూల నక్షత్ర అధిపతి కేతువు. ఈ ప్రభావం వల్ల ఈ నక్షత్ర జాతకుల మీద కుజ కేతు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు రాక్షసగుణ ప్రధానులు. కనుక పట్టుదల అధికంగా ఉంటుంది. వీరికి కేతుగ్రహ ప్రభావం కారణంగా భక్తి  అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఉద్యమాలలో వీరు ముందు ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలు అధికం. సైనిక పరమైన ఉద్యోగాలంటే వీరికి ఆసక్తి ఉంటుంది. పోలీస్ శాఖ కూడా వీరికి అనుకూలమే. అగ్ని, విద్యుత్, భూసంబంధిత వృత్తులు ఉద్యోగ వ్యాపారాలు కూడా ఈ జాతకులకు అనుకూలిస్తాయి.

ఆరు సంవత్సరాల తరువాత వీరికి 20 సంవత్సరాల శుక్ర దశ  వస్తుంది. కనుక విద్యారంభం బాగానే ఉంటుంది. చదువు సమయంలోనే విలాసాల వైపు మనసు మళ్ళే అవకాశం ఉంది కాబట్టి, గట్టి ప్రయత్నంతో విద్యలో విజయం సాధించాల్సి ఉంటుంది. ఉన్నత విద్యాభ్యాసం వీరికి అనుకూలిస్తుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 49 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 67 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పట్టి సుఖం మొదలవుతుంది. మిగిలిన జీవితం.. వృద్ధాప్యం సాఫీగా సాగుతుంది.

మూల నక్షత్రము రెండవ పాదము

వీరు రాక్షసగుణ ప్రధానులు కనుక పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు స్థిరమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు.  అకర్షణీయంగా మాట్లాడగల నేర్పు ఉంటుంది. వీరికి కేతు గ్రహ ప్రభావం కారణంగా భక్తి  అధికంగా ఉంటుంది.  అకర్షణీయమైన వస్తుసేకరణ అంటే ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి  జలసంబందిత, పర్యాటక సంబంధిత వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ఈ జాతకులు చిన్న వయసు నుంచే కళారంగంలో ప్రకాశించగలరు. వీరు దత్తు పోగల అవకాశాలు కూడా ఉంటాయి. ఇతరుల గృహాలలో ఆదరాభిమానాలకు పాత్రులవుతారు. 4 సంవత్సరాల వరకు కేతుదశ  ఉంటుంది. కనుక విద్య ఆరంభం నుంచి ఆటంకం లేకుండా సాగుతుంది. అయినప్పటికీ 4 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా విద్య కంటే అలంకరణ, విలాసాలు అంటే ఆసక్తి ఉంటుంది కనుక ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించాలి.. విజయం సాధించాలి. ఇక వీరు జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలోనే వివాహం జరుగుతుంది. 47 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ  రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 65 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు తగ్గి జీవితంలో తిరిగి అభివృద్ధి, సుఖం మొదలవుతుంది. అనంతరం వృద్ధాప్య దశ సాఫీగా సాగుతుంది.

మూల నక్షత్రము మూడవ పాదము

ఈ జాతకుల మీద బుధ  కేతు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు రాక్షస గుణ ప్రధానులు.. కనుక పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు తమ అభిప్రాయాలను బుద్ధి కుశలతతో ప్రదర్శిస్తారు. వీరికి కేతుగ్రహ ప్రభావం కారణంగా భక్తి అధికంగా ఉంటుంది. వీరికి వ్యాపారం చేయడమంటే అధిక ఆసక్తి. అలాగే వృత్తులు, ఉద్యోగం కూడా వీరికి అనుకులిస్తాయి. అకర్షణీయమైన వస్తు సేకరణ అంటే ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి జల సంబంధిత, పర్యాటక సంబందిత వృత్తి ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఈ జాతకులు చిన్న వయసు నంఉచే కళారంగంలో ప్రావీణ్యత సాధిస్తారు. అయితే వీరికి దత్తుపోగల అవకాశాలు ఉంటాయి. అలాగే ఇతరుల గృహాలలో ఆదరాభిమానాలకు పాత్రులవుతారు.

మూడు సంవత్సరాల వరకు కేతు దశ ఉండే కారణంగా.. విద్య ఆరంభం నుంచి ఆటంకం లేకుండా సాగుతుంది. అయినప్పటికీ మూడు సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా విద్య కంటే అలంకరణ, విలాసాలు వైపు మనసు మళ్లుతుంది. కాబట్టి  పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించాలి. ఈ నక్షత్ర జాతకులు జీవితంలో తొందరగానే స్థిరపడతారు. సకాలంలోనే వివాహం అవుతుంది. 46 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 64 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పట్టి జీవితంలో తిరిగి అభివృద్ధి మొదలవుతుంది. ఆ తర్వాత వృద్ధాప్య దశ సాఫీగా సాగుతుంది.

మూల నక్షత్రము నాలుగవ పాదము

ఈ జాతకుల మీద చంద్ర కేతు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు రాక్షసగుణ ప్రధానులు. దీంతో పట్టుదల గత వ్యక్తులై ఉంటారు. వీరు తమ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. అంతేకాదు వీరు తమ భావోద్వేగాలను మార్చి మార్చి ప్రదర్శిస్తారు. వీరికి భక్తి భావం ఎక్కువే. వీరికి శ్వేతవర్ణ వసువుల సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఔషధ సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరు బాల్యం నుంచి కళారంగంలో ప్రతిభాపాటవాలు చూపిస్తారు. వీరు దత్తుపోగల అవకాశాలు కూడా ఉంటాయి. ఇతరుల ఆదరాభిమానాలకు పాత్రులవుతారు.

వీరికి విద్య నిరాటంకంగా కొనసాగుతుంది. రెండు సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా విద్య కంటే అలంకరణ, విలాసాలపైకి దృష్టి మరలుతుంది. కాబట్టి పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాల్సి ఉంటుంది. వీరు జీవితంలో త్వరగానే స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలో అవుతుంది. 45 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ  రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు సులభమవుతాయి. 63 సంవత్సర తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పట్టి జీవితంలో తిరిగి అభివృద్ధి, సుఖం కొన సాగుతుంది. వృద్ధాప్యం కూడా సాఫీగా సాగిపోతుంది.

మూల నక్షత్రము గుణగణాలు - ఫలితాలు

ఈ నక్షత్ర జాతకులు శక్తిమంతులై ఉంటారు. అసాధారణ ప్రతిభాపాటవాలు ఉంటాయి. దైవజ్ఞానము గలవారై ఉంటారు. భవిష్యత్ ను వాస్తవానికి దగ్గరగా ఊహించి చెప్పగలరు. అనర్గలముగా మాట్లాడే ప్రతిభా ఉంటుంది. ఏ విషయములనైనా విడ మరచి చెప్పగల నేర్పరులు. తాము నమ్మిన సిద్ధాంతములకు కట్టుబడి ఉంటారు. అన్యాయము, అక్రమాలను సహించలేరు. అయితే వీరు కాస్త గర్వం, అహంభావం కలవారు. వీరు తమ జీవితంలో రెండు లేక మూడు వృత్తులను చేపట్టగలరు. కుటుంబం, బంధువులు, స్నేహితుల పట్ల మంచి అభిప్రాయం కలిగి ఉంటారు .అందరూ నీతిగా ఉండాలని కోరుకొంటారు.

పట్టుదలతో, స్వయంకృషితో జీవితంలో ఎదిగే ప్రయత్నం చేస్తారు. ఒక్కోక్క మెట్టు ఎక్కుతూ అభివృద్ధి వైపు సాగిపోతారు. అభివృద్ధి, ఆధిపత్యమే ఈ జాతకుల లక్ష్యం. ఆర్ధిక వ్యవహారాలు నిర్మొహమాటంగా నడిపిస్తారు. తాము అనుభవించిన కష్టాలు ఇతరులు అనుభవిస్తున్నప్పుడు సాయం చేయరు. తనకు తెలిసినా మంచి మార్గాలు, సూచనలు వేరొకరికి చెప్పరు.

రవి, చంద్ర, కుజ దశలు యోగిస్తాయి. స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువ. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. శుభకార్యాలు చేయడం కష్టతరమైన యజ్ఞం అవుతుంది. కీలక సమయాలలో బంధువర్గ అండదండలు నయనో భయానో సాధిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. భాగస్వాములు మోసగిస్తారు. 60 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగి పోతుంది.




నక్షత్రములలో ఇది 19వ నక్షత్రం.

నక్షత్రం - మూల
అధిపతి - కేతువు
గణము - రాక్షస
జాతి - పురుష
జంతువు - శునకం
వృక్షము -వేగిస
నాడి - ఆది
అధిదేవత - నిరుతి
రాశి - 1,2,3,4 పాదాలు ధనస్స

మూలా నక్షత్ర జాతకుల ఫలితాలు

తార నామం తారలు ఫలం

జన్మ తార
అశ్విని, మఖ, మూల
శరీరశ్రమ

సంపత్తార
భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ
ధన లాభం

విపత్తార
కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ
కార్యహాని

సంపత్తార
రోహిణి, హస్త, శ్రవణం
క్షేమం

ప్రత్యక్ తార
మృగశిర, చిత్త, ధనిష్ట
ప్రయత్న భంగం

సాధన తార
ఆర్ద్ర, స్వాతి, శతభిష
కార్య సిద్ధి, శుభం

నైత్య తార
పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర
బంధనం

మిత్ర తార
పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర
సుఖం

అతిమిత్ర తార
ఆశ్లేష, జ్యేష్ట, రేవతి
సుఖం, లాభం

మూల నక్షత్రము నవాంశ

1 వ పాదము - మేషరాశి.
2 వ పాదము - వృషభరాశి.
3 వ పాదము - మిదునరాశి.
4 వ పాదము - కర్కాటకరాశి.

అదృష్ట వారం

శుక్రువారం, గురువారం

అదృష్ట రత్నం

వైడూర్యమ్, పుష్యరాగం

అదృష్ట సంఖ్యలు

5, 9

నామ ప్రథమ అక్షరాలు వరుసగా

యే,యో,బా,బీ



Translated by Google:
The protostar goddess is Niruti, the demon star, the ruler's teacher, the animal dog. Those born under this star are powerful. Extraordinary power is their own. Who own extraordinary talents. The younger self is subject to the displeasure of relatives. Every step in life is achieved with self-effort. They own the intelligence they want to achieve in a competitive world. Stop saying thank you for every step you have taken in life and move forward with the goal of life. Their goal is development and domination. There is no place in their minds for kinship, friendships, moral virtues, piety. For the family, the mother makes some sacrifices for the fathers. Be humble and make whatever seems reciprocal. Financial affairs are run smoothly. They do not help when others are experiencing the hardships they have experienced. He told someone else the good ways and suggestions he knew. Ravi, Chandra and Kuja phases are added. The affection for female offspring is high. The offspring will come into development. Doing good deeds is the hardest Yajna. At crucial times the kinship crutches are achieved by Nayano Bhayano. Travel requires caution. Partners cheat. Spiritual contemplation and generosity are common. Feminism is good. Life goes on smoothly for sixty years.

Those who are born in the original star have theology and can predict things that will happen. Have innocence. Can speak eloquently. Lectures .but the assembly is shy. Dare not do any work. Do not worry that everything is a divine decision. Experts who can forget about any subject. They adhere to the doctrines they believe in. Injustice and wrongdoing cannot be tolerated.

They are very intelligent in academic matters. Single receptors. Have subject knowledge. But at the student stage, education can be disrupted due to certain financial or family circumstances. Parents at this time need to pay special attention to them.

Have justice and honesty. Frauds cannot be tolerated. Can be fixed in teaching related professions. Have a little pride and arrogance. They can pursue two or three careers in their lives. They do not feel that money is important. Have a good opinion of family, relatives and friends .Everyone wants to be moral.

They are mostly involved in theological and spiritual activities. Leading in divine service and community service. Those who do not know the mysteries of magic. They all believe. Those who do not know the world. Relatives and friends are all estranged. They are eventually left alone. Some people hate those who have selfishness and self-esteem.

Injustice and irregularities cannot be tolerated. Satisfied with what you have .Do not boast. The work that is done is more of a fortune telling less. There are also jealous hatreds. It is known by science that it is the fault of the spouse's father, i.e. uncle, to marry someone born under this star.

However, this error only applies to those born in the 4th leg of the source star. But does not apply to those born in 1 2 feet. The above error also applies to those who give birth to the first child born in the next family.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది