ఏమీ తోచనప్పుడు,
లేదా చక్కని సాయంత్రం ఏంచెయ్యాలో చదవండి :
ఒక కప్పు గోధుమ పిండి,
పావు కప్పు గోధుమ నూక,
అర కప్పు పెరుగు.
రెండు బాగా పండిన టమాటాలు,
పది పన్నెండు పచ్చి మిరపకాయలు,
అర కప్పు కొత్తిమీర తరుగు,
అరకప్పులేత కరివేపాకు తరుగు, తగినంత ఉప్పు,
టమాటాలు,
కొత్తిమిర,
కరివేపాకు,
పచ్చి మిరపకాయ లు గ్రైండ్ చేసుకోవాలి..
ఆ మిశ్రమాన్ని ఒక బక్కెట్ లో వేసుకొని బక్కెట్ నిండా నీళ్ళు పోసుకొని బాగా పలుచగా చేసుకోవాలి..
ఆ తరువాత
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
ఆ నీళ్ళను రోడ్ మీద వచ్చే పోయే వాళ్ళ మీద పొయ్యాలి ....
వాళ్ళు గొడవకు వస్తారు కదా మంచి కాలక్షేపం .......
ఈరోజు నా శ్రీమతి పుట్టినరోజు తెలుసా...?"
సంతోషంగా చెప్పాడు చందు
"ఆహా.. అలాగా..! మరి గిఫ్ట్ ఏమిస్తున్నావు...?" అడిగాడు సునీల్
"ఏం కావాలో కోరుకోమని ఆమెనే అడిగితే... మీరేదైనా కొనండి,
కానీ అందులో *డైమండ్* తప్పనిసరిగా ఉండాలని కోరిందిరా"
"భలే కోరిక కోరిందిలే..
ఇంతకీ ఏమి కొనిచ్చావు...?"
"*ప్లేయింగ్ కార్డ్స్*...!!"
😜
చందు వాళ్ళ భార్య : " ఏమండీ ! మాటిమాటికీ లుంగీ వైపు చూస్తూ ఉన్నారు ఎందుకండీ ?
గొణుగుతూ అడిగింది భర్తను..
చందు :
" ఏం లేదే " .....
*కట్టుకున్న దాన్ని జాగ్రత్తగా చూసుకో నాయనా*
అని మన పెళ్లిలో పంతులు గారు చెప్పారుగా .......
అందుకే ."
నరకంలో చందు :
నా భార్యకి ఫోన్ చేసుకోవాలి " అన్నాడు
అక్కడున్న చిత్రగుప్తుడు : "చేసుకో !" అని ఫోన్ ఇచ్చాడు.
కాసేపు మాట్లాడి " ఎంతివ్వాలి " అన్నాడు
చిత్రగుప్తుడితో చందు ..
చిత్రగుప్తుడు :
" నరకం టు నరకం కాల్స్ ఉచితం "
అన్నాడు
🤣
చందు భార్య :ఎక్కడున్నారు..!? ఎందుకు టెన్సన్ గా మాట్లాడుతున్నారు..?
చందు :నేను కారులో ఉన్నా...!
కారు స్టీరింగ్,
క్లచ్,
బ్రేకు,
యాక్సలరేటర్ అన్నీ దొంగలెత్తుకు పోయారు..
ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావ్...?
చందు భార్య: మందు తాగావా..? 😠😠
చందు :కొద్దిగా తీసుకున్నా..😊
ఐనా నేను కారు గురించి మాట్లాడుతుంటే నువ్వు మందు గురించి మాట్లాడతావేంటి..?
చందు భార్య :
ఆ వెనుక సీట్లోనుంచి ముందు సీట్లోకిరా..
అన్నీ కనిపిస్తాయి..
👿👿