శ్రీ లక్ష్మీ నరసింహ పురాణం





*శ్రీ లక్ష్మీ నరసింహ పురాణం*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
నారాయణం నమస్కృత్య నరం చైన నరొత్తమమ్,
దేవీం సర‌స్వతీం చైవ తతో జయ ముదీరయేత్.

"తప్తహాటక కేశాంత ర్జ్వలత్పావక లోచనః
వజ్రాధిక నఖస్పర్శా! దివ్యసింహ! నమో‌‌స్తుతే!

పాంతు‌ వో నరసింహస్య నఖలాంగల కోటయః
హిరణ్యకశిపోర్వక్షః క్షేత్రసృ క్కర్దమారుణాః.

హిరణ్యకశిపుని వక్షం అనే పొలంలోని నెత్తురు బురదతో ఎరుపెక్కిన నాగళ్ల వంటి నర‌సింహుని గోళ్లు మిమ్ము కాపాడుగాక!
     ***           ***           ***

అది మాఘమాసం. ప్రయొగక్షేత్రానికి అటు హిమగిరి తో ఆరంభించి ఇటు వింధ్య కు దక్షిణాణ సహ్యాద్రి వరకూ ఉన్న భూభాగంలో ఎక్కడెక్కడ ఉన్న మునులు,మాఘస్నానానికి వచ్చారు.పద్దతి ప్రకారం స్నానం, ధ్యానం, జపం అయాక మాధవదర్శనం, తరువాత పితృతర్పణం నిర్వర్తించారు.అనుకోకుండా అక్కడ ఒకచోట భరద్వాజమహామునిని చూచారు.పరమానందంగా పలకరింపులూ,యొగక్షేమ ప్రసంగం అయ్యాయి.భరధ్వజుడు అందరికి సముచితంగా చిత్రాసనం వగైరా ఆసనాలు వేశాడు.అంతా కుర్చున్నారు. కులాసా కబుర్లు మాధవ కథా ప్రసంగాలూ అయాయి. అంతలో అక్కడికి పౌరాణిక దివ్యకేతుడు సూతుడు వచ్చాడు. అతని పేరు రోమహర్షుణుడు. వ్యాసుని శిష్యుడు. శ్రృతిస్మృతి పురాణ ఇతిహాసాల విషయం అంతా ఆ గురువు దయవల్ల సొంతం చేసుకున్న బుద్దిమంతుడు సుతుడు.

     భరద్వాజుడు సూతునుకు వందనపూర్వకంగా ఆతిధ్యం నెరవి ఆసనం​పై కూర్చున్నాక తాను కా‌స్త కుడివైపు ప్రక్కగ కూర్చున్నాడు. మునులంతా సూతున్ని వందనాభివందనాలతో ఆనందపరచి తమతమ ఆసనాలపై కూర్చున్నారు.





భద్రద్వాజుణ్ణి సాభిప్రాయంగా చూచారు. బుద్ది మదగ్రేసరుడు,భానుతేజుడు,భరద్వాజుడు వారి చూపు గ్రహించి సూతుణ్ణి చూచి చిరునవ్వుతో అన్నాడు
  
           సూతా ! మనువు శౌనకుడు యజ్ఞం చేసిన సమయంలో వరాహ పురాణంకథ చెప్పావు జ్ఞాపకం ఉందా!

           "చెప్పి ఉంటాను..." అని చిరునవ్వుతోనే అన్నాడు సూతుడు.

          మరి, ఇప్పుడు ఒక పురాణం.... అప్పుడే అడిగాను కూడా.

           నరసింహపురణం... చెప్పాలి. వినవలసిన మునులంతా ఇక్కడ ఉన్నారు. ఏమంటావు?

           పెద్దలమాటకి ఏమంటాను? అందునా ప్రతిభాశాలురకు శిరోమణివి. నీ మాట కాదంటానా? ఏ పద్దతిలో నరసింహపురణం చెప్పాలో? సూచన ఇస్తే ఆ మార్గాన వినిపిస్తాను, అని సవినయంగా అన్నాడు సూతుడు.
         
             మంచిది. నా ప్రశ్నలు విను.

             చారచరాత్మకమైన ఈ జగత్తు ఎవరివల్ల రూపొందింది? దీని పాలకుడెవడు? లయకారుడెవడు? భూ ప్రమాణమెంత? ఎలాంటి ఆరాధనవల్ల నరసింహస్వామి సంతోషిస్తాడు?

             నాలుగుయుగాల లక్షణాలేమిటి? వాటిలో కలియుగం అవస్థ ఎలాంటిది? పుణ్యక్షేత్రాలు, పుణ్యగిరులు,పుణ్యనదులు ఏవి? దేవాదుల సృష్టికథ ఏమిటి? మను-మన్వంతరాల సృష్టి ఎలాంటిది?
           
             నరసింహస్వామిని ఆరాధించిన మనవేతరులు లెవ్వరు? యజ్ఞాలు చేసి ఆ పుణ్యఫలం పొందిన రాజులెవరు?

          ఇదంతా మాకు వివరించి చెప్పవే మహాత్మా! అని భారద్వాజుడు అనగా విని సూతుడు మంచి ప్రశ్నలువేశావు.  మా గురువులు వ్యాసులవారి అనుగ్రహం వల్ల నేను తెలుసుకున్న పురణవిషయం శ్రీనరసింహదేవుని దయ ఆధారంగా చెప్తున్నాను విను భరద్వాజ మునీంద్రా! తపోధనులారా! వినండి అని ఒకసారి గురువును స్మరించాడు చేతులు జోడించి.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺





కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది