లక్ష్మినారసింహ పురాణం 2

లక్ష్మినారసింహ పురాణం 2
🌺🌺🌺🌺🌸🌸🌺🌺🌺🌺🌺
నమో భగవతే తస్మై వ్యాసాయామితతేజసే,
యస్య ప్రసాదాద్వక్ష్యామి వాసుదేవకథా మిమామ్",

ఈ విష్ణుకథను చెప్పడానికి  తగిన ఙ్ఞానమును నాకు ప్రసాదించిన వ్యాసభగవానునకు,  నా గురువునకు నమస్కారం.

భరద్వాజమహర్షీ! మునీశ్వరులారా! నరసింహపురాణంచెప్పే  మహభాగ్యం నాకు కలిగించిన మీ కందరికీ ధన్యవాదములు. ఋషిచంద్రుడు భరద్వాజుడు అడిగిన ప్రశ్నలకు, నేను చెప్పే సమధాన విషయమే నరసింహపురణం అని ప్రసిద్ధమౌతుంది. ఔగాక! ... నేనిప్పుడు చెప్పబొయేది నా నొటిమాటతొ మా గురుదేవుడు చెప్పేదే అని భావించగోరుతున్నాను.

సృస్టిక్రమం:

నారయణుడే చరాచరాత్మకమైన ఈ జగత్తుకి కర్త. నరసింహాది రూపాలు ధరించి పాలకుడై ఉంటాడు. చివర జ్యొతిస్స్వరూపుడైన తనయందే లీనం చేసుకుంటాడు. సారం చెప్పాను. ఇక క్రమం చెప్తాను. విను భరద్వాజా! సర్గం , ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, వంశానుచరితం అని పురాణలక్షణాలు అయిదు.

ఆదిసర్గం, అనుసర్గం, వంశం,మన్వంతరం, వంశానుచరితం అని వాటిని సమీకరించి క్రమంగా చెప్తాను.

ఆదిసర్గం చాలా గొప్పది. అదే మహత్తు. ఈశ్వరస్థితి. పైన దేవతల యొక్క, క్రింద రాజులయొక్క చరిత్ర దానివల్లనే తెలుస్తుంది. సృస్టికి ముందు, ప్రళయానికి పైనా కించిత్తైనా లేదు. అలాటిదశలొ నిరంజనమూ, నిర్వికారమూ, శుద్ధమూ, శాంతమూ, సర్వమునకు మూలమూ 'బ్రహ్మా' అనే సంఙ్ఞకల జ్యొతిర్మూర్తి తనంతతాను అవతరించింది. తానే ఙ్ఞానం. ఙ్ఞాననాయకుడు అయింది ఆ బ్రహ్మస్వరూపం.

సృస్టి చెయ్యవలసే కాలం వచ్చిందని ఆ జ్యోతిర్మూర్తి అనుకున్నది. వెంటనే రూపొందింది 'మహత్తు".

     సాత్త్వికం, రాజసం, తామసం అని  'మహత్తు' మూడు విధాలు, వైకారికం, టైజాసం,భూతాది - ఇది  తామసం - ముడు విధాలు. ఈ వికారమే మువ్విధమైన 'అహంకారం' ఆ మహత్తునుంచే వచ్చింది.                                               ఇక రూపొందిన ప్రాణులలో ధ్వని ఆవశ్యకం, మాహానుమూర్తి అయిన ప్రధాన పురుషుడు ఈ మహత్తత్వంలోంచి   ఒక మాత్రామూర్తిగా 'శబ్దం' పుట్టించాడు. అదే ఆకాశం ,శబ్దానికి మూలం.                                             తరువాతది వాయువు. అది స్పర్శ గుణం. తాకితే తెలుస్తుంది. ఇది చాలా బలిష్టంగా తత్వం.                     తరువాత కనిపించే తత్త్వం ఏర్పడింది. ఆ స్పర్శ లక్షణమైన వాయువు నుంచి  అదే రస ప్రధానమైన జలం  దానినుంచి వచ్చింది గంధ లక్షణమైన పృథ్వి.  ఈ విధంగా ఆయా మాత్రాల రూపాలుగా భూత సృష్టి జరిగింది. ఈ సృష్టి తామసమైన అహంకారం నుంచి ఏర్పడిందని తెలుసుకోవాలి.               అలాగే  ఇంద్రియాలు అయిదున్ను  తేజస్సంబంధములనీ మొత్తం పది అయి, పడనొకండవది మనస్సు అనేది.                                                   చెవులు, కన్నులు, నాలుక, ముక్కు, చర్మం ఈ అయిదున్ను  జ్ఞానేంద్రియాలు.                                    వాక్కు, పాని, పాదం, వాయువు, ఉపస్థం అనే అయిదున్ను   కర్మేంద్రియాలు . ఈ విధంగా ఈ ఇంద్రియ సమ్మేళనతో ఒక రూపం ఏర్పడిందన్న మాట, అది ఒక అందం  గ్రుడ్డు రూపంతో సృష్టి జరిగింది. అదే దేవతలు, దానవులు, పుట్టడానికి మూల భూతమైన పదార్థం, అదే మానవులకు, కొండలకు, సముద్రాలకు, ద్విపాలకు, అడవులకు, క్రిమికీటకాదులకు మూల పదార్థం.                                  హరి రజోగుణమూర్తియై బ్రహ్మ రూపంతో సృష్టి కర్త అవుతున్నాడు. కల్పాంతం వచ్చేవరకు నరసింహాది రూపాలతో ఆ సృష్టిని పాలిస్తున్నాడు. లయ సమయం రాగానే రుద్ర రూపంతో అంతమొందిస్తున్నాడు. ఇదీ సృష్టి కథ.
🌸🌸🌸🌸🌺🌺🌸🌸🌸🌸

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది