గురువు విద్యను నేర్పువాడు. గురువును త్రిమూర్తుల స్వరూపంగా భావించడం, ఆరాధించడం హిందూ సంప్రదాయం. ప్రతి వ్యక్తి జీవితంలో గురువు పాత్ర గణనీయంగా ఉంటుంది. సంస్కృతంలో 'గు' అనగా చీకటి/అంధకారం మరియు 'రు' అనగా వెలుతురు/ప్రకాశం అని అర్థం. అనగా గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి బ్రహ్మ విద్య అనే ప్రకాశాన్ని అందించేవాడు. మతపరంగా గురువు అనేది మార్గదర్శి అన్న అర్థం కూడా ఉంది. అన్ని జంతువులకు, మనుషులకు తల్లి తొలి గురువు. ప్రతి వ్యక్తి జీవితం లోను గురువు పాత్ర అత్యంత కీలకమైనది.
ఆధునిక కాలంలో ఉపాధ్యాయులు మరియు ఉపన్యాసకులు వివిధ దశల్లో విద్యాబోధన చేస్తున్నారు.
"శాంతో దాంతః కులీనశ్చ వినీతః శుద్ధవేషవాన్
శుద్ధాచార సుప్రతిష్టః శుచిర్దక్షః సుబుద్ధిమాన్
ఆధ్యాత్మ జ్ఞాననిష్ఠశ్చ మంత్రతంత్ర విశారదః
నిగ్రహాన గ్రహేశక్తో గురురిత్యభి ధీయతే"!
అనగా శాంతుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, కులీనుడు, వినయవంతుడు, పరిశుద్ధుడు, ఆచార వంతుడు, మంచి వేష ధారణ గలవాడు, గౌరవనీయుడు, పవిత్రుడు, బుద్ధిమంతుడు, మంత్ర తంత్రములలో నిష్ణాతుడు, నిగ్రహానుగ్రహశక్తుడు అయినవాడు గురువు అనిపించుకుంటాడు.
గురు బ్రహ్మ, గురుః విష్ణుః గురుద్దేవో,మహేశ్వరః, గురుసాక్షాత్ పర బ్రహ్మ, తస్మైశ్రీ గురవే నమః
నాలుగు ముఖములు లేని బ్రహ్మ,నాలుగు చేతులు లేని విష్ణువు,
మూడు కన్నులు లేని శివుడు. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు,
గురువే మహేశ్వరుడు.
గురువులు - రకాలు
దీక్షా గురువులు - యోగ్యులైన శిష్యులకు దీక్ష ఇచ్చువారు.
విచార గురువులు - సూక్ష విషయాలను బోధిస్తూ,సందేహములను తొలగించువారు.
దర్పణ గురువులు - దర్పణం వలె నిర్మ లంగా ఉండువారు. శిష్యుడు వారిని సమీపించగానే గురువులో తాను సాక్షాత్కరింప బడతాడు.
క్రౌంచ గురువులు - క్రౌంచ పక్షి ఆహారం కోసం తన పిల్లలను వదిలి దూరంగా వెళుతుంది.అక్కడ తన పిల్లలను స్మృతి లోకి తెచ్చుకోగానే పిల్లలకు కడుపు నిండుతుంది.
చందన గురువులు: - చందన వృక్షంలా వాటికి సమీపంగా ఉన్న వాటిని సౌరభంతో నింపుతుంది. (అరటి,వెదురు చెట్లు సుగంధాన్ని స్వీకరించలేవు)
కచ్ఛప గురువులు - తాబేలు తన బిడ్డపై చూపు ప్రసరించ గానే బిడ్డ శక్తి వంత మవుతుంది.అలాగే గురువు తన అనుగ్రహ వీక్షణం తో శిష్యుడు శక్తి వంతుడగును.
పరాశ గురువులు - తన స్పర్శతో ఇనుమును స్వర్ణంగా మార్చునట్టి పరసువేదిలా,గురువు తన అమృత స్పర్శతో శిష్యుడిని ఆశీర్వ దిస్తాడు.
ఛాయనిధి గురువులు - ఛాయ నిధి అనునది ఒక పక్షిదాని నీడ ఎవరిపై పడుతుందో వారు ఉన్నతులు అవుతారు.
నాద నిధి గురువులు - నాద నిధి రాయికి ఏ శబ్దం తాకితే ఆ శబ్దములు సుశ్రవ్యమౌతాయి.అలాగే శిష్యుని ఆర్త నాదములు గురువుని చేరగానే ఓదార్పు పొందుతాడు.
పిల్లలకు గురువు గొప్పదనాన్ని చదివి వినిపించండి.
మనం గురువులని గౌరవిద్దాం.మన పిల్లలకు మంచి అలవాట్లు చేద్దాం.