👁రాష్ట్రపతి పదవిపై ప్రముఖుల అభిప్రాయాలు
రాష్ట్రపతి పదవి దేశ సమైక్యతకు ప్రతీక. దేశ ప్రగతిలో రాష్ట్రపతి ముఖ్యపాత్ర పోషిస్తారు - సర్వేపల్లి రాధాకృష్ణన్
రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలికి మిత్రునిగా, మార్గదర్శిగా, తాత్వికునిగా వ్యవహరిస్తారు - అంబేద్కర్
రాష్ట్రపతికి మన రాజ్యాంగం కల్పించిన విచక్షణాధికారాలను వినియోగించడంపైనే వారిస్థానం, ప్రాముఖ్యత ఆధారపడి ఉంటుంది - MV పైలీ
42, 44వ రాజ్యాంగ సవరణల తర్వాత రాష్ట్రపతి స్థానం మరింత నామమాత్రంగా మిగిలింది - MP జైన్
👁ప్రధాని పదవిపై ప్రముఖుల వ్యాఖ్యానాలు👁
కేబినెట్ అనే సౌధానికి ప్రధాని మూలస్తంభం వంటి వారు - అంబేద్కర్, లార్డ్ మార్లే
మనదేశ ప్రధాని పదవిని అమెరికా అధ్యక్ష పదవితో పోల్చవచ్చు - అంబేద్కర్
ప్రధానమంత్రి చుక్కల్లో చంద్రుడు - విలియం హార్‌కోర్ట్
పార్లమెంటరీ ప్రభుత్వం అనే పడవను నడిపే కెప్టెన్ - రామ్‌సే మ్యూర్
అనేక గ్రహాలను తన చుట్టూ తిప్పుకునే నక్షత్రం వంటివారు - సర్ ఐవర్ జన్నింగ్స్
ప్రధానికి కల్పించిన అధికారాలను, ప్రాముఖ్యతను పరిశీలించినైట్లెతే వారు నియంతగా మారే ప్రమాదం ఉంది ప్రొ. KT షా
👁గవర్నర్ అధికారాలు 5 రకాలు👁
1. కార్యనిర్వహణ అధికారాలు
2. శాసనపరమైన అధికారాలు
3. ఆర్థికపరమైన అధికారాలు
4. న్యాయపరమైన అధికారాలు
5. విచక్షణాధికారాలు
🏃గవర్నర్ వ్యవస్థపై ప్రముఖుల అభిప్రాయాలు🏌
ఎలాంటి ప్రాముఖ్యంలేని గవర్నర్లను ఎన్నుకోవాల్సిన అవసరంలేదు. నియామక పద్ధతి ఉత్తమమైనది - అంబేద్కర్
గవర్నర్ల రాజ్‌భవన్‌లను సందర్శకులకు మధ్యాహ్న భోజనాలు, రాత్రి భోజనాలు ఏర్పాటు చేసే వసతిగృహాలతో పోల్చినది - భోగరాజు పట్టాభి సీతారామయ్య.
🏹గవర్నర్ వ్యవస్థపై వివిధ కమిటీలు🏆
1. పాలన సంస్కరణల సంఘం (1966-69)
2. రాజమన్నార్ కమిటీ (1969-1971)
3. భగవాన్ సహాయ్ కమిటీ (గవర్నర్ల కమిటీ) (1971)
4. పశ్చిమ బెంగాల్ మెమోరాండమ్ (1977)
5. సర్కారియా కమిషన్ (1983-88)
6. రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ (2000-2002)
7. మదన్‌మోహన్ పూంచీ కమిషన్ (2007-2010)