భారత నావికాదళం

🏹భారత నావికాదళం🏆

-స్వాతంత్య్రానికి పూర్వం దేశంలో రాయల్ ఇండియన్ నేవి ఉండేది. 

-1950లో దీని పేరును ఇండియన్ నేవిగా మార్చారు.

-ఇండియన్ నేవి ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.

-నావికాదళ అధికారులకు శిక్షణ ఇచ్చే నావికాదళ సంస్థ ఐఎన్‌ఎస్ జామెరిన్ కేరళలో ఉంది.

-దేశంలో ప్రాజెక్ట్-28 కింద నాలుగు యాంటీ సబ్‌మెరైన్స్ యుద్ధనౌకలను నిర్మించారు.

అవి...

1. ఐఎన్‌ఎస్ కమోర్తా

2. ఐఎన్‌ఎస్ కవరత్తి

3. ఐఎన్‌ఎస్ కదమత్

4. ఐఎన్‌ఎస్ కిల్టాన్

యుద్ధనౌకలు🏆

1. ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య🌹

-దేశంలోనే అతిపెద్ద యుద్ధనౌక.
-2014 జూన్ 14న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేవిలో ప్రవేశపెట్టి జాతికి అంకితం చేశారు.
-ఇది కీవ్ శ్రేణికి చెందింది. రష్యా నుంచి పొందారు. 
-ఇది యుద్ధ విమానాలను మోసుకెళ్తుంది. 

2. ఐఎన్‌ఎస్ విక్రాంత్🌹

-దీన్ని కొచ్చి షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో తయారు చేశారు.
-స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. ఇది యుద్ధ విమానాలను మోసుకెళ్లే యుద్ధనౌక. విక్రాంత్‌ను 2015 మే10న విధుల నుంచి తొలిగించారు. 

3. ఐఎన్‌ఎస్ విరాట్🌹

-1986లో బ్రిటిష్ రాయల్ నేవి నుంచి కొనుగోలు చేశారు.
-యుద్ధ విమానాలను మోసుకెళ్లగల ప్రపంచంలోనే అతిపురాతన నౌక.
-2016 అక్టోబర్ 23న విధుల నుంచి తొలిగించారు. 
-దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించారు. ఈ యుద్ధనౌకను విశాఖపట్టణంలో పురావస్తు ప్రదర్శనశాలగా ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
-భారత నావికాదళంలో అధికకాలం సేవలందించిన యుద్ధ విమాన వాహక నౌక. 

4. ఐఎన్‌ఎస్ విశాఖపట్టణం🌹

-ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే సూపర్ సోనిక్ క్షిపణులను అమర్చడానికి ఉపయోగిస్తారు.
-దీన్ని ముంబైలోని మజ్‌గావ్ డాక్ లిమిటెడ్ తయారు చేసింది. 
-2015 ఏప్రిల్ 20న మజ్‌గావ్ డాక్ లిమిటెడ్ వద్ద ప్రారంభిచారు.
-శత్రుదేశ నౌకలను నాశనం చేయగల దేశంలోనే అతిపెద్ద యుద్ధనౌక.

ఐఎన్‌ఎస్ మార్ముగావ్🌹

-ప్రపంచంలోనే అత్యాధునిక, స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్షిపణి విధ్వంసక యుద్ధనౌక. ఐఎన్‌ఎస్ మార్ముగావ్‌ను 2016 సెప్టెంబరు 17న ముంబైలో నావికాదళంప్రారంభించింది. దీన్ని విశాఖపట్టణంలో ప్రాజెక్ట్-15బీలో భాగంగా అభివృద్ధి చేశారు. 

ఐఎన్‌ఎస్ చెన్నై🌹

-ఇది కోల్‌కతా తరగతికి చెందిన క్షిపణి విధ్వంసక యుద్ధనౌక. దీనిని అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ముంబైలో ప్రారంభించారు.
-స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ నౌకపై సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్షిపణులు, బరాక్-8, దీర్ఘశ్రేణి క్షిపణులను మోహరించారు. 
-కోల్‌కతా తరగతికి చెందిన ఇతర యుద్ధ నౌకలు: ఐఎన్‌ఎస్ కోల్‌కతా, ఐఎన్‌ఎస్ కొచ్చి
-కోల్‌కతా తరగతి క్షిపణి విధ్వంసక యుద్ధ నౌకల ఉత్పత్తికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ - ప్రాజెక్ట్ 15ఏ
-ఐఎన్‌ఎస్ తరంగిణి ప్రపంచాన్ని చుట్టి వచ్చింది. 
-ఐఎన్‌ఎస్ అశ్విని నావికాదళంలో వైద్య సేవలు అందిస్తుంది.
-2015 డిసెంబర్ 23న విధుల నుంచి తొలిగించిన దేశంలోని తొలి స్వదేశీ యుద్ధ నౌక- ఐఎన్‌ఎస్ గోదావరి.
-2016 జూన్ 29న శత్రుదేశాల జలాంతర్గాములను విధ్వంసం చేసే వరుణాస్త్ర యుద్ధనౌక నౌకాదళంలో చేరింది. ఇది గంటకు 30 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకెళ్తుంది. 
-2016 జూలై 12న ఐఎన్‌ఎస్ కర్ణను భారత నౌకాదళాధిపతి సునీల్ లాంబ విశాఖ తీరంలోని భీమునిపట్నం నేవల్ బేస్‌లో జాతికి అంకితమిచ్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది