🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
🌍 *చరిత్రలో ఈరోజు: జూలై 4*🌍
_*⏱సంఘటనలు⏱*_
*🚩1892: పశ్చిమ సమోవా, అంతర్జాతీయ డేట్ లైన్ మారే చోట ఉంది. అందుకని, 1892 సంవత్సరంలోని రోజులు 367, జూలై 4 తేది సోమవారం, రెండు సార్లు, పశ్చిమ సమోవా దేశంలో వచ్చింది.*
*🚩1946: ఫిలిప్పైన్స్కు అమెరికా నుండి స్వతంత్రం.*
*🚩1947: భారతదేశాన్ని ఇండియా - పాకిస్థాన్ గా విభజించాలని బిల్లు ప్రతిపాదన.*
*🚩1976: పాలస్తీనా ఉగ్రవాదులు ఎయిర్ ఫ్రాన్స్జెట్ లైనర్ విమానాన్ని, ఉగాండా లోని ఎంటెబ్బెవిమానాశ్రయంలో బంధించగా, ఇజ్రాయెల్కమాండోలు మెరుపు దాడి చేసి, ఆ విమానంలో వున్న ప్రయాణీకులను (నలుగురు ప్రయాణీకులు మరణించారు), విమాన సిబ్బందిని రక్షించారు. ఈ బందీల విడుదల కార్యక్రమానికి ఆపరేషన్ థండర్ బోల్ట్ అనే రహస్యమైన పేరు పెట్టారు.*
_*❤జననాలు*❤_
*🚩1790: జార్జి ఎవరెస్టు, భారత సర్వేయర్ జనరల్. (మ.1866)*
*🚩1807: గిసేప్పి గరిబాల్ది, ఇటాలియన్ జనరల్ మరియు రాజకీయ నాయకుడు. (మ.1882)*
*🚩1882: జనమంచి శేషాద్రి శర్మ, సుప్రసిద్ధ తెలుగు కవి, పండితుడు. (మ.1950)*
*🚩1897: అల్లూరి సీతారామ రాజు, విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1924)*
*🚩1898: గుర్జారీలాల్ నందా, భారత జాతీయ రాజకీయనాయకుడు, రెండు సార్లు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. (మ.1998)*
*🚩1904: నేదునూరి గంగాధరం, ప్రముఖ తెలుగు రచయిత. (మ.1970)*
*🚩1918: చల్లా కొండయ్య, ప్రముఖ న్యాయవాది మరియు ప్రధాన న్యాయమూర్తి.*
*🚩1921: గెరాల్డ్ డిబ్రూ, ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.*
*🚩1927: ఉత్పల సత్యనారాయణాచార్య, ప్రముఖ తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. (మ.2007)*
*🚩1927: అంగర సూర్యారావు, ప్రముఖ నాటక రచయిత, చరిత్రకారుడు. (మ.2017)*
*🚩1933: కొణిజేటి రోశయ్య, రాజకీయ నాయకుడు, తమిళనాడు రాష్ట్ర గవర్నరు.*
*🚩1936: గరిమెళ్ళ రామమూర్తి, నటులు, నాటకసంస్థ నిర్వాహకులు. (మ.2004)*
*🚩1938: ఉమా రామారావు, కూచిపూడి నర్తకి, నృత్య దర్శకురాలు, పరిశోధకులు, ఆచార్యులు మరియు రచయిత్రి.*
*🚩1941: ఇందారపు కిషన్ రావు ప్రముఖ అవధాని, కవి మరియు బహుభాషా కోవిదుడు. (మ.2017)*
*🚩1961: ఎం. ఎం. కీరవాణి, ప్రముఖ తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు మరియు గాయకుడు.*
*🚩1961: జోగు రామన్న, కేసీఆర్ క్యాబినెట్‌లో అడవులు, పర్యావరణ మంత్రిత్వశాఖల బాధ్యతలు నిర్వహించనున్నారు.*
_*🍃మరణాలు*🍃_
*🚩1826: జాన్ ఆడమ్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు.*
*🚩1826: థామస్ జెఫర్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (జ.1743)*
*🚩1831: జేమ్స్ మన్రో, అమెరికా మాజీ అధ్యక్షుడు.*
*🚩1902: స్వామి వివేకానంద, భారతీయ తత్వవేత్త, రామకృష్ణ మిషన్ స్థాపకుడు. (జ.1863)*
*🚩1910: జియోవాన్ని షాపరెల్లీ, ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త మరియు విజ్ఞాన చరిత్రకారుడు.*
*🚩1934: మేరీ క్యూరీ, ప్రసిద్ధ భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త. రెండు నోబెల్ బహుమతులు (భౌతిక, రసాయన శాస్త్రాలలో) గ్రహీత. (జ.1867)*
*🚩1936: తాడూరి లక్ష్మీనరసింహ రాయకవి, ప్రముఖ తెలుగు కవి, 19 గాంధాలు రచించారు. (జ.1856)*
*🚩1963: పింగళి వెంకయ్య, భారతదేశ జాతీయ పతాక నిర్మాత.*
*🚩1969: కవికొండల వెంకటరావు, ప్రముఖ తెలుగు కవి, జానపద మరియు నాటక రచయిత. (జ.1892)*
*🚩1986: దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్, ప్రసిద్ధ భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు.*
*🚩2013: గంటి ప్రసాదం, నక్సలైటు నాయకుడుగా మరిన కవి.*
🇮🇳 _*పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳_
*🚩1776 - అమెరికా స్వతంత్ర దినోత్సవం-*
*🚩రువాండా విమోచన దినోత్సవం.*