డబ్బుతో అన్నీ కొనలేం.....
| సవ్జీ ఢోలాకియా |
డబ్బుతో చాలా వస్తువులు కొనొచ్చుగానీ అనుభవాలు,
అనుభూతులు కొనలేం. వాటిని స్వయంగా అనుభవించి
తీరాల్సిందే. డబ్బుకన్నా మానవత్వం, వ్యక్తిత్వం ముఖ్యం.
ప్రతి వ్యక్తికీ సొంత వ్యక్తిత్వం ఉండాలి. ఎవరిపై
ఆధారపడకుండా సొంతంగా బతకగలగాలి. నలుగురిలో
మసలుతూ నైపుణ్యాలు నేర్చుకోవాలి. అనుభవపూర్వకంగానే
సవ్జీ ఢోలాకియా
ఇవన్నీ సాధ్యం. జీవితం చాలా గొప్పది. మనకు అన్నీ
ఇస్తుంది. కృతజ్ఞతాపూర్వకంగా మనమూ ఇతరులకు
ఇవ్వాలి.
ఇవన్నీ మా పిల్లలు తెలుసుకోవడానికే ఈ సంప్రదాయం
ప్రారంభించా. గతంలో నా సోదరుల పిల్లలు పాటించారు.
ఇప్పుడు నా కొడుకూ చేసి చూపించాడు.
- సవ్జీ ఢోలాకియా
| ద్రవ్య ఢోలాకియా |
అనగనగా ఓ రాజుగారు. ఓ రోజు తన కొడుకుని పిలిచి
దేశాటనం చేసి రమ్మన్నారు. ఎక్కడా రాజకుమారుడినని
చెప్పకుండా, ఒక సామాన్యుడిగా గడిపి వస్తేనే పట్టాభిషేకం
చేస్తామన్నారు...
ఇలాంటివి కథల్లోనే చదువుతాం అనుకోకండి. ఇప్పుడు కూడా
ఇలాంటి తండ్రి ఉన్నారు. తండ్రి మాట మీద గౌరవంతో
సామాన్యుడిలా దేశాటనం చేసిన కొడుకూ ఉన్నాడు. ఆ
తండ్రి సవ్జీ ఢోలాకియా (హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్
లిమిటెడ్). అయితే, ఆ కొడుకు ద్రవ్య ఢోలాకియా......!