"ఏ దేశమేగినా ఎందుకాలిడినా.....

"ఏ దేశమేగినా ఎందుకాలిడినా.....


"ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము"

అంటూ ఎలుగెత్తి కీర్తించారు రాయప్రోలు సుబ్బారావు.
దేశానికి ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉంటారు దేశానికి ప్రాణం పోసే వారు ఉంటారు దేశాన్ని ప్రేమించే వారు ద్వేషించే వారు ఉంటారు. అయితే మన జాతీయ జెండాకు అందరూ సమానమే. కాశ్మీర్ నుండి కన్యా కుమారి వరకు విస్తరించిన అఖండ భారత జనవాహిని కీర్తికి దర్పంగా మన దేశ ఔనత్యాన్ని చాటుతూ ఎన్ని అవాంతరాలు ఎదురైనా అఖండ భారతావని ఒక్కటే అని చాటుతూ మన చుట్టూ ఉన్న చెడును విద్వంసం చేసే సైనికులుగా మారమని సందేశం ఇస్తూ 
మన దేశ ఔనత్యానికి ప్రతీకగా రెప రెప లాడుతూ ఎగురుతున్న మన మువ్వన్నెల జెండా కు వందనం.. భారతీయులందరికీ 'వాట్సాప్ పోస్ట్స్...' తరఫున శుభాకాంక్షలు.. ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది