కాకతీయ వీరనారి రాణి ‘రుద్రమ దేవి’. దర్శకుడు గుణశేఖర్ ఆ మహా సామ్రాజ్ఞి సాహస గాథను తెలుగు తెరపై అద్భుత దృశ్య కావ్యంగా చిత్రీకరించారు. అనుష్క, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచి అరుదైన రికార్డు సృష్టించింది.
‘రుద్రమ దేవి’ చిత్రాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా.. అత్యుత్తమ విదేశీ భాషా చిత్ర విభాగంలో ఆస్కార్ అవార్డుల ఎంపిక కమిటీకి పంపింది. చిత్ర దర్శకుడు గుణశేఖర్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకొని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ధన్యవాదాలు తెలిపారు.