ఒక చిన్న ప్రేమ కథ..






ఒక మిడిల్ క్లాస్ సంసారం..
ఒకతల్లి ఆ తల్లికి ఒక కొడుకు..

తల్లి అనారోగ్యంతో బాధపడుతుండేది.
కొడుకు చిన్న ఉద్యోగి.
తన సంపాదన అమ్మ మందులకు ఇంటి అవసరాలకు అడికాడికే సరిపడేవి...

కొడుకు:తోటి స్నేహితులు ,పక్కవాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ పెద్దపెద్ద మొబైల్స్ వాడుతున్నారు నేను ఒక మొబైల్ తీసుకుంటానే అమ్మా...
అమ్మ:నాయనా నీ కంటే నాకు ఏది ఎక్కువ కాదు తీసుకో నానా...మరి డబ్బులున్నాయా..?

కొడుకు: లేదమ్మా..

అమ్మ:మారేలా రా నానా కొంటావు..?

కొడుకు:అప్పు చేసి తీసుకుంటా నే..

అమ్మ:అప్పు చేస్తే ఎలా తీరుస్తావు..?
ఇవిగో నా చెవుల్లో దిద్దులున్నాయి తీసుకెళ్లి అమ్మేసి తెచ్చుకో...

కొడుకు: అమ్మా నువ్వు చాల మంచిదానివే... 
నీకు మళ్ళీ నెల రోజుల్లో మంచి కమ్మలు తెస్తానే...

అమ్మ: ముందు నువ్వు వెళ్లి సెల్లు తెచ్చుకోరా అయ్యా..

కొడుకు మొబైల్ తెచ్చాడు..

వాట్సాప్ పేస్ బుక్ అకౌంట్స్ తెరిచాడు..
కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు ,
చాటింగులు, మీటింగులు,

అమ్మాయితో ప్రేమ పుస్తకం తెరిచాడు.

అమ్మని మరిచారు..

అమ్మాయి ఎలా ఉంటుందో ఎక్కడ ఉందో ఇలా సతమతమై పోతున్నాడు..

ఆ అమ్మాయి ఎప్పుడు బావుండాలి పచ్చగా ఉండాలి అని ఆ అమ్మాయి గుర్తుగా ఒక పూలమొక్కను పెంచుతున్నాడు.
ఆ మొక్కలో తనని చూసుకుంటూ రోజు కాలం వెళ్లదీస్తున్నాడు..

రోజు రాత్రిళ్లు ఒక మంచం లో అతడు అమ్మాయితో చాటింగ్..
ఒక మంచంలో అతని అమ్మ ఆయాసం దగ్గు అనారోగ్యంతో రోజులు లెక్కపెడుతోంది...

ఒకరోజు ఉదయం నిద్రలేచి మొక్కదగ్గరికి వెళ్లి చూసేసరికి ఆ మొక్క వాడిపోయి చచ్చిపోయే స్థితిలో ఉంది..
 
అతడు కంగారుగా వెళ్లి మొబైల్ తీసి టెన్షన్తో ఆ అమ్మాయికి మెసేజ్ కాల్ ఇలా అన్నిటికి ప్రయత్నించా సాగాడు...

అలా ఇలా అలా ఇలా తిరుగుతుంటే అతనికి ఎదో వినిపించలేదే నాకు ఏంటదీ ..ఏంటదీ...ఏంటదీ...?
 అమ్మ ఆయాసం దగ్గు.. రెండు ఆగిపోయాయి..

ఎలా..?

అమ్మ ఆయాసం దగ్గు తో పాటు గుండె కూడా ఆగిపోయింది...

విగతాజీవిలా పడివున్న అమ్మను చూసి నన్ను వంటరిని చేసి వెళ్లిపోయావా అమ్మా....అని గుండెలు పగిలేలా ఏడ్చాడు..

నిజానికి వంటరిని చేసింది అమ్మ కాదు..
 అతడే అమ్మని వంటరిని చేశాడు...
 మొబైల్ మాయలో పడి...

మొక్కలో ఉండేది అమ్మాయి కాదురా
మొక్కలో ఉండేది అమ్మ..
ఆ మొక్కకు నీరు పోసేది రోజు అమ్మే..
అమ్మ లేని రోజు ఆ మొక్కకూడా లేదు...😰😰😰😰😰



Key Words : Telugu WhatsApp

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది