డబ్బులు-డబ్బులు





డబ్బులు-డబ్బులు 

ఉన్నప్పుడు దాచుకోవాలని తెలియలేదు 
లేనప్పుడు ఇంకెవరినీ అడగకూడదు అని తెలుసు 
డబ్బుతో వచ్చిన గౌరవం 
డబ్బుతోనే వెళ్ళిపోతుంది 

డబ్బు చెప్పినట్టు నువ్వు వినడం 
మొదలుపెడితే తరువాత నీ మాట ఎవరూ వినరు 
మనీ అయినా మనిషి చెప్పినట్టు వినాలి 
మనం సృష్టించిన మనీని మనం పాలించాలి 

డబ్బుంటే మర్యాద వెతుక్కుంటూ వస్తుంది 
అదే నీదగ్గర లేదు అని తెలుసుకున్నప్పుడు 
కనీసం నీ పేరు పలకడానికి కూడా ఆలోచిస్తారు 

పరమాన్నం వడ్డించి విందులతో 
హంగామాలు చేస్తారు కానుకలు కురిపిస్తారు 
నీ జేబు కాళీ అని తెలిసిన మరుక్షణం 
ఆకలిగా ఉందేమో అని ఆలోచన కూడా చేయరు 

పెళ్లిరోజు పుట్టినరోజు అంటూ ప్రతి 
పండగకు పలకరిస్తారు
అదే డబ్బు నీదగ్గర లేనప్పుడు 
కనిపించినప్పుడు బావున్నావా అని అడగడం 
కూడా మరిచిపోతారు 

పూలతో అలంకరిస్తారు 
పొగడ్తలతో ముంచేస్తారు 
మాటలతోనే మనసును దోచేస్తారు 
నీదగ్గర దోచుకోడానికి లేదని తెలుసుకున్నాక 
చూపులతో సైతం అవమానిస్తారు 

ఓక్క మాట నిజం 
మనీ ఉంటె మహాత్ముడంటారు 
మనీ లేదంటే మహా పాపాత్ముడంటారు 
ఇదే లోకం తీరు



Key Words : Telugu WhatsApp

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది