అహోబిల శఠగోపయతి ఎలాంటి కలగన్నాడు ? శ్రీరంగ దేవరాయలకు ఏం చెప్పాడు ?
----------------------------
1565 రాక్షసితంగడి యుద్ధంలో రామరాయలు పరాజయం పొందిన విజయనగర సామ్రాజ్యం పూర్తిగా పతనం కాకుండా దాదాపు మరో వంద సంవత్సరాలపాటు తెలుగువైభవ పతాకాన్ని ఎగురవేసింది. ఈ యుద్ధంలో ఆళియరామరాయల తలను ముస్లీంరాజ్యాల కూటమి నరికివేయగా, తదుపరి విద్వంసాన్ని నివారించేందుకు రామరాయల తమ్ముడైన తిరుమలదేవరాయలు ఆపార ధనసంపత్తిని తీసుకొని రాజైన సదాశివరాయలను వెంటబెట్టుకొని పెనుకొండ దుర్గాన్ని చేరాడు. పెనుకొండ రాజధానిగా తుళువవంశం మరో ఐదేండ్లు పాలన చేసింది.
1569లో చివరి తుళువ చక్రవర్తైన సదాశివరాయల మరణాంతరం, 90 సంవత్సరాల వయసులో తిరుమలదేవరాయలు చక్రవర్తిగా పట్టాభిషక్తుడైనాడు.
తిరుమలరాయలు కూడా శ్రీకృష్ణదేవరాయలకు స్వయాన అల్లుడే. కృష్ణరాయల మొదటి కూతురైన తిరుమలాంబను (ఈమెకే మోహనాంగి అనే పేరు కలదు) రామరాయలు పెండ్లి చేసుకోగా మరో కూతురైన వెంగళాంబ, (మరికొందరు చిన్నాంబ అంటారు) తిరుమలదేవరాయలు వివాహమాడాడు.
వెంగళాంబ వలన రఘునాథరాజు, శ్రీరంగరాజు, రామరాజు, తిరుమలరాజనే నలుగురు కొడుకులు కలిగారు.వీరిలో రాక్షసితంగడి యుద్ధంలో రఘునాథరాజు వీరమరణం పొందాడు.
తిరుమలరాజు (తిరుమలదేవరాయలు) మహరాజుగా పెనుకొండలో పట్టాభిషక్తుడు కాగానే రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కొరకు మూడు భాగాలుగా విభజించి ముగ్గురు కొడుకులను రాజప్రతినిధులుగా నియమించాడు.
శ్రీరంగరాయలు ఉదయగిరిని, 1562లో యువరాజుగా ప్రకటితమైన తరువాత పెనుకొండను, శ్రీరామరాజు చంద్రగిరిని, శ్రీరంగపట్టణాన్ని కేంద్రంగా వేంకటపతిరాయల పాలించసాగారు.
తిరుమలదేవరాయలు 93 వ యేట మరణించాడు. ఇతను వైష్ణవమతాభిమానైనప్పటికి ఇతరమతాలను సమానంగా ఆదరించాడు. రామరాజభూషనాన్ని వ్రాసిన భట్టుమూర్తి ఇతని ఆస్థానంలో కూడా వుండేవాడు.
తిరుమలదేవరాయల మరణాంతరం అతని రెండో కొడుకు శ్రీరంగదేవరాయలు 1572లో పెనుకొండలో** పట్టాభిషేకం చేసుకొన్నాడు. శ్రీరంగదేవరాయలు మొదటి నాలుగు సంవత్సరాలు తిరుగుబాట్లను అణచడంలో కాలం గడిపాడు. ఇతను ఎదుర్కొన్న పెనువిపత్తు భీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా దండయాత్రలు. ఇతను కేరళపై దాడిచేసి అక్కడో ప్రతినిధిని ఏర్పరచి 1575లో పెనుకొండ ముట్టడికి బయలుదేరాడు. ఆ సమయంలో శ్రీరంగరాయలు కార్యార్థియై చంద్రగిరి బయలుదేరాడు.
ఆదిల్ షా దండయాత్రను విని తన పర్యటనను రద్దుచేసుకొని శ్రీరంగరాయలు పెనుకొండకు విచ్చేశాడు. ఒంటరిగా భీజాపూర్ సేనలను ఎదుర్కోలేనని శ్రీరంగరాయలు గ్రహించాడు. అప్పటికే గోల్కొండ ఇబ్రహీం కుతుబ్ షాకు భీజాపూర్ ఆదిల్ షాకు వైరముంది. శ్రీరంగరాయలు ఈ వైరాన్ని ఆసరాగా తీసుకొని అనేక విలువైన కానుకలను బహుమతులను ఇబ్రహీం షా కు రాయభారి ద్వారా అందచేసి, సైనికసాయమర్థించాడు.సతోషించిన ఇబ్రహీం 1565 రాక్షసితంగడి యుద్ధంలో పరాజయం పొందిన విజయనగర సామ్రాజ్యం పూర్తిగా పతనం కాకుండా దాదాపు మరో వంద సంవత్సరాలపాటు తెలుగువైభవ పతాకాన్ని ఎగురవేసింది. ఈ యుద్ధంలో ఆళియరామరాయల తలను ముస్లీంరాజ్యాల కూటమి నరికివేయగా, తదుపరి విద్వంసాన్ని నివారించుటకు రామరాయల తమ్ముడు తిరుమలదేవరాయలు ఆపార ధనసంపత్తిని రాజైన సదాశివరాయలను తీసుకొని వెనుకొండ చేరాడు. పెనుకొండ రాజధానిగా తుళువవంశం మరో ఐదేండ్లు పాలన చేసింది.
1569లో చివరి తుళువ చక్రవర్తైన సదాశివరాయల మరణాంతరం 90 సంవత్సరాల వయసులో తిరుమలదేవరాయలు పట్టాభిషక్తుడైనాడు.
తిరుమలరాయలు కూడా శ్రీకృష్ణదేవరాయలకు స్వయాన అల్లుడే. కృష్ణరాయల మొదటి కూతురైన తిరుమలాంబను (ఈమెకే మోహనాంగి అనే పేరు కలదు) రామరాయలు పెండ్లి చేసుకోగా ( మరో కూతురైన వెంగళాంబ, మరికొందరు చిన్నాంబ అంటారు) తిరుమలదేవరాయలు వివాహమాడాడు.
వెంగళాంబ వలన రఘునాథరాజు, శ్రీరంగరాజు, రామరాజు, తిరుమలరాజనే నలుగురు కొడుకులు కలిగారు.వీరిలో రాక్షసితంగడి యుద్ధంలో రఘునాథరాజు వీరమరణం పొందాడు.
తిరుమలరాజు (తిరుమలదేవరాయలు) మహరాజుగా పెనుకొండలో పట్టాభిషక్తుడు కాగానే రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కొరకు మూడు భాగాలుగా విభజించి ముగ్గురు కొడుకులను రాజప్రతినిధులుగా నియమించాడు.
పెనుకొండలో శ్రీరంగరాయలు, ఉదయగిరిని, యువరాజుగా ప్రకటితమైన తరువాత పెనుకొండను, శ్రీరామరాజు చంద్రగిరిని, శ్రీరంగపట్టణాన్ని కేంద్రంగా వేంకటపతిరాయల పాలించసాగారు.
తిరుమలదేవరాయలు 93 వ యేట మరణించాడు. ఇతను వైష్ణవమతాభిమానైనప్పటికి ఇతరమతాలను సమానంగా ఆదరించాడు. రామరాజభూషనాన్ని భట్టుమూర్తి ఇతని ఆస్థానంలో కూడా వుండేవాడు.
తిరుమలదేవరాయల మరణాంతరం అతని రెండో కొడుకు శ్రీరంగదేవరాయలు 1572లో పెనుకొండలో పట్టాభిషేకం చేసుకొన్నాడు. శ్రీరంగదేవరాయలు మొదటి నాలుగు సంవత్సరాలు తిరుగుబాట్లను అణచడంలో కాలం గడిపాడు. ఇతను ఎదుర్కొన్న పెనువిపత్తు భీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా దండయాత్ర. ఇతను కేరళపై దాడిచేసి అక్కడో ప్రతినిధిని ఏర్పరచి 1575లో పెనుకొండ ముట్టడికి బయలుదేరాడు. ఆ సమయంలో శ్రీరంగరాయలు కార్యార్థియై చంద్రగిరి బయలుదేరాడు.