విజయం కంటే ప్రయత్నమే గొప్పది
మన ఆలోచనలే, మన ఆచరణలు. మన ఆచరణలే.. మన గెలుపోటములు! ప్రస్తుతం మనం నివసిస్తున్న ప్రపంచం మన ఆలోచనల ఫలితమే. మన ఆలోచనలు మారకపోతే, ప్రపంచమూ మారదు.
అందరూ, బాగా చదువుకున్నవారే. తెలివైనవారే. పెద్దపెద్ద లక్ష్యాలున్నవారే. అయినా, ఎందుకిన్ని సమస్యలంటే
విజయానికి పొంగిపోతాం. అపజయానికి కుంగిపోతాం. ఆనందం ఆకాశానికెత్తేస్తుంది. విషాదం పాతాళానికి తొక్కేస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి, ఉనికి కోసం పాట్లూ.కుటుంబ జీవితంలో ఒత్తిడి - ఇల్లు కొనాలి, కారు నడపాలి, మనుగడ కోసం పోరాటంలో ఓ ముసుగంటూ తప్పదు. నటనంటూ అనివార్యం.
ప్రపంచంలో అందరికంటే ఆనందంగా ఉన్న వ్యక్తి ఎవరు?
! విశ్వకుబేరుల
! మేధావుల
! సెలెబ్రిటీ
--------- వాళ్లేం అనుకున్నంత ఆనందంగా లేరు
అన్వేషణ హిమాలయాల దాకా వెళ్లింది. ఒంటిమీద కాషాయంతో, చేతిలో భిక్షాపాత్రతో ధ్యానముద్రలో ఉన్న ఓ బౌద్ధ సన్యాసిలో ఆ ఆనంద స్వరూపుడు కనిపించాడు. ఏ వృత్తిలోనూ దొరకని సంతృప్తి అక్కడ దొరికింది
అతని పేరు మాథ్యూ రికార్డ్