నువ్వే ఒక అద్భుతానివి తెలుసుకో!!

నువ్వే ఒక అద్భుతానివి తెలుసుకో!!




నువ్వే ఒక అద్భుతానివి ,,,తెలుసుకో!!

గొప్పగా బ్రతకాలని సంకల్పించు...
నీ ప్రేమని పొందాలంటే కూడా
ఓ అర్హత ఉండాలని గుర్తించు!!!!

కింద పడేసే సమస్యల్లో ఏముంది...?
తలబడి నిలబడగననే నీ నమ్మకంలోనే
ఉంది అసలైన జీవితం....అంతే కదా!!!

భూమిని చీల్చుతూ చిన్న విత్తనం
ఎలా మొలకెత్తుతుందో చూడు 
అంతా ఐపోయిందనే 
నీ నిరాశా భావాలను విడిచి 
కొత్త ఆశల  వైపు అడుగిడు.

జీవితంలో కింద పడని వాడే లేడు
పడకపోతే వాడు మనిషే కాడు
పడినా మరల పైకి రాకుండానూ లేడు కదా!!@

అవసరం లేదని విసిరేసిన వాళ్ళే విస్తుపోయోలా...
పడగొట్టిన వాళ్ళ ముందే తలెత్తుకు 
నిలబడితేనే కదా!!!

నీ నీడ కూడా నువ్వు వెలుగులో
ఉన్నప్పుడే నీ తోడుగా ఉంటుంది!!!!
మరి నువ్వు చీకట్లో ఉన్నప్పుడు 
నమ్మిన వాళ్ళెలా తోడుగా ఉంటారనుకుంటున్నవ్????

సీతాకోక చిలుకను కూడా 
గొంగళి పురుగులా ఉన్నప్పుడు 
అందరూ అసహ్యించుకుంటారు కదా!!!!

జరిగిపోయిన దాన్నే ఆలోచిస్తూ...
గొంగళి పురుగులాగానే మిగిలిపోతావో.:
కొత్త ఆశలతో,ఆశయాలతో.
సీతాకోక చిలుకలా వెలిగిపోతావో;
.తేల్చుకో ;;నీ జీవితాన్ని నువ్వే మార్చుకో;;!!!




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది