"బూర్గుల రామకృష్ణారావు" - Burgula Ramakrishna Rao





"బూర్గుల రామకృష్ణారావు" - Burgula Ramakrishna Rao

☘️బూర్గుల రామకృష్ణారావు ( మార్చి 13 , 1899 -
సెప్టెంబర్ 14 , 1967 ) 
బహుభాషావేత్త,స్వాతంత్ర్యోద్యమ నాయకుడు,రచయిత, న్యాయవాది. 

🌹హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి

🌲రెండు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేసారు.

*జననం*

🍇రామకృష్ణరావు కల్వకుర్తి దగ్గరలోని పడకల్ గ్రామంలో 1899 మార్చి 13న జన్మించారు. వీరి స్వగ్రామం బూర్గుల; ఇంటి పేరు పుల్లం రాజు వారు. అయితే స్వగ్రామమైన బూర్గుల నామమే వీరి ప్రఖ్యాత గృహనామమైనది.

*📚రాజకీయ జీవితం📚*

🌷1912లో వివాహం జరిగింది. ఆమె 1920లో మరణించడంతో, 1924లో మళ్ళీపెళ్ళి చేసుకున్నాడు. 1923లో హైదరాబాదులో న్యాయవాద వృత్తి ప్రారంభించి అగ్రస్థాయికి చేరాడు. న్యాయవాదిగా ఉంటూనే, రాజకీయాల్లో పాల్గొన్నాడు.
ఆంధ్రోద్యమం , గ్రంథాలయోద్యమం ,
భూదానోద్యమం మొదలైన వాటిలో పాల్గొన్నాడు.
మాడపాటి హనుమంతరావు , సురవరం ప్రతాపరెడ్డి మొదలైన వారితో కలిసి పనిచేసాడు.
శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం కు అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేసాడు.

🥀హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు వ్యవస్థాపకుల్లో బూర్గుల ప్రముఖుడు. పార్టి తరపున ఆయన అనేక కార్యక్రమాలకు నేతృత్వం వహించాడు. 1931లో నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన రెండవ ఆంధ్రమహాసభకు బూర్గుల అధ్యక్షత వహించాడు. శాసనోల్లంఘన ఉద్యమంలోను, క్విట్ ఇండియా ఉద్యమంలోను పాల్గొని కారాగారవాసం అనుభవించాడు. 1948 లో పోలీసు చర్య తరువాత హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు అయి, వెల్లోడి ముఖ్యమంత్రిగా సైనిక ప్రభుత్వం ఏర్పడినపుడు, ఆయన రెవిన్యూ, విద్యాశాఖల మంత్రి అయ్యాడు. రెవెన్యూ మంత్రిగా వినోబాభావే ప్రారంభించిన భూదానోద్యమానికి చట్టబద్దత కల్పించాడు.

🌷1952లో మొదటిసారి హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికలు జరిగాక ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో
ముఖ్యమంత్రి అయ్యాడు. పూర్తి మెజారిటీ లేకున్ననూ, మంత్రివర్గంలోనూ సంపూర్ణ సహకారం లేకున్ననూ, పరిపాలన దక్షుడైన ముఖ్యమంత్రిగా పేరుగాంచాడు. 

🌹1956లో హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి, కోస్తా, రాయలసీమ లతో కలిపి
ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు అయినపుడు, కొత్త రాష్ట్రానికి నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. బూర్గుల, కేరళ రాష్ట్రానికి
గవర్నరుగా వెళ్ళాడు. 1960 వరకు కేరళ గవర్నరుగా పనిచేసి, తరువాత 1962 వరకు ఉత్తర ప్రదేశ్ గవర్నరుగా పనిచేసాడు. 1948 జనవరిలో ప్రభుత్వ ఏజెంట్ జనరల్గా హైదరాబాద్ వచ్చిన కె.యం. మున్షీని నిజాం ఆజ్ఞలకు విరుద్ధంగా అందరికన్నా ముందే సందర్శించి పాలకుల ఆగ్రహానికి గురయ్యారు. ఆ సంవత్సరంలోనే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకుడై ప్రజా ఉద్యమానికి సారథ్యం వహించారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి కృషి సల్పిన తీరు విశేషమైనది. 

🌺రాజకీయ రంగంలోనే కాకుండా సాంఘిక సాంస్కృతిక రంగాల్లో వీరు చేపట్టిన సేవ ప్రత్యేకమైనది. ఖాదీ బోర్డు విచారణ సంఘం, మధ్యప్రదేశ్ విషయ పరిశీలన సంఘం, ఆంధ్రప్రదేశ్ భారత్ సేవక సమాజం అధ్యక్షులుగా ఉన్నారు. చరిత్ర, శాస్త్ర విజ్ఞానాల తెలుగు ఉర్దూ అకాడమీ, భారతీయ విద్యాభవన్, ప్రశాంతి విద్వత్ పరిషత్ అధ్యక్షులుగా గొప్ప సాంస్కృతిక సేవలందించారు. క్లాసికల్ లాంగ్వేజి కమిషన్ సభ్యులుగా, దక్షిణ భారత హిందీ ప్రచార సభ ,
సంస్కృత పరిషత్ల ఉపాధ్యక్షులుగా భాషా సేవలు అందించారు.

*🌻సాహితీ వ్యాసంగం🌻*

🌻బూర్గుల బహుభాషావేత్త, సాహితీవేత్త. పారశీక వాఞ్మయ చరిత్ర ఆయన రచనలలో పేరు పొందినది. జగన్నాథ పండితరాయల లహరీపంచకమును,
శంకరాచార్యుల సౌందర్యలహరి ,
కనకధారారాస్తవమును తెలుగులోకి అనువదించాడు. కృష్ణ శతకం, సంస్కృతంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, శారదస్తుతి, గౌరీస్తుతి, వాణీస్తుతి, లక్ష్మీస్తుతి, శ్రీకృష్ణాష్టకం మొదలైనవి ఆయన ఇతర రచనలు.వీరు రచించిన వ్యాసాలు 'సారస్వత వ్యాస ముక్తావళి' పేరుతో అచ్చయింది. పండిత రాజ పంచామృతం, కృష్ణశతకం ,
వేంకటేశ్వర సుప్రభాతం, నర్మద్గీతాలు, పుష్పాంజలి, తొలిచుక్క (కవితలు), నివేదన (కవితలు), పారశీక వాఙ్మయ చరిత్ర మొదలైన గ్రంథాలు వెలువరించడమే కాకుండా ఎన్నో కావ్యాలకు పీఠికలు రాశారు. అనువాద రచనలు కూడా చేశారు. వానమామలై, కాళోజీ , దాశరథి,
నారాయణరెడ్డి ప్రోత్సాహంతో 'తెలంగాణ రచయితల సంఘం' ఏర్పాటు చేసి సాహితీలోక ప్రసిద్ధుడయ్యారు.

*🌻మరణం🌻*

🍀1967 , సెప్టెంబర్ 14 న బూర్గుల మరణించాడు.

*🍀పురస్కారాలు 🍀*

🎖1953లో ఆంధ్ర విశ్వవిద్యాలయం అయనకు
డాక్టర్ ఆఫ్ లిటరేచర్ గౌరవపట్టాను ప్రదానం చేసింది.

🏅1956లో ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లాస్ అనే పట్టాను ఇచ్చింది.



Key Words : Telugu WhatsApp
-----------------------------------------------------------------------------------------------------------------------
"Burgula Ramakrishna Rao" - Burgula Ramakrishna Rao

Borgula Ramakrishna Rao (March 13, 1899 -
September 14, 1967)
Multilingual, independence movement leader, writer, lawyer.

The first elected Chief Minister of the State of Hyderabad

He also served as governor for two states.

* Birth *

Ramakrishna Rao was born on 13 March 1899 in Padakal village near Kalvakurthi. Whose hometown is Burgula; The family name is Pullam Raju. However, their famous home name is the name of their hometown Burg.

* 📚Political life📚 *

Married in 1912. She died in 1920 and remarried in 1924. He started his legal career in Hyderabad in 1923 and rose to prominence. While still a lawyer, he became involved in politics.
Andhra movement, book movement,
Participated in land reclamation etc.
Madapati worked with Hanumantrao, Suravaram Pratapareddy and others.
He served as the President and Secretary of the Sri Krishnadevarayandhra Language Institute.

Burogh was one of the founders of the Hyderabad State Congress. He led many programs on behalf of the party. In 1931, he presided over the second Andhra Mahasabha held at Devarakonda in Nalgonda district. He participated in the civil disobedience movement and the Quit India movement and was imprisoned. After the police action in 1948, the state of Hyderabad was formed and when the military government was formed with Vellodi as the Chief Minister, he became the Minister of Revenue and Education. Vinobabhave as the Minister of Revenue legitimized the land movement started.

In the first democracy formed after the elections to the state of Hyderabad in 1952 for the first time
Became Chief Minister. Without an absolute majority and without the full cooperation of the cabinet, the administration is known as an efficient chief minister.

In 1956, the Telugu-speaking areas of the state of Hyderabad were separated, along with Costa and Rayalaseema.
When Andhra Pradesh was formed, Neelam Sanjeevareddy became the Chief Minister of the new state. Burgula, to the State of Kerala
Went on to become governor. He served as the Governor of Kerala till 1960 and later as the Governor of Uttar Pradesh till 1962. In January 1948, the Government Agent General in Hyderabad keyam Munshi was visited before anyone else in defiance of the Nizam’s orders and incurred the wrath of the rulers. In the same year, he led the Hyderabad State Congress leader in the people's movement. The efforts of the State of Hyderabad to integrate into India are remarkable.

Their service is unique not only in the political arena but also in the socio-cultural spheres. He is the Chairman of the Khadi Board Inquiry Committee, Madhya Pradesh Subject Commission and Andhra Pradesh Bharat Sevaka Samaj. He has rendered great cultural services as the President of the Telugu Urdu Academy of History and Science, Bharatiya Vidya Bhavan and Prashanthi Vidvat Parishad. South Indian Hindi Prachar Sabha, as a member of the Classical Language Commission
Provided language services as vice-president of the Sanskrit Parishads.

* 🌻Literary Studies🌻 * *

🌻Burgular multilingualist, literary figure. The history of Persian literature is well known in his writings. Jagannatha Panditarayala Laharipanchakamunu,
Soundaryalahari of Shankaracharya,
Translated Kanakadhararasthavam into Telugu. His other works include Krishna Shatakam, Sri Venkateswara Suprabhatam, Saradastuti, Gauristuti, Vanistuti, Lakshmistuti, Sri Krishnashtakam etc. in Sanskrit. Pandita Raja Panchamritam, Krishnashatakam,
Venkateswara Suprabhatam, Narmad Gita, Pushpanjali, Tolichukka (Poems), Nivedana (Poems), Parsika Vazhmaya Charithra etc. Translation works were also done. Vanamamalai, College, Dasharathi,
With the encouragement of Narayana Reddy, he formed the 'Telangana Writers' Association' and became famous in the literary world.

* 🌻death🌻 *

Burgula died on September 14, 1967.

* 🍀Awards 🍀 *

Andhra University in 1953 to him
Awarded the Honorary Doctor of Literature.

In 1956 Osmania University conferred the degree of Doctor of Laws.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది