కృతము అనగా చేయబడినది. దీనికే సత్యయుగము అని కూడా పేరున్నది. అంటే ఇక్కడ ధర్మము చేయాలి అని ఎవరూ చెప్పక్కరలేదు, చేయాలి అనుకొని చేయరు. ధర్మం చేస్తారు అంతే. అక్కడ ధర్మం చేయడం స్వభావం. సహజంగా ధర్మం చేయబడే యుగం పేరు కృతయుగం.
త్రేత – మూడు పాదములు ధర్మం ఉంటుంది, ఒక్క పాదం ధర్మం ఉండదు.
ద్వాపర – రెండు పాదములు ధర్మం, రెండు పాదములు అధర్మం.
కలి – కల్యంతే కలహన్ కుర్వన్త్యస్మిన్ ఇతి కలిః – ఒకరికొకరు పడని కాలం పేరే కలియుగం.
పూర్వ యుగాలలో కలిసి ఉండడానికి కారణాలు వెదికే వారు. కలియుగంలో విడిపోవడానికి కారణాలు వెతుకుతూ ఉంటారు.
తరించడానికి అవకాశం ఉన్న గొప్పం యుగం
ఈ నాలుగు యుగాలూ మనలోనే ఎప్పుడైనా సాధించవచ్చు అనే విషయం మహాభారతంలో హనుమంతుడు భీముడికి చెప్తాడు – ధర్మాచరణ చేసేటప్పుడు కృతము, ధర్మం తగ్గుతూ తగ్గుతూ వస్తూ ఉంటే మిగిలిన మూడు యుగాలు మనలోనే వస్తూ ఉంటాయి. అందుకే బయట ఏది ఉన్నప్పటికీ కూడా మనలో మనం ధర్మాచరణ చేయాలి అనుకుంటే కలియుగంలో కూడా మనకి కృతయుగం సాధ్యమే. ఇది ఎలా అంటే ఊరు నిండా ముళ్ళ కంపలు, గాజుపెంకులు పరచుకొని ఉంటే మనం ఊరంతా తివాచీ పరచనక్కర లేదు. మన కాలికి చెప్పులు వేసుకొని వెళ్తే చాలు.
సమూహమునందు అధర్మం ఉన్నా వ్యక్తి ధర్మమునందుంటే అతడు కాపాడబడతాడు. రామాయణ కాలంలో లంకలో ఇది కనబడుతుంది మనకి. రావణుడు చేసిన అకృత్యాలకు
అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః - అప్రియమైనది, హితమైనది చెప్పేవాడు ఉండడు, వినేవాడు ఉండడు. – మారీచుడు రావణునితో.
హనుమంతుడు లంకను తగులబెట్టినప్పుడు లంక అంతా దగ్ధం అయింది కానీ విభీషణుని ఇల్లు దగ్ధం కాలేదు. ధర్మమునందు నిలిచి ఉన్నాడు గనుక అగ్ని దహించలేదు విభీషణుని ఇంటిని. చుట్టూ అధర్మం ఉన్నా మనం ధర్మమునందు ఉంటే ప్రకృతి వైపరీత్యాల నుండి కానీ, మరి దేనినుంచి అయినా మనల్ని మనం కాపాడుకోగలం.
ధర్మముతో కలియుగంలో కూడా కృతయుగం సాధన చేసుకోవచ్చు. 👆👆👆