సదాచారం ఒక క్రమశిక్షణ.

సదాచారం ఋషులు మనకు అందించిన అద్భుతమైన విజ్ఞానం. 
సదాచారం ఒక క్రమశిక్షణ. 
క్రమశిక్షణతో జీవితం సాగినప్పుడు చిత్తానికి ఒక కుదురు ఏర్పడుతుంది. శుద్ధత ఏర్పడుతుంది. అప్పుడు ఇహము, పరము సాధించగలం. 

సదాచారం ప్రవర్తిల్లినప్పుడే భగవదనుగ్రహం లభిస్తుంది కనుకనే లలితా సహస్రనామాలలో ‘సదాచారప్రవర్తికా’ అనే నామం ఉన్నది. 

వేదములు, ధర్మశాస్త్రములు భగవంతుని ఆజ్ఞారూపములు.
దినచర్య క్రమాన్నే సదాచారం అని తెలుసుకోవాలి. 

ఔర్వ మహర్షి సగర చక్రవర్తికి చెప్పిన సదాచార పద్ధతులు: 

బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి సూర్యోదయానికి ముందే స్నానాదులతో శుద్ధి కావాలి. 
నిద్రలేవగానే గురువును, తల్లిదండ్రులను అటుతర్వాత త్రిమూర్తులను, త్రిశక్తులను, గంగాది పుణ్య నదులను స్మరించుకొని కార్యాచరణ గురించి సంకల్పించుకోవాలి. ఆ క్షణం చేసే సంకల్పానికి ఒక బలం ఉంటుంది. 
ధర్మం లోకం కోసం కాకుండా వ్యక్తి క్షేమం కోసం చేయాలి. వ్యక్తి క్షేమం కోసం చేసే ధర్మం లోకానికి కూడా క్షేమం కలిగిస్తుంది. 
త్రివర్గసమదర్శినః – ధర్మార్థకామములయందు సమదృష్టి ఉండాలి. 
ధర్మానికి బాధ కలిగించే అర్థకామాలను ఎప్పుడూ స్వీకరించరాదు.
ఉత్తరత్రా సుఖాన్ని కలిగించనటువంటి విషయాలను విడిచిపెట్టాలి. 
లోకం దూషించిన ధర్మాలను కూడా విడిచిపెట్టాలి. ఒకప్పుడు ధర్మంలా కనిపించినవి తరువాతి కాలాలలో వర్తించవు. ఉదాహరణకి బాల్యవివాహములు, సతీసహగమనము మొదలైనవి. లోక దూషితం కాని ధర్మాలను ఆచరించాలి. 👆👆👆

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది