వ్యక్తిగత విజయం కోసం కాదు... లోక క్షేమం కోసం మరణాన్ని చిరునవ్వుతో ఆహ్వానించడం మన లక్ష్యం..





Death for the cause is our goal, not success..

వ్యక్తిగత విజయం కోసం కాదు... లోక క్షేమం కోసం మరణాన్ని చిరునవ్వుతో ఆహ్వానించడం మన లక్ష్యం..
- స్వామీ వివేకానంద..
"లోక హితం మమకరణీయం" చేసే ప్రతీ పనికూడా సమాజానికి మేలు కలిగేదిగా ఉండాలని ఆర్ష ధర్మం బోధిస్తుంది..ఈ దేశంలో ఇదొక పరంపర గా రావడం ఆనంద పడాల్సిన విషయం..పురాణాల్లో రాక్షస సంహారం కొరకు దధీచి మహర్షి తన వెన్నుముక ఇవ్వడం నుండి విదేశీ రాక్షస మూకల నుండి తన దేశాన్ని కాపాడుకోవడం కోసం త్యాగం చేసిన ప్రాణాల సంఖ్య లెక్కించనలవికాదు..1857నుండి1947వరకూ ఈ దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించిన వారి సంఖ్య మూడు లక్షల యాభైవేలకు పై మాటే.. వ్యక్తిగత విజయం కోసం కాకుండా సమాజం కోసం చేసిన త్యాగాలు, పనులు ఆ భారత భూమిలో ప్రతీ అడుగులోనూ స్పష్టంగా కనబడుతూనే ఉన్నాయి. 
ఈ మధ్య కాలంలో పాశ్చాత్య విద్యా ప్రభావం వలన వ్యక్తిగత విజయాలకే ప్రాధాన్యత నీయడం శోచనీయం.
తిలక్ మహాశయులన్నట్లు ఏవీ తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు అన్న చందంగా ఆర్ష ధర్మం నిర్దేశించిన మార్గాన్ని ఆచరించే వారి సంఖ్యే తగ్గిపోయింది..ప్రతీ వ్యవహారంలోనూ విజయం కోసమే ఆరాటం, పోరాటం..సాధించే విజయాల సంఖ్యను చూసుకుంటూ మురిసిపోవడం తప్ప ఈ సమాజ అభివృద్ధిలో నా పాత్ర ఏమిటి అని ప్రశ్నించుకునే నాధులే కరువయ్యారు..
ఒకటో తరగతి ఫస్ట్ క్లాస్ లో పాసవ్వడమే ఘన విజయంగా భావించే వారి సంఖ్యకు కోదవే లేదు.. ఇక చదువు తరువాత ఉద్యోగం.. ప్రభుత్వో ద్యోగం సంపాదించడం కోసమే ఈ జన్మ అనే స్తాయిలో ఉన్నవారిని చూస్తూనే ఉన్నాము..పోటీ పరీక్షలు వ్రాసి వ్రాసి అలసి సొలసి పోతున్న భావి భారత పౌరులతో ఈ దేశపు గృహాలన్నీ కిక్కిరిసిపోయాయి..ఈ జీవిత లక్ష్యమ్ ఫలానా ఉద్యోగం, వ్యాపారం కోసమో కాదు..ఉద్యోగం, వ్యాపారం అనేవి బ్రతకడం కోసమే అని గ్రహించుకోవాలి..ఈ జీవిత లక్ష్యం మోక్షం కోసమే నని చిన్నవయసులోనే అర్ధం ఐయ్యేలా చెప్పగలగాలి.. మోక్ష సాధనకు నిష్కామ కర్మ యోగం సులభమైనదని చెప్పగలగాలి..సమాజానికి మేలు చేసే పనులు మాత్రమే చేయడం ద్వారా నిష్కామ కర్మ యోగం సులభమని తెలియచేయాలి..ఆధ్యాత్మికత అంటే చవటలు, ఎందుకు పనికిరాని వారు సాధన చేసేది అని భావించే (80శాతం పైగానే హిందువులున్న) ఈ దేశంలో ఈ (స్వామిజీ వే సుమా) మాటలు రుచించక పోవచ్చు..కానీ ఆయన మాటల ప్రకారం... తన కాలం కంటే ముందుగా ఆలోచించేవాడు ఖచ్చితంగా తిరస్కరించబడతాడు.. తిరస్కరించబడినా రేపైన ఇది అక్కున చేర్చుకోబడుతుంది కాబట్టి ఆనందమే. 
స్వామి వివేకానందుల వారికి హృదయ పూర్వక ప్రణామములతో..

స్వామీ వివేకానంద ఫౌండేషన్, 
కొవ్వూరు, పశ్చిమగోదావరి జిల్లా




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది