ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇదేనేమోమరి

తనకు మెట్లెక్కడం భారమనుకుని , *లిఫ్ట్* ను కనుక్కుని ఎక్కడం
అలవాటు పడ్డాక , తద్వారా పెరిగిన కొవ్వునుకరిగించు కోవడానికై *మళ్లీ మెట్లెక్కుతున్నాడు* !!!!

నడక కష్టమనీ, ఎంతో శ్రమపడి  కారు ను తయారు చేసుకుని,
వాడటం మొదలెట్టాక, లావెక్కిన తనను తాను.. తగ్గించు కోవడానికై, వాఁకింగ్ పేరుతో *మళ్లీ రోడ్డున పడ్డాడు మనిషి* !!

హరిత విప్లవం అంటూ అనేక రసాయనాల్ని వాడి, పంటలను పెంచుకున్నానని గర్వపడేలోగా, వాటి దుష్ప్రభావం తెలిసి మళ్లీ *ఆర్గానిక్ పేరు జపిస్తున్నాడు!!*

పారిశ్రామిక విప్లవంతో ఏదో సాధించాననుకుని మిడిసిపడ్డ మనిషి, తను నాశనం చేసిన 
ప్రకృతిని బ్రతికించు కోవడానికి   మళ్లీ *పర్యావరణ మంత్రం పఠిస్తున్నాడు!!*

పిజాలు, బర్గర్లు అంటూ వెంపర్లాడిన మనిషి కరొనా పుణ్యమా అని మళ్లీ *ఆరోగ్యకరమైన ఇంటి తిండికి అలవాటు పడుతున్నాడు!!*

ఇంగ్లీష్ మందులంటూ, జిమ్ములంటూ పరిగెత్తిన మనిషి  కరొనా నుంచి రక్షణ కై   మళ్లీ *యోగా, ప్రాణాయామం, ఆయుర్వేదం అనడం నేర్చుకుంటున్నాడు!!!*

ఉమ్మడి కుటుంబాలని చీదరించుకుని, చిన్న కుటుంబాలతో సుఖపడదామనుకున్న మనిషి మళ్లీ *అంతా కలిసుందాం రా అంటూ పాత బంధాల వైపే మొగ్గు చూపు తున్నాడు!!!*

పడచు పిల్ల లాంటి పట్నం మోజులో పడి తల్లి లాంటి పల్లెను మరచిన మనిషి, కరోనా భయంతో, ఫామ్ హౌజుల పేరిట, *పచ్చని ప్రకృతి కొరకై మళ్లీ పల్లె బాట పట్టాడు* !!

 *ఓల్డ్  ఈజ్ గోల్డ్ అంటే ఇదేనేమోమరి*!!
🌻💮⚘🌸🌺💐🌷🌹🌾🌴🪴🌱🌵🌿🪴🌴🌾🍀




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది