వ్యాయామం చేయడం వల్ల శరీరం దృఢంగా ఆరోగ్యంగా ఉంటుందని అందరికీ తెలిసిందే.

వ్యాయామం చేయడం వల్ల శరీరం దృఢంగా ఆరోగ్యంగా ఉంటుందని అందరికీ తెలిసిందే.

 అయితే అలా ఉండటానికి కారణం ఏమిటనేది సదరన్‌ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కనుగొన్నారు. అదేమంటే- వ్యాయామం చేసేటప్పుడు మోట్స్‌-సి అనే హార్మోన్‌ విడుదలవుతుందనే విషయాన్ని కొన్నేళ్ల క్రితమే గుర్తించారు. అయితే అది ఎందుకనేది అప్పట్లో తెలియలేదు. 

🌿పైగా ఈ హార్మోన్‌ జన్యుసమాచారం శరీరంలోని ఇతర జన్యువులకన్నా భిన్నంగా ఉందనీ, వయసురీత్యా పనితీరు తగ్గిన మైటోకాండ్రియా కణాల పనితీరుని ఇది మెరుగుపరుస్తుందనీ తాజాగా గుర్తించారు. 

ఇందుకోసం వీళ్లు రోజూ వ్యాయామం చేసేవాళ్లను ఎంపికచేసి వ్యాయామానికి ముందూ తరవాత వాళ్ల శరీరంలో ఈ హార్మోన్‌ శాతాన్ని లెక్కించారట. 

🌿వ్యాయామానికి ముందుకన్నా తరవాత ఆయన హార్మోన్‌ శాతం 12 శాతం పెరిగిందట. 

ఈ విషయాన్ని నిర్ధరించేందుకు ఎలుకలకి ఈ హార్మోన్‌ను ఇంజెక్టు చేయగా వృద్ధ దశలో ఉన్న ఎలుకలు సైతం చక్కగా ట్రెడ్‌మిల్‌ చేయడమేకాదు, బాగా నడవడం ప్రారంభించాయట.

 👉👉దీన్నిబట్టి వ్యాయామం చేసేవాళ్లు వృద్ధాప్యంలోనూ ఫిట్‌గా ఉండటానికి కారణం ఈ హార్మోన్‌ విడుదల కావడమే అని భావిస్తున్నారు. 🍁




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది