🍁మానవ సంబంధాలకు..🍁


బౌద్ధంలో ‘సిగాలోవాదసుత్త’ అనేది మానవ సంబంధాలకు సంబంధించినది. 

సమాజంలో మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, పెద్దల పట్ల ప్రేమానురాగాలు, వారి పట్ల చూపాల్సిన బాధ్యతలు ఎంత ఆరోగ్యకరంగా, ఉన్నతంగా ఉండాలో ఆ సుత్తం చెబుతుంది. 

అలాంటి ఉత్తమ సామాజిక సంబంధాలు బౌద్ధ సాహిత్యంలో అనేక చోట్ల కనిపిస్తాయి. అందుకే మానవ సంబంధాల మణిమకుటం బౌద్ధం. 

ప్రపంచీకరణ కాలంలో వయోధికులు తమ ఇళ్ళలోనే శరణార్థులుగా జీవించాల్సి వస్తోంది. 

వృద్ధుల పట్ల చిన్న చూపు ఇప్పుడే కాదు, కుటుంబ వ్యవస్థ పుట్టినప్పటి నుంచీ అంతో ఇంతో ఉంది. 

ఈ సమస్య బుద్ధుని కాలంలో కూడా ప్రధానంగా ఉన్నట్టు బౌద్ధ సాహిత్యం ద్వారా తెలుస్తోంది.🍁

❣❣❣❣❣❣❣❣❣❣❣❣




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది