🙏నువ్వు తక్కువ వాడివి కావు సామీ...🤔😍🤩





🙏నువ్వు తక్కువ వాడివి కావు సామీ...🤔😍🤩

పుల్లమామిడి,నిమ్మ,n ఉసిరి ,ఉప్పు,కారం,మొ. సృష్టించావు. 
 ఊరగాయ పెట్టుకుని తెలివి ఇచ్చావు, కానీ ఆశపడి తింటే అల్సర్,బి.పి బహుమతిగా ఇస్తున్నావు. 

*నువ్వు తక్కువ వాడివి కావు సామీ...*
పంచదార, బెల్లం,తియ్యటి పళ్ళు ఇచ్చావు, 
కానీ సామీ!  ఆత్రపడి  తింటే షుగర్ వ్యాధి బహుమతిగా ఇస్తావు.

*నువ్వు తక్కువ వాడివి కావు సామీ...*
మా కాలి గోటికి సరిపోని దోమలను సృష్టించావు.  
శుచి శుభ్రత లేకపోతే, మాచెమట వాసనతోనే  గుర్తుపట్టి మానెత్తురు తాగుతూ మాకు నిద్రపట్టని స్థితి కల్పించావు. 

*నువ్వు తక్కువ వాడివి కావు సామీ...*
సంపదలు, ఆస్తులు మా చేత కల్పించి మాలో మేము తన్నుకునేటట్లు, చంపుకునేటట్లు చేస్తున్నావు. 

*నువ్వు తక్కువ వాడివి కావు సామీ...*
వేల ఎకరాల స్థలాలు ఆక్రమించిన అసామి దేహాన్ని వదలగానే - ఆరు అడుగుల స్థలాన్ని మాత్రమే మిగులుస్తావు.

*నువ్వు తక్కువ వాడివి కావు సామీ...*
రాజ్యాలతో పాటు రాజకీయాలు సృష్టించి ఆప్తమిత్రులకు, అన్నదమ్ములకు, భార్యాభర్తలకు ఎడబాటు చేస్తున్నావు. 

*నువ్వు తక్కువ వాడివి కావు సామీ...*
కాషాయం కట్టిస్తావు, ఆస్తులపై భ్రమ పుట్టిస్తావు.  
ఆఖరికి బ్రష్టు పట్టిస్తావు. 

*నువ్వు తక్కువ వాడివి కావు సామీ...*
నేను, నాది అనే అహం కలిగిస్తావు. 
 అది  వదిలితే గాని నీ దగ్గరకు రానీయనంటావు. 

*నువ్వు తక్కువ వాడివి కావు సామీ...*
ముప్పయి మూడు కోట్ల దేవతలను సృష్టించావు. 
 కానీ నన్నొక్కడినే పూజించమంటావు. 

*నువ్వు తక్కువ వాడివి కావు సామీ...*
ఇంద్రియాలను ఇచ్చావు.  వాటికి రుచులు పుట్టించావు.  అన్నిటిని వదిలితేగాని నీ దగ్గరకు రానీయనంటావు. 

*నువ్వు తక్కువ వాడివి కావు సామీ...*
పాము పడకపై శయనించి, అమ్మ చేత కాళ్ళోత్తించూకుంటూ మమ్ములను చూసి నవ్వుకుంటావు. 

*నువ్వు తక్కువ వాడివి కావు సామీ...*
నిన్నర్థం చేసుకోవడం మా వల్లకాదని నీకు తెలిసి ఈ నాటకాలు మాచే ఆడిస్తూ ఉంటావు.  

*కానీ సామీ!*  
నేనూ తక్కువవాణ్ని కాదు -
నాకు బాగా తెలుసు 

నీ కాళ్ళట్టుకుంటే నీవే నన్నెత్తుకుంటావని.

ఆ గేనం (జ్ఞానం) మాత్రం నన్నొదలకుండా చూడుసామీ 

*ఆ వరం మాత్రం నాకివ్వు సామీ !!!*🙏



Key Words : Telugu WhatsApp

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది