గుణ భూషణం.
*** చేసిన మేలు చెప్పుకోకూడదు. పొందిన మేలును మరువకూడదు. నలుగురితోనూ చెప్పడం మరిచిపోకూడదు..
*** కృతజ్ఞత... అతి గొప్ప సుగుణం మాత్రమే కాదు, ఇతర సుగుణాలకు మూలం కూడా...
*** కృతజ్ఞత విచిత్రమైంది !! కృతజ్ఞతను చూపకపోవడం, కృతజ్ఞతను చూపమని అడగడం-- రెండూ పొరపాటే !!
*** మనం ఏదైనా పొందినపుడు కృతజ్ఞత చూపుతాం. అది సర్వ సాధారణం. కానీ అంతకంటే ఉన్నతమైన కృతజ్ఞత ఉంది.. మనం ఏదీనా ఇచ్చేటపుడు చూపాల్సిన కృతజ్ఞత ! మనం చేసేది సాయం కాదు. సేవ అనే అనుభూతి కలిగినప్పుడు ఆ కృతజ్ఞత మనకు అలవడుతుంది..