స్నేహన్ని మూడు మాటల్లో వర్ణించిన సోక్రటీస్

*❤స్నేహన్ని మూడు మాటల్లో వర్ణించిన సోక్రటీస్❤*

సోక్రటీస్ కు దారిలో ఎదురైనా ఒక పరిచయస్తుడు. *"మీకు తెలుసా మీ స్నేహితుడు ఏమీ చేశాడో "* అని ఏదో చెప్పబోతున్నాడు. అంతలో సోక్రటీస్, *"ఒక్క క్షణం ఆగండి.... మీరు చెప్పేది నేను వినాలంటే, ముందుగా మీరు మూడు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంది"* అన్నాడు. దానికి ఆ వ్యక్తి సరేనన్నాడు.

*సోక్రటీస్:* మీరు చెప్పే విషయం కచ్చితంగా నిజమేనని నిర్ధారించగలరా?

*ఆ వ్యక్తి:* లేదు. అది మరోకరు చెప్పగా నేను విన్న విషయం.

*సోక్రటీస్:* నా స్నేహితుడు గురించి మంచిగా ఎదైనా చెప్పబోతున్నారా?

*ఆ వ్యక్తి:* లేదు.

*సోక్రటీస్:* అంటే నిజం అని నిర్దారించలేరు. అది మంచి విషయము కాదు. అయినా ఫర్వాలేదు మరోక ప్రశ్న ఉంది కదా.. దానికి సరైన జవాబిస్తే మీరు చెప్పేది వింటాను.... మీరు చెప్పే విషయం వల్ల నాకు ఎదైనా మంచిది జరుగుతుందా?

*ఆ వ్యక్తి:* లేదు.

*సోక్రటీస్:* దినిని బట్టి తెలిసినదేమిటంటే... మీరు చెప్పే విషయం నిజమూ కాదు. మంచి విషయమూ కాదు. దాని వల్ల ఎటువంటి ఉపయోగమూ కూడా లేదు. అలాంటప్పుడు దానిని వినాల్సిన అవసరం కూడా నాకు లేదు. మీరు ఇంకేవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు.
*స్నేహం* అనేది పది కాలాల పాటు చల్లగా వర్ధిల్లాలి అంటే, మనం ఎవరైనా గానీ సోక్రటీస్ లా వ్యవహరించాల్సిందే... ఎందుకంటే స్నేహబంధాలు తెగిపోయేది, ఇలాంటి చెప్పుడు మాటలు వినడం వలనే... చివరికి స్నేహం విలువ తెలుసుకోలేమూ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది