ప్రియమైన కొడుకులు,కూతుళ్ళూ

ప్రియమైన కొడుకులు,కూతుళ్ళూ!!!!!!!!!!!

!!!!!!!!!!!!!!!!మీకు ఒక మనవి!!!!!!!!!!!!

చెవులతో కాక హృదయంతో వినాలని ప్రార్ధన .
మీకు జన్మ నిచ్చి ,చదివించి పెద్ద చేసిన మీ తల్లిదండ్రులు ఇప్పుడు వృధ్దలయ్యారు.
మీరు పెద్ద చదువులు చదివి ఉండవచ్చు .విదేశాల్లో ఉండవచ్చు.
వారికంటే విషయ పరిజ్ఞానంలో గొప్ప కావచ్చు.కానీ వారికి మీ మీదున్న ప్రేమ ముందు, వారికి జీవితంలో ఉన్న అనుభవం ముందు మీరెప్పుడు చిన్నవారే!
తక్కువ వారే ! పడిన కష్టాలతో అలసి
పోయి , వయోభారంతో క్రుంగి పోయిన మీ తల్లి దండ్రులు ఎప్పుడైనా కోపంతో ఒక మాట అంటే దయ చేసి అరవకండి .
ఆవేశంతో ఊగిపోకండి .వయసు పైబడి ,
రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు ఉన్న పెద్దలు ఒక మాట అంటే అర్ధం చేసుకోండి.మీ  తప్పు ఉండవచ్చు.లేక
పోవచ్చు. కానీ  మిమ్మల్ని  ఒక  మాట  అనే  అధికారం  మీ  తల్లిదండ్రులకు ఎప్పుడూ ఉంటుంది.ఆ మాత్రం లేకపోతే బంధాలకు
విలువ ఉండదు .వయసులో చిన్నవారు ,
ఆరోగ్యవంతులు అయిన మీరు కొంత సహనం వహించాలి.మెల్లగా మాట్లాడి నచ్చ చెప్పాలి.ఇది మీరు వారి వయసుకు ,
ప్రేమకు ఇచ్చే గౌరవం. జీవితంలో అలసిపోయిన మీ  తల్లిదండ్రులకు తోడుగా నిలవండి.బాధ మిగల్చకండి.
భవిష్యత్ లో మీరు కూడా ఒక తల్లిగా ,
తండ్రిగా మీ పిల్లల అనురాగం ఆశిస్తారని
మరువకండి.
మీ తల్లి దండ్రులను ప్రేమించండి !
మీ ప్రేమను పంచి ఆనందించండి !
వృద్దులు మీకు బరువులు కాదు !
వారు నట్టింటి సిరులు !!

🙏|| మాతృదేవోభవ - పితృదేవోభవ ||🙏

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది