గృహవైద్య రహస్యాలు
* పెద్ద యాలక్కాయలు -
రెండున్నర గ్రాములు యాలుక్కాయల గింజల చూర్ణమును వెన్నతో తినుచుండిన యెడల కడుపులో నొప్పి , మాటిమాటికి విరేచనం అగుట , జిగట విరేచనములు తగ్గిపోవును .
* మెంతులు -
నిప్పు వలన కాలినచోట మెంతులు నూరి ముద్ద వలే చేసి ఆ ముద్దని కాలినచోట వేసి కట్టిన యెడల బాధ శాంతించి బొబ్బలెక్కకుండా మానిపోవును .
* ఆకుపత్రి ( బిర్యాని ఆకు ) -
ఆకుపత్రిని నీళ్లతో నూరి ఆ పేస్ట్ ని తలకి పట్టువేసిన అన్నిరకాల తలనొప్పులు హరించును .
* ధనియాలు -
ధనియాల కషాయం ప్రతినిత్యం సేవించుచున్న ముక్కువెంట , నోటివెంట , మూత్రద్వారం నుంచి మరియు మలద్వారం నుంచి పడు రక్తం కట్టును . అతిగా దాహం అయ్యే వ్యాధి తగ్గును.
* ఇంగువ -
గోరువెచ్చని నీటితో బఠాణి గింజ అంత ఇంగువ మింగిన యెడల కడుపునొప్పి,నీళ్ళవిరేచనములు, ఎక్కిళ్లు , వాంతులు తగ్గిపోవును .
* వాము -
వాముని ఆవనూనెలో వేసి తైలమును తీసి శరీరముకి పట్టించి మర్దన చేసిన యెడల వళ్లునొప్పులు , దురదలు, వళ్ళు చల్లబడుట తగ్గి ఆరోగ్యముగా ఉండును.
* సోంపు -
పది గ్రాములు పచ్చి సోంపు గింజలు , పది గ్రాములు వేయించిన సోంపు గింజలు ఈ రెండింటిని కలిపి చూర్ణం చేసి ఆ చూర్ణమును ఉదయం , సాయంత్రం మంచినీటితో కలిపి తాగవలెను. ఈ విధముగా సేవించుట వలన జిగట, రక్త విరేచనాలు కడుపుబ్బరం హరించిపోయి ఆరోగ్యముగా ఉండును.
* జాపత్రి -
వేయించిన జాపత్రి చూర్ణము రెండున్నర గ్రాముల మోతాదుగా గొరువెచ్చటి నీటితో కలిపి గంటగంటకు లొపలికి ఇచ్చుచున్న కలరా వ్యాది హరించును .
* లవంగములు -
లవంగాల చూర్ణమును పిప్పిపన్ను పైన ఉంచిన యెడల పురుగులు పడిపోయి భాధ తగ్గును. నాలుగు లవంగాలు వేయించి మరియు నాలుగు పచ్చి లవంగాలు కలిపి నములుచూ రసం మింగుతున్న తీవ్రమైన దగ్గు , కంఠము నందు అడ్డుపడుచున్న శ్లేష్మము హరించిపోవును .
* దాల్చిన చెక్క -
దాల్చిన చెక్క చూర్ణముని 5 గ్రాములు మంచినీటితొ కలుపుకుని తాగుచున్న యెడల జిగట విరేచనాలు , ప్రేగులయందలి క్రిములు , కడుపునొప్పులు హరించును .
గమనిక -
ఈ యోగాన్ని రాత్రిపూట మాత్రమే ఆచరించవలెను .
* చింతకాయ -
పండిన చింతకాయలు ను నీళ్లతో నూరి అందు పంచదార కలిపి త్రాగించుచున్న యెడల వడదెబ్బ తగిలిన వారి ప్రాణం నిలబడును. ఎండాకాలం చింతకాయ పానకం తాగుచున్న వారికి ఆరోగ్యం చెడకుండా ఉండును.
* బూడిద గుమ్మడి -
బూడిద గుమ్మడికాయ రసము నందు పంచదార కలిపి తాగుచుండిన యెడల రక్తపైత్యము హరించును . బూడిద గుమ్మడికాయ గుజ్జుని తలకు పట్టించుచున్న శిరస్సులో వేడితగ్గి , ముక్కువెంట రక్తం పడుట తగ్గిపోవును .
* కర్బూజ -
కర్బూజ కాయ పై చెక్కులు ఎండబెట్టి కాల్చి ఆ భస్మముని పావు స్పూన్ తేనెతో కలిపి తినుచుండిన యెడల కడుపులో పెరిగే బల్ల ( spleen enlargement) వ్యాధులు ,నొప్పులు , కడుపునొప్పులు హరించిపోవును .
* ముల్లంగి -
ముల్లంగి దుంపల రసము నందు కొంచము ఉప్పు కలిపి తాగించుచుండిన యెడల కడుపుబ్బరం, మూత్రబంధం అనగా మూత్రం బయటకి రాకుండా bladder ఉబ్బి నొప్పి రావటం తగ్గి తేపులు వచ్చును.
ముల్లంగి దుంపలను సన్నగా తరిగి ఎండించి కాల్చి ఆ భస్మమును పావుస్పూన్ ఒక చిన్న గ్లాసు నీటితో కలిపి తీసుకున్న బల్ల వ్యాదులు, కడుపునొప్పులు , కిడ్నీ లలో రాళ్లు హరించిపోవును .
* బెండచెట్టు -
పచ్ఛిబెండ కాయ తినుచుండిన గాని , బెండచెట్టు వేరు పైన బెరడుచూర్ణముని రెండున్నర గ్రాముల మోతాదుగా ప్రాతఃకాలం నందు మంచినీటి అనుపానంతో సేవించుచున్న యెడల స్త్రీలలో కలిగే ఎర్రబట్ట, తెల్లబట్ట వ్యాధులు హరించును .
* చిక్కుడు -
చిక్కుడు తీగ, ఆకుల రసమును ముఖమునకు మర్దన చేయుచున్న యెడల ముఖం పైన ఉండు అన్నిరకాల మచ్చలు హరించిపోవును .
చిక్కుడు కూర తినుటవలన శరీరంలో జీవశక్తి అధికం అయ్యి ఒంటికి పుష్టి చేకూరును .
తరువాతి పోస్టులో మరిన్ని మూలికల గురించి మీకు తెలియచేస్తాను .
కాళహస్తి వెంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేదం
9885030034 గృహవైద్య రహస్యాలు - 5 .