👤🏆➖➖➖➖➖➖➖➖
*జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. సామాజిక సృహను ప్రతిబింభించే రచనలు చేసిన "రావూరి భరద్వాజ" గారి జయంతి నేడు..*
➖➖➖➖➖➖➖🌸🌸🍃
★"పాకుడు రాళ్ళు " మీకు తెలుసా అని ఎవరినైనా అడిగితే...మొట్టమొదటిసారిగా సినీ జగత్తులోని వ్యక్తుల అంతరాంతరాలను ప్రతిభావంతంగా బొమ్మకట్టించిన తొలి తెలుగు నవల అని నిక్కచ్చిగా చెబుతారు. భరద్వాజ యొక్క ఉతృష్ట రచనగా పరిగ ణింపబడుతుంది.అల చెప్పేలా గుర్తుంచు కోవడం మన గొప్ప తనం కాదు..
*■ మనలో మరిచిపోలేని మధురమైన భావం తో కలకాలం గుర్తుండిపోయేలా పాత్రలు సృష్టించి ఆ పాత్రలకు సరిపడా మాటలు రాసి గుండెను హత్తుకునేలా పాకుడు రాళ్ళను నడిపించిన డా !! రావూరి భరద్వాజ గారి కలానికి ఉన్న గొప్పతనం.*
*■ 25 సంవత్సరాల క్రితం జ్ఞాన పీఠ్ అవార్డు- డాక్టర్ సి.నారాయణరెడ్డి గారికి ''1988 '' లో విశ్వంభర కు వచ్చింది. ఇప్పుడు మళ్లీ 25 సంవత్సరాల తర్వాత డాక్టర్ రావూరి భరద్వాజ ''పాకుడు రాళ్ళు '' అనే రచనకు రావడం తెలుగు వారికి వెలుగు వేడుక. తెలుగు సాహిత్యంలో కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, ఆధునిక కవి సి.నారాయణ రెడ్డి తరువాత ఈ ప్రసిద్ధ జ్ఞాన్‌పీఠ్ అవార్డు ను అందుకున్న మూడో వ్యక్తి.*
■ తెలుగు రచనా ప్రపంచంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడి తడు. ఆడంబరాలులేని సాధారణ జీవితం ఆయనది. భరద్వాజకు దిగువ మధ్యతరగతి మరియు పేదప్రజల భాషపై గట్టిపట్టు ఉంది.
*■ ఒక బీదకుటుంబంలో జన్మించిన భరద్వాజ కేవలం ఉన్నత పాఠశాల స్థాయివరకే (8వ తరగతి మధ్యలో పెదరికం తో ఆపేసాడు) చదువుకున్నాడు. ఆతరువాత కాయకష్టం చేసే జీవితాన్ని ప్రారంభించాడు. చిన్నతనంలో పొలాల్లో గడిపిన భరద్వాజ వ్యవసాయ కూలీల కఠినమైన జీవన పరిస్థితులను గమనించేవాడు. అప్పుడే పల్లెప్రజల భాష, యాస, ఆవేశాలు, ఆలోచనలు, కోపాలు, తాపాలు గమనినించిన భరద్వాజ ఆ అనుభవాలను తర్వాతకాలంలో తన రచనలలో నిజమైన పల్లె వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగించుకున్నాడు.*
*🍥ప్రారంభ జీవితం..*
*■ వీరు 1927 జూలై 5వ తేదీన కృష్ణా జిల్లా లోని నందిగామ తాలూకా కంచికచర్ల సమీపంలోని మొగులూరు (నాటి హైదరాబాదు సంస్థానంలోని) గ్రామంలో రావూరి కోటయ్య మరియు మల్లికాంబ దంపతులకు జన్మించారు. వీరి విద్యాభ్యాసం 8వ తరగతి వరకే సాగింది.*
■ తొలి నాళ్ళలో రావూరి భరద్వాజపై చలం ప్రభావం ఎక్కువగా ఉండేది. యుక్త వయసు లోనే తెనాలి చేరి అక్కడ ఒక ప్రెస్సులో పనిచేయటం ప్రారంభించాడు.
◆ 1946లో నెల్లూరులోని జమీన్ రైతు వారపత్రిక సంపాదకవర్గంలో చేరాడు.
◆1948లో దీనబంధు వారపత్రికకు బాధ్యు డుగా ఉన్నాడు. జ్యోతి,సమీక్ష, అభిసారిక, చిత్రసీమ, సినిమా, యువ పత్రికల్లోను..
◆1959వరకు కొన్నాళ్ళు ఫౌంటెన్ పెన్నుల కంపెనీలో సేల్స్‌మన్‌గా పనిచేశాడు. అక్కడ యజమాని అమానుషత్వాన్ని భరించలేక రాజీనామా చేసి కొన్నాళ్ళపాటు ఖాళీగా ఉన్నాడు.
*■ ఆ తర్వాత హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో 1959లో ప్రూఫ్ రీడింగ్ కళాకారుని గా చేరి చివరకు 1987లో ప్రసంగ కార్యక్రమా ల ప్రయోక్తగా పదవీ విరమణ చేశాడు.*
*🍥రచయితగా..*
■ రావూరి భరధ్వాజ గురించి చాలాకాలం పరిశోధన చేసి వారి రచనల గురించి సమగ్ర మైన పరిశీలన చేసిన బొగ్గుల శ్రీనివాస్ ప్రకారం భరధ్వాజ సుమారు 187 పైగా పుస్తకాలను వెలువరించారు, 500 పైగా కథలను 37 సంకలనాలుగా, 19 నవలలు, 10 నాటకాలు వ్రాశారు. భరద్వాజ తన తొలి కథ ఒకప్పుడును 16 ఏళ్ల ప్రాయంలో వ్రాశాడు. ఇది జానపద శైలిలోసాగే కథ. భరద్వాజపై చలం ప్రభావం మెండుగా ఉంది.
*■ విచిత్రమైన మానవ భావోద్వేగాలే ప్రధానాంశాలుగా కథలు వ్రాసే భరద్వాజ శైలి సరళమైనది.పాత్ర చిత్రీకరణలో, ఒక సన్నివేశాన్ని పరిచయం చేయటంలో రావూరి భరద్వాజకు ఉన్న ఒడుపు అద్భుతమైనది*
*🎯పాకుడురాళ్ళు..*
*■ రావూరి భరద్వాజను నిలబెట్టే రచనల్లో అతి ముఖ్యమైనది చలనచిత్ర పరిశ్రమను వస్తువుగా చేసుకొని తెలుగులో వెలువడిన మొట్టమొదటి నవల పాకుడురాళ్లు. భరద్వాజ దీనికి మాయ జలతారు అని నామకరణం చేశారు. అయితే శీలా వీర్రాజు పాకుడురాళ్లు అనే పేరు పెట్టాడు. మల్లంపల్లి సోమశేఖరశర్మ, ముదిగొండ సుబ్రహ్మణ్యశర్మ ల ప్రోత్సాహంతో రావూరి భరద్వాజ తాను అంతకుమునుపే రాసిన 'పాలపుంత' అనే ఓ పెద్ద కథని పాకుడురాళ్లు నవలగా రాశారు. మూడు సంవత్సరాల పాటు కృష్ణాపత్రికలో ధారావాహికగా వెలువడిన పాకుడురాళ్లు నవలపై శ్రీకృష్ణదేవరాయ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరగడం విశేషం.*
*☄రచనలు:*
రావూరి భరద్వాజ సుమారు 150 రచనలు చేశాడు.
*🍥కథా సంకలనాలు...*
అపరిచితులు,అపశ్రుతి,ఆనాడుఅర్థాంగి,
ఆహుతి,భాగేశ్వరికథావాహిని,గాలివాటు,
మహాతి వ్యాసాలు,కిన్నెర మిథునం కల్పన గాలిపటం, జాలిగుండె,దైవరాజకీయాలు, రాగిని (1950) జయంతి, దావానలము కథాసాగరము ఉన్నది - ఊహించేది (1955) పాపం (1956),లోకం కోసం(1956)
పాలపుంత (1961),అన్యధా శరణం నాస్తి (1962)పుత్రకామేష్టి (1962)కొత్త చిగుళ్లు మచ్చుకో చచ్చుకథ,మళ్ళీ తెలవారింది, మమకారం,మానవుడు-దానవుడు, మానవు డు మరణిస్తున్నాడు, మంజూషమనోరమ మొనలేని శిఖరం, మూఢనిద్రనర(క)లోకం నిన్ను గురించిన నిజంపాడ్యమి (1984) పద్మవ్యూహంసౌందరనందం (1987)శ్రీరస్తు (1989)సిరికింజెప్పడుసౌదామనిత్రినేత్రుడుకల్పనమనోరథంమేనకస్వయంవరంవిచిత్ర ప్రపంచంవసుంధరవసు చరిత్ర,విజయ విలాసంవినదగు
*🍥నవలలు..*
కరిమింగిన వెలగపండు (1962)జలప్రళయం (1963)పాకుడురాళ్ళు (1965)చంద్రముఖికాదంబరిచిత్రగ్రహంఇదంజగత్ (1967)నామీద నాకే జాలిగ వుందిఒక రాత్రి, ఒక పగలుజీవన సమరంరాజపుత్ర రహస్యం తెలుసుకుంటూ.. తెలుసుకుంటూ...సాహస విక్రమార్క శిధిలసంధ్య,తోడుదొంగలు,వీరగాధలోకం కోసం - కథల సంపుటి ఇది నాది కాదుఆకళ్లు
*🍥పిల్లల కోసం..*
ఉడుత , ఉపదేశం,కీలుగుర్రం,చిలుక తీర్పు, జాలిగుండె,తెలివైన దొంగ (పిల్లల కథలు)పద్దు తెచ్చిన ముద్దు తమ్ముడు (పిల్లల కథలు) పరకాయ ప్రవేశం, మణిమందిరం , మాయా లోకం,రత్నాలలోయ,వాణి-రాణి, సముద్ర వీరుడు.ఇంకా అనేక వ్యాసాలు,విజ్ఞాన కథలు రాసారు..
*🍥అవార్డులు..*
◆ రావూరి భరద్వాజకు 1980లో ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1987లో జవర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, 1991లో నాగార్జున విశ్వవిద్యాలయం గౌర్రవ డాక్టరేట్లు ప్రదానం చేసి గౌరవించాయి.
1980 - కళాప్రపూర్ణ-ఆంధ్ర విశ్వవిద్యాలయం.1983 -కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం.1985 - సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం 1987 - రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు.
1987 - తెలుగు కళాసమితి కె.వి.రావు, జ్యోతిరావు అవార్డు.
2007 -ఆంధ్ర ప్రభుత్వం కళారత్న అవార్డు 2008 - లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం 2011 - కేంద్ర సాహిత్య అకాడమీ, వంగూరి ఫౌండేషన్, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారాలు.
*2012 - జ్ఞానపీఠ అవార్డు తెలుగు సాహిత్యా నికి ఆయన చేసిన బహుముఖమైన కృషికి దక్కింది.*
★ రావూరి కిడ్ని వ్యాధితో అక్టోబర్ 18 2013న కన్నుమూశారు. జ్ఞానపీఠ్’ వరించిన ఆరు నెలలకే రావూరి కన్నుమూయడం పాఠకులను కలచివేసింది.
*📚రావూరి భరద్వాజ ఆ అద్భుతమైన రచనలలో కొన్ని ('పాకుడురాళ్లు, లోకం కోసం, ఏది నాదికాదు, కాదం బరి) మరికొన్ని పుస్తకాలు pdfలలో..మన'చరిత్రలోఈరోజు' లో చూడగలరు..*
(జూలై 5, 1927 - (అక్టోబరు 18, 2013)