ఓ డాన్స్ పోటీల్లో రెండుసార్లు గెలిచిన వ్యక్తి, మూడోసారి అనుకున్న స్థాయిలో డాన్స్ చేయలేకపోయాడు. అయినా ఆడియన్స్ పోల్స్‌లో అతడికే ఎక్కువ ఓట్లు వచ్చాయి. చివరకు జడ్జీ కూడా అతనికే ఎక్కువ మార్కులు వేసి డాన్స్ పోటీల్లో గెలిపించాడు.పోటీలయిపోయాయి... బహుమతి కూడా ఇచ్చేశారు..! కానీ ఆ డాన్సర్‌కి మాత్రం తను చేసింది తప్పు... అయినా నన్నెందుకు గెలిపించారు? అని మనసులో ప్రశ్నించుకుంటూనే ఉన్నాడు.
తట్టుకోలేక ఇదే ప్రశ్న పోటీలకు జడ్జిగా వ్యవహరించిన వ్యక్తిని అడిగాడు. గురువు గారూ... నేను చేసిన తప్పేంటో నీకు తెలుసు.. నాకు తెలుసు..!కానీ ఈ జనాలు, మీరు కలిపి నన్ను గెలిపించారు. ఎందుకో తెలుసుకోవచ్చా? అని అడిగాడు.అప్పుడు ఆ గురువు గారు ఇలా చెప్పాడు..!చూడు బాబూ... చిన్నప్పుడు స్కూల్‌లో కొంతమంది విద్యార్థులకు పాస్ అవడానికి కొన్ని మార్కులు అవసరమవుతాయి. అప్పుడు టీచర్లు ఆ మార్కులు కలిపి ఆ పిల్లల్ని పాస్ చేస్తారు.
ఆ విద్యార్థి చదవకపోయినా, అల్లరి పిల్లవాడైనా సరే... పాస్ చేసి గట్టెక్కిస్తారు. దానికి కారణం ఆ పిల్లవాడి ప్రవర్తన. ఆ ప్రవర్తనే... ఆ పిల్లవాడు ఫెయిల్ అయినప్పుడు పాస్ చేయించడానికి కారణం అవుతుంది. ఆ ప్రవర్తనే ఓడిపోయినప్పడు ఓదార్పును, అండగా నిలిచే అభిమానుల్ని, చేయి పట్టుకునే స్నేహితుల్ని ఇస్తుంది...! గెలుపు, ఓటములు అనేవి నీ చేతుల్లో లేవు... నీ ప్రవర్తన వాటిని డిసైడ్ చేస్తుంది. అదే నిన్ను ఈ రోజు గెలిపించింది. నేను, జనాలు కాదు అని చెప్పాడు.
*SUCCESS & FAILURE IS TEMPORARY BUT ATTITUDE IS PERMINENT....*