తల్లులు -- చెల్లెళ్ళకోసం

🌺 మన ఆరోగ్యం ---
మనచేతుల్లో 🌷

తల్లులు -- చెల్లెళ్ళకోసం......

      శ్రీ వాగ్భటాచార్యుల వారి మూడవ సూత్రం. స్త్రీలకు 45 -- 50 సంవత్సరాల తర్వాత నెలసరి ఆగిపోయిన తర్వాత వచ్చే సమస్యలకు శాశ్వత పరిష్కారం. స్త్రీలకు హార్మోన్స్ విడుదల ఆగిపోయిన తర్వాత చెయ్యగలిగేది ఏమి ఉండదు. హార్మోన్స్ ని బయటినుండి కూడా అందించలేం. అయితే వాగ్భటాచార్యుల వారంటారు ఈ సమస్యలను కంట్రోల్ మాత్రం చేయవచ్చును. వీటికి ముఖ్యమైన పరికరాలు , (1) తిరుగలి, (2) సన్నికల్లు. చెట్నీలు , మసాలాలు నూరే పరికరం సన్నికల్లు. వీటిని ఉపయోగించటం వల్ల బత్తిడి ఎక్కువగా పొట్ట మీద పడటం వలన , పొట్ట భాగం దగ్గర కండరాలు సంకోచ వ్యాకోచాలు చక్కగా జరిగి , స్త్రీలకు 45 సంవత్సరాల తర్వాత వచ్చే సమస్యలు చాల తక్కువగా ఉంటాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ ఉదయం పదినిమిషాలు కనీసం తిరగలని ఉపయోగించండి. 10 -- 15 నిమిషాలు మించి అక్కర్లేదు అర్ధం చేసుకోండి.

      పురుషులైన స్త్రీలైనా పొట్ట తగ్గాలంటే రోజూ 15 నుండి 20 నిముషాలు తిరగలి లేక సన్నికల్లు ఉపయోగించండి. మీకు పొట్ట తగ్గాలన్నా ఎసిడిటి తగ్గాలన్నా , విరేచనం సాఫీగా జరగలన్నా , జీర్ణవ్యాధులన్నీ తగ్గాలంటే మీరు రోజు తిరగలి వాడుకోండి. ఇలా వంటిల్లే వైద్యశాలగా చేసుకోండి.

       " ఆరోగ్యమే .... మహాభాగ్యము "   💐💐💐

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది