👉👉మనసున్న తెల్లకాగితం 👈👈 మనం ఎందుకో లెక్క చేయంకానీ, సృస్థిలో ప్రతి దానికి ఓ ఉపయోగం ఉంటుంది. వాటి జన్మకో సార్ధకత ఉంటుంది అని పెద్దల ఉవాచ.. అటువంటి కోవలో "" తెల్ల కాగితం "" ఉపయోగం అంతా--ఇంతా అని చెప్పలేము అని ' తెల్లకాగితం' మీద రాసిస్తా.. చూశారా... అప్పుడే తెల్లకాగితం ఇంపార్టెన్స్ మొదలైంది. 👉👉 పిల్లవాడు / పిల్ల పుట్టగానే వాళ్ళ జాతకం రాయించాలంటే ' తెల్లకాగితం' కావాలి. అంటే మనిషి జననంతో వైట్ పేపర్ ఉపయోగం మొదలు. పిల్లల్ని స్కూలులో చేర్చాలంటే అప్లికేషన్కు తెల్లకాగితం, వాళ్ళు పరీక్షలు రాయాలంటే తెల్లకాగితం, పరిక్షాఫలితాలు బ్లాక్ బోర్డు మీద అంటించాలంటే ' తెల్లపేపర్ ' ఇలా సంబంధం బలపడుతూనే వుంది. ఎవరి చేతిలో పడితే ఎలా తనను తాను మలుచుకోవాలో, ఏ సన్నివేశానికి ఎలా ఎడ్జెస్ట్ అవ్వాలో 'తెల్లకాగిటానికి' బాగా తెల్సి వుండివుంటుంది. చాలా సందర్భాలలో మనిషి మాట కన్నా కాగితం మీద రాతకే నమ్మకం, బలం ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఒక వైట్ పేపర్ ఒకమనిషిని ఉరి తీయించనూ గలదు-- రక్షించనూ గలదు. వైట్ పేపరా నీకు 🙏🏾🙏🏾నమో నమః. 👉👉 మధ్యతరగతి జీవి ఫస్ట్ తారీఖు జీతం రాగానే నెలసరి వస్తువుల జాబితాను కాగితం గుండెలమీద ప్రేమ లేఖలా వ్రాస్తాడు. బంధువుల లిస్ట్ నుంచీ బాకీల దాకా, ఉద్యోగుల నియామక ఉత్తర్వులను, పదివి విరమణ లెటర్లతోను, పిల్లల పెళ్లి శుభలేఖల నుంచి, మనవడో-- మనవరాలో పుట్టారన్న శుభవార్తలు దాకా నేను లేనిదే నీకు తోచదు అన్నంత మమేకం ఐపోతుంది మన తెల్లపేపర్. 👉👉నాకూ మనస్సుంది అన్నట్టు ఉంటుంది తెల్లపేపర్ మనోగతం. ( యెట్లా చెప్పుతావయ్యా అని డౌట్ వస్తే మన పుష్ప విలాపం గురించి మనం విన్నాం కదండి...).. తనమీద ఎవరు ఎన్నెన్ని రాస్తున్నా కిమ్మనదు. ఇదేమిటి అని ప్రశ్నించదు. తెల్లగా వున్న తనమీద రిజర్వ్ బ్యాంకువాళ్ళు రూపాయి దగ్గర నుంచి రెండు వేల రూపాయిల దాకా కేవలం అంకెలు ముద్రిమ్చి తన విలువ ఆకాశానికి పెంచినా పొంగిపోదు. నకిలీ స్టాంపులు తన మీద ప్రింట్ చేసి, తన ఇమేజ్ ను తీసి వేసినా బాధ పడదు. అన్నింటిని శిరస్సు వంచి స్థితప్రజ్ఞగా ఆత్మ నిగ్రహం కనబరుస్తూ ఒక సందేశం మానవాళికి తెల్పుతున్నట్లు ఉంటుంది. ఈ కాగితం ఒక కవి గారి చేతిలో పడితే ఓ కావ్య గ్రంధంలా, ఓ చిత్రకారుడి చేతిలో పడితే అపురూప చిత్రంలా, ఓ రచయిత చేతిలో పడితే నవలా రూపంలో ( కర్మానుగుణంగా ఒకరికి ఒకరు సాంగత్యం కలిస్తే వారి వారి సుగంధాలు ఒకరి నుంచి ఒకరికి అబ్బినట్లు) అలా తెల్లకాగితం అనుభూతి దానికే తెలుస్తుంది అని భావన చేద్దాం. 👉👉 ఇవేకావు సుమండీ! మన తెల్లకాగితం లాయర్ నోటీసుల నుండి జడ్జిమెంట్లుదాకా, ఇంక్రిమెంట్స్ నుంచి పనిష్మెంట్ లెటర్లదాకా, న్యూస్ రిపోర్టులు నుంచి రాజీనామా లెటర్లు, ప్రమోషన్లు, డిమోషన్లు......ఇలా చెప్పుకుంటూ--రాసుకుంటూ వెలితే 'తెల్లకాగితాలు' చాలవు కదండీ. ఓ తెల్లకాగితమా శుభముహూర్తము నీవే-- మరణ శాసనం నీవే...🙏🏾 👉👉తెల్లకాగితము--సంతకం తోబుట్టువులు లాంటివి. సంతకం ఉంటే తెల్లకాగిటానికి ఇంకా ప్రాముఖ్యత పెరుగుతుంది. ఓ తెల్లకాగితమా! నీవు ఎన్నో అనుబంధాలకు, సంబంధాలకు, అనుభవాలకు, అనుభూతులకు, ఆనంద--విషాదాలకు, అద్భుత--అపురూపాలకు నీ హృదయంలో చోటిచ్చే నీ జీవితం మానవజాతికి ఆదర్శప్రాయం. ఎటువంటి స్వార్ధం, స్వలాభాపేక్షా లేకుండా, ఎవరెలావాడుకున్నా, వాళ్ళకి అణిగిమనిగి వుంటూ ధన్యజీవి ఐన ఓ తెల్లకాగితమా నీకు "" శిరస్సు వంచి పాదాభివందనములు""🙏🏾🙏🏾 తెలియచేస్తూ....., పెద్దలు, రసజ్ఞులు ఐన నా గ్రూప్ సభ్యులకు నీ గురించి తెలిసినా కాసేపు అలా అలా.... వీరి సజ్జన సాంగత్యం కోసం.🙏🏾🙏🏾
- Home
- Web Templates
- _WordPress Themes
- _Blogger Templates
- _Customs Templates
- _Adobe XD Web
- Graphic Design
- _Fonts
- __Popular fonts
- __Recent Fonts
- Mockups Templates
- _Technology
- _PSD file
- _T-Shirts
- _Prints and Packaging
- _Social Media
- Others
- _Plugins
- _Vector Illustration
- _Software
- _UX and UI Design
- _Programming
- _Popular Tools
- _Review Project
- _Popular Tools
- Blog
- About