🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*✍✍✍నీతికథ✍✍*
*ఆ రాజ్యంలో రాజుగారు చాలా మంచి వాడు . ఆయన ప్రతి రోజూ పేద బ్రాహ్మణులకు మద్యాహ్న భోజనం వండించి పెట్టేవాడు.*
*ఒక రోజు యధావిధిగా భోజనం వండించే ఏర్పాట్లు చేస్తున్నాడు .* *అదే సమయం లో ఆకాశం లో ఎగురుతున్న ఒక గద్ద కాళ్ళతో పట్టుకున్న పాము నోటినుండి విషం వడ్డించడానికి సిద్ధంగా ఉన్న అన్నం బేసిన్ లో పడింది .* *అది ఎవరూ గమనించలేదు*
*ఆభాగం ఒక బ్రాహ్మణుడు తిన్నాడు.* *అది తినడం వలన అతడు చనిపోయాడు . ఈ వార్త రాజుగారికి చేరింది . ఆయన చాలా దుఃఖించాడు . మేలు చెయ్యబోతే ఇలా కీడు జరిగింది అని ఆయన చింతించాడు .*
.
.
*ఇప్పుడు బ్రాహ్మణుడు చనిపోవడానికి కారణం ఎవరు ?*
*రాజా ? వంటవాడా ? పామా ? గద్దా ? వడ్డించిన వ్యక్తా ?*
.
*ఈ పాపాన్ని ఎవరి ఖాతాలో వెయ్యాలి ?*
.
.
*వీరిలో ఎవరూ కావాలని ఆ బ్రాహ్మణుడిని చంపలేదు .*
.
.
*యమ ధర్మరాజును అడిగారు .*
.
*ఇది ఇలా ఉంటె మర్నాడు దారినే పోతున్న బ్రాహ్మణులు కొందరు అన్నదానం జరిగే చోటును చెప్పమని ఒక వనితను అడిగారు . ఆమె వారికీ దారిని చూపుతూ*
*“ బాబూ ! జాగ్రత్త మా రాజు గారికి బ్రాహ్మణులు అంటే పడదు . నిన్ననే ఒకాయనను విషం పెట్టి చంపేశారు” . మీ రోజులు బాగున్నాయో లేదో ? అంది .*
.
*యమధర్మరాజు గారు*
*“ చిత్రగుప్తా ! మొత్తం పాపం అంతా ఈమె ఖాతాలో వెయ్యి .*
*యాదృచ్చికంగా జరిగే పనులకు వ్యక్తులను నిందించే వారికి ఆ మొత్తం కర్మ ఫలం కలుగుతుంది అని ధర్మం .”* *అన్నారు .*
.
*MORAL OF THE STORY ;*
*WHEN WE CRITICIZE OTHERS , WE TAKE UP THEIR KARMA .!!*
*BEAUTIFUL STORY FROM SRIMAD BHAGAVATA(ఈ నీతి కథ శ్రీమద్ భాగవతం నుండి గ్రహించబడింది)
🙏🙏🙏🙏👏👏👏👏