“నా అన్ని రోజులూ మా ‘అమ్మ రోజు’లే (తనయుడికి ఓ తండ్రి లేఖ)
---------------------------------------------------------------------
ప్రియమైన కన్నా,
ఇప్పటివరకు ఎవ్వరితో పంచుకోని భావాలు కొన్ని
నీతో పంచుకోవాలనుకొంటున్నా....
***
నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు (దాదాపు నీ అంత వయసే)...
ఓరోజు పొద్దున్నే నిద్రలేచా,
మా అమ్మ బుగ్గలపై ముద్దు పెట్టి,
మనసు నిండుగా, అమ్మను హత్తుకుని,
అమ్మ చేతిలో గ్రీటింగ్ కార్డు పెట్టి,
“అమ్మా ఈ రోజు అమ్మల రోజు’ట-
అభినందనలమ్మా....
ఈరోజు మొత్తం నీ రోజే,
ఈరోజు మొత్తం సంతోషంగా ఉంచుతానని
మాట ఇస్తున్నాను.... అన్నా
అచ్చం నువ్వు ఇప్పుడు మీ అమ్మకు చెప్పినట్లే
అప్పుడు మా అమ్మ నావైపు తిరిగి,
రెట్టింపు ముద్దులు నాకు పెట్టింది,
నా జుట్టును తడిమింది,
బుగ్గలపై తట్టింది,
తనకు మాత్రమే సాధ్యమైన
ఒక అందమైన నవ్వు నవ్వుతూ –
“ఈ ఒక్క రోజేనా?
మరి మిగతా రోజుల మాటేమిటి?
అని ప్రశ్నించింది....
అమ్మ ప్రశ్నకు బిక్కమొహం వేసిన నేను,
ఆలోచిస్తూనే ఉన్నాను ...
“అవును కదా, మిగతా రోజుల మాటేమిటి?”
అమ్మ ప్రశ్న నాకు అర్ధం కాలేదు...
జవాబు దొరకలేదు...
***
బాల్యం దాటేసా....
తరువాతి రోజులన్నీ హడావుడిగా గడిచిపోయాయి..
చూస్తుండగానే పెద్దవాణ్ణి అయ్యా....
ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకున్నా,
నా జీవితంలో ‘అమ్మ రోజు’లు ఎన్నున్నాయో
లెక్కిద్దామని,
అమ్మ ప్రశ్నకు జవాబు వెతుకుదామని...
***
బాల్యం దాటేసా....
తరువాతి రోజులన్నీ హడావుడిగా గడిచిపోయాయి..
చూస్తుండగానే పెద్దవాణ్ణి అయ్యా....
ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకున్నా,
నా జీవితంలో ‘అమ్మ రోజు’లు ఎన్నున్నాయో
లెక్కిద్దామని,
అమ్మ ప్రశ్నకు జవాబు వెతుకుదామని...
***
బాల్యం దాటేసా....
తరువాతి రోజులన్నీ హడావుడిగా గడిచిపోయాయి..
చూస్తుండగానే పెద్దవాణ్ణి అయ్యా....
ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకున్నా,
నా జీవితంలో ‘అమ్మ రోజు’లు ఎన్నున్నాయో
లెక్కిద్దామని,
అమ్మ ప్రశ్నకు జవాబు వెతుకుదామని...
***
బాల్యం దాటేసా....
తరువాతి రోజులన్నీ హడావుడిగా గడిచిపోయాయి..
చూస్తుండగానే పెద్దవాణ్ణి అయ్యా....
ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకున్నా,
నా జీవితంలో ‘అమ్మ రోజు’లు ఎన్నున్నాయో
లెక్కిద్దామని,
అమ్మ ప్రశ్నకు జవాబు వెతుకుదామని...
***
బాల్యం దాటేసా....
తరువాతి రోజులన్నీ హడావుడిగా గడిచిపోయాయి..
చూస్తుండగానే పెద్దవాణ్ణి అయ్యా....
ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకున్నా,
నా జీవితంలో ‘అమ్మ రోజు’లు ఎన్నున్నాయో
లెక్కిద్దామని,
అమ్మ ప్రశ్నకు జవాబు వెతుకుదామని...
***
అప్పుడు నాకు తెలిసింది....
కష్టాలన్నీ నన్ను చుట్టుముట్టినపుడు,
నిజమైన స్నేహితుడిగా అమ్మ అక్కడే ఉండేది;
అందరూ నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయాక,
అమ్మ మాత్రమే నా చేయి పట్టుకుని మిగిలేది;
చీకటి మేఘాలు నా చుట్టూ ముసిరినప్పుడు,
వాటిని చెదరగొడుతూ, వెలుగు నింపుతూ
సూర్యుడిలా నా దగ్గరే ఉండేది;
గుర్తుపట్టని ఆందోళన నా మనసున తిష్ఠ వేసుకున్నప్పుడు
అమ్మే నా హృదయంలో శాంతిని నింపేది;
సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు
అమ్మే నాకు అద్భుత పరిష్కారాలు చూపించేది;
నేను కోపంగా ఉన్నా, నవ్వుతూనే ఉన్నా,
హద్దులు లేని ప్రేమనే నాకు ఎప్పుడూ పంచి ఇచ్చేది.
నా హృదయంతో చూస్తే – తెలుస్తుంది
మా అమ్మ అత్యంత సౌందర్యరాశి;
నా జీవితంలో మరెక్కడా చూడని మేథస్సు కలిగిన
ఉపాధ్యాయురాలు;
నేను ఏడవటానికి సిద్ధమవకుండానే,
తన చేతులతో నా కన్నీళ్లు తుడవడానికి సిద్ధమయ్యేిది.
నేను చిరునవ్వులు చిందించడానికి సిద్ధపడితే,
నన్ను గుండెలనిండా గలగలా నవ్వేటట్టు చేసేది;
అంతే కాదు...
కష్టాలు, కన్నీళ్లు ఎదురైనా
ప్రయత్నాన్ని విడిచిపెట్టకపోవడం...
ఇతరుల కోసం త్యాగం చేస్తూ,
వారి ఎదుగుదలకు సాయపడడం...
ఓటమిని, గెలుపుని,
ఒకేలా స్థిరంగా స్వీకరించడం...
ఎంచుకున్న మంచి మార్గంలో
నిర్భయంగా పయనించడం...
మా అమ్మే నాకు నేర్పింది....
అంతేనా...
వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దిన నమ్మకం, ప్రేమ,
త్యాగం, సేవ, కరుణ, ఇత్యాది పదాల అర్ధాలన్నీ
అమ్మ నుంచే నేర్చుకున్నాను.
చివరకు తెలుసుకున్నాను......
అమ్మకు ఒకరోజు చాలదని,
అమ్మది ఒకరోజు కాదని,
నా అన్ని రోజులూ నిజానికి
మా అమ్మ రోజులేనని...
ఈ జీవితమే అమ్మ ఇచ్చిన బహుమతి అని...
నా రోజులన్నీ అమ్మతోనేనిండి పోయాయని,
అసలు 'అమ్మరోజు' కాని రోజే లేదని ..
***
సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాను...
అమ్మ ప్రశ్నకు జవాబు దొరికినందుకు..
అదే విషయం అమ్మకు చెప్పాలని
అద్భుతమైన ‘గ్రీటింగ్’ తయారు చేసా...
“అమ్మా – ఈ నా జీవితం నీవిచ్చినదే..
ఇందులో అన్ని రోజులూ నీవే..
అంటే, “అన్ని రోజులూ
సంతోషకరమైన 'అమ్మ రోజు'లే
అభినందనలకు అర్హమైన 'అమ్మ రోజు'లే...
ఇంత చేసిన నీకు
ఎలా ధన్యవాదాలు తెలపాలి?
అందుకే, మనస్ఫూర్తిగా చెబుతున్నా
“నా రోజులన్నీ అమ్మ రోజులే” అని,
ప్రమాణం చేస్తున్నా –
ప్రతి రోజు నిన్ను సంతోషంగా ఉంచుతానని”---- అంటూ
కాని,
నాకు జవాబు దొరికేసరికి
మా అమ్మ అదృశ్యమైపోయింది,
నా గ్రీటింగ్స్ అందుకోకుండా,
నా ప్రమాణం పూర్తి చేయనీకుండా,
నన్ను ఒంటరిని చేసి,
అందనంత దూరం వెళ్ళిపోయింది...
***
కన్నా..
నీకు అర్ధమయ్యే ఉంటుందనుకుంటున్నా...
నీ జీవితంలో ఏ ఒక్కరోజో కాదు,
అన్ని రోజులూ అమ్మరోజులే....
అన్ని రోజులూ అమ్మ బహుమతే...
అందుకే,
అమ్మను ప్రతిరోజు సంతోషంగా ఉంచుతానని
ప్రమాణం చేస్తావు కదూ.....
ఇట్లు
ప్రేమతో...
నాన్న
- Home
- Web Templates
- _WordPress Themes
- _Blogger Templates
- _Customs Templates
- _Adobe XD Web
- Graphic Design
- _Fonts
- __Popular fonts
- __Recent Fonts
- Mockups Templates
- _Technology
- _PSD file
- _T-Shirts
- _Prints and Packaging
- _Social Media
- Others
- _Plugins
- _Vector Illustration
- _Software
- _UX and UI Design
- _Programming
- _Popular Tools
- _Review Project
- _Popular Tools
- Blog
- About