భార్య హాస్పిటల్ ICU లో ఉంది .
బయట భర్త ముఖంలో దుఃఖం ,కన్నీళ్లాగటం లేదు .
డాక్టర్ : ఆమె పరిస్తితి చాలా విషమంగా ఉంది .మేము చేయగలిగింది చేసాం .ఆమె శరీరం సహకరించట్లేదు .కోమాలోకి వెళ్లిపోయింది .
భర్త : అలా అనకండి డాక్టర్ ..మీరేదయినా చెయ్యండి ..నా భార్యను బ్రతికించండి ..ఆమెకింకా 35 ఏళ్ళేనండీ ..ప్లీజ్ ..
వేడుకుంటున్నాడు డాక్టర్ని ...!!
ఇంతలో ....
అద్భుతం జరిగింది ...!!
ఈసీజీ లో బీప్ సౌండ్ స్టార్టు అయ్యింది .
నెమ్మదిగా కాలు ,తరువాత ఆమె చేతిలో కదలిక ..
కనురెప్పలు కొట్టుకున్నాయి ..
పెదాల్లో చిన్న కదలిక ..
అతికష్టంగా నోరువిప్పి చెప్పిందామె ..
"దొంగ సచ్చినోడా ..నాకింకా పాతికేళ్ళేనురా .."
😁😁😂😂😜😜😛😛🤑🤑😆😆😝😝😀😀😁😁😇😇😜😛😂🤑🤑🤑🤑