సిటీ బస్సులో ఖాళీగా వున్న ఒకే ఒక సీటు కోసం
ఇద్దరు ఆడవాళ్ళు పోట్లాడుకుంటున్నారు.
ఆ గొడవ చూసిన కండక్టర్ " దానికింత పోట్లాట ఎందుకమ్మా..
మీలో వయసులో పెద్దవాళ్ళెవరో కూర్చోండి " అన్నాడు.
అంతే..... గొడవ ఆగిపోయింది
సిటీబస్ చిట్టచివరి స్టాప్ కి వెళ్ళేవరకు
ఆ ఇద్దరు ఆడవాళ్ళు అలా నిలబడే ఉన్నారు...