పేరెంట్స్ తో కాదు

నాన్న: ఒరేయ్ శీనూ, ఈరోజు మీ అమ్మ పుట్టినరోజు కదా, విష్ చేసావా?
శీను: ఆ, పొద్దున్నే FB లో పోస్ట్ చేసేసానులే

నాన్నకి సర్రున కాలినా, ఏమి అనకుండా పేపర్ చదువుకుంటూ హాల్లో కూర్చుండిపోయారు.

ఓ పదిహేను నిమిషాల తరువాత

శీను: అమ్మా, నేను బయటకి వెళ్ళాలి టిఫిన్ పెట్టు

అమ్మ (వంటింటి నుండి): అయ్యో టిఫిన్ వాట్సాప్ లో పంపించి చాలా సేపు అయ్యిందిరా, త్వరగా తినెయ్ మళ్ళీ చల్లారిపోతుంది

నాన్నగారు కుష్, శీనుగాడు షాక్! 😂😂😂

నీతి: ఎవరితోనైనా పెట్టుకో, కానీ పేరెంట్స్ తో కాదు. వాళ్ళు తలుచుకుంటే క్షణంలో నీ తాట తీస్తారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది