నేటి సమాజంలో


1) కూతురు చదువుఖర్చు 
    కంటే - పెళ్లిఖర్చు ఎక్కువ.

2)  పోలీసుని చూస్తే భద్రత
     కంటే - భయం ఎక్కువ.

3)  సిగ్గు చాలా ఎక్కువ -
   అయినా జనాభా 121 కోట్లు

4)  ఫోన్లు పగల కుండా స్క్రీన్
      గార్డ్ వాడతారు,-
      తలని కాపాడే హెల్మెట్  
       పెట్టుకోరు.

5).  ఆఫీస్ కి అందరు
       హడావిడి కానీ -
      ఎవడు టైం కి ఆఫీస్ కి
        రాడు.

6).  అస్సలు పరిచయం లేని 
       వ్యక్తి తో ఆడపిల్ల
        మాట్లాడ కూడదు కానీ-
        పెళ్లి చేసుకోవచ్చు.

7).  గీత గొప్పదా ?
       ఖురాన్ గొప్పదా ?
      అని కొట్టుకు చచ్చేవాళ్లలో   
       వందమంది లో -
    ఒక్కడు కూడా వాటిని
    పూర్తి గా చదివి ఉండడు.

8)  కాళ్ళకి వేసుకునే చెప్పులు 
    ఏసీ షాప్ లో అమ్ముతారు-  
   అన్నం లో తినే  
   కూరగాయలు మురికి కాలువ
    ప్రక్కన అమ్ముతారు.

9) మేజిక్ ని చేసే బాబా ని
    నమ్ముతారు  కానీ -
    లాజిక్ ని చెప్పే సైంటిస్ట్ ని 
    నమ్మరు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది