శఠగోపం పెట్టుకోకుండా గుడి నుంచి వెళ్లొద్దు ? ఎందుకో తెలుసా !!
శఠగోపం (కొన్ని ప్రాంతాల వారు శఠగోపం, శడగోప్యం అంటారు) అనగా త్యంత గోప్యమైనది అని అర్థం. అంటే అది అత్యంత రహస్యం. భక్తులు దేవాలయంలో దర్శనం అయ్యాక ప్రదక్షిణలు చేసి, తీర్థం, శఠగోపనం తీసుకుంటారు. అత్యంత గోప్యమైనది కనుక అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరకను తలుచుకోవాలంటారు మన పెద్దలు.
సాధారణంగా భక్తులు గుడికి వెళ్లి వస్తూ ఉంటారు. ఇంకా పరమభక్తుల గురించి చెప్పనవసరం లేదు.. వారు ప్రతిరోజు గుడికి వెళ్లకుండా ఉండలేరు. కొందరు గుడికెళ్లి దేవుడి దర్శనమయ్యాకే ఇతర పనులకు ప్రాధాన్యమిస్తూ ఉంటారు. సాధారనంగా ఎవ్వరైనా గుడికి వెళ్లినప్పుడు దర్శనం చేసుకుంటారు కదా.. కానీ అక్కడ చాలా మంది దేవుడి దర్శనం అయిపోగానే వచ్చేస్తుంటారు. దేవుడి ప్రసాదం, తీర్థం కానీ, శఠగోపానికి కానీ ప్రాధాన్యం ఇవ్వకుండా వెళ్లిపోతారు. కానీ అలా చేయకూడదు.. దేవాలయంలో దేవుడి దర్శనం అయ్యాక ప్రసాదం, తీర్థం, శఠగోపం తప్పక తీసుకోవాలి.
* చాలా మంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక.. హమ్మయ్య.. వచ్చిన పని అయ్యిపోయింది కదా అని చకచకా వెళ్లి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని సేదతీరుతారు. కొద్ది మంది మాత్రమే ఆగి.. అడిగి మరీ శఠగోపం పెట్టించుకుంటారు.
* శఠగోపం రహస్యం:
* శఠగోపం పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరికను తలుచుకోవాలి. అంటే మీ కోరికే శఠగోపం అన్నమాట. మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుంచి దూరంగా ఉంటామని తలుస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం.
* సహజంగా చిల్లర లేకపోవడటం వల్ల శఠగోపంను ఒక్కోసారి వదిలేస్తూ ఉంటాం. ప్రక్కగా వచ్చేస్తాం. అలా చెయ్యకూడదు. పూజారి చేత శఠగోపం పెట్టించుకొని మనసులోని కోరికను స్మరించుకోవాలి.
* ఈ శఠగోపంను రాగి, కంచు, వెండిలతో తయారు చేస్తారు. దీనిపై విష్ణుపాదాలు ఉంటాయి. ఈ శఠగోపమును తలమీద ఉంచినపుడు శరీరంలో ఉన్న విద్యుత్.. దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్ బైటికెళుతుంది. తద్వారా శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి.