Kabali story
మలేషియా లో జీవనం సాగించే కబాలి (రజనీకాంత్ ) అక్కడ భారతీయులకు జరిగే అన్యాయాలను చూసి చలించిపోతాడు..ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్లి ప్రజలను కాపాడుతూ ఓ మంచి గ్యాంగ్ స్టార్ గా ఎదుగుతాడు. కానీ ఇతడి ఎదుగుదలను చూసి తట్టుకోలేక మరో విలన్ గ్యాంగ్ టోనీలీ (వింగ్‌స్టన్ చావ్) ఇతడిని చంపాలని ప్లాన్చేస్తారు. ఈ ఇద్దరి మధ్య పెద్ద వార్ జరుగుతుంది. ఈ వార్ లో కబాలి భార్య కుందనవల్లి (రాధికా ఆప్టే ) కి బుల్లెట్ తగులుతుంది. అదే టైం కుపోలీసులు వచ్చి కబాలి ని అరెస్ట్ చేసి 25 ఏళ్ల పాటు జైలులో ఉంచుతారు. ఆ తర్వాత పోలీసులు మళ్ళీ గ్యాంగ్ వార్ మొదలుపెట్టవద్దని కబాలికి చెప్పి విడుదలచేస్తారు. జైలు నుండి వచ్చిన కబాలి తన భార్య కోసం వెతకడం మొదలు పెడతాడు..అప్పటికి మలేషియా రౌడీ గ్యాంగ్ ల దోపిడీలు మారవు..ఇవన్నీ చూసిన కబాలి మళ్ళీ గ్యాంగ్ స్టార్ గా మారతాడా..? లేక పోలీసులు చెప్పిన మాదిరిగా సైలెంట్ గా ఉంటాడా అనేది మిగతా కథ.,....
Tags:
Telugu
