అర్ధవంతమైన కధ .....
వామ్మో అని అమ్మ గావుకేక వినిపించింది ... ప్రక్క గదిలోకి పరిగెత్తాను... అక్కడ గుమ్మం ముందు అమ్మ చాలా చాలా అచ్చర్యం గా చూస్తోంది ..... వెంటనే వెళ్లిఏమయ్యింది అని అడిగాను .... ఆ గదిలోకి వేలు చూపించింది చూడమన్నట్లు ... చూసాను నోట మాట రాలేదు ..... ఆ గది నిండా వెయ్యి రూపాయల నోట్ల కట్టలు .... ఎక్కడివి అని అడిగాను ... తెలియదన్నట్లు తల అడ్డంగా ఊపింది .... వెంటనే గదిలోకి వెళ్లి చూసాను ఎంచెప్పలేంకాని ఒక 100 కొట్లలో వుంటుంది అని అర్ధం అయ్యింది ....
ఆ అచేర్యం నుంచి తేరుకొని అమ్మ ఒక కట్ట తీసుకోని నాకిచ్చి పాలు రాలేదు వెంటనే వెళ్లి 5 పాల పెక్కెట్లు తీసుకురా అంది ....
రోడ్ మీదకు వచ్చాను ... అందరు ఎదో తెలియని ఆనందం తో తిరుగుతున్నారు ...
ప్రక్క నున్న పాలు అమ్మే దుకాణం కు వెళ్ళాను అది ముసి వుంది అదే కాదు ఆ చుట్టూ ప్రక్కల ఏ దుకాణం లేదు ... జనాలు అందరు అటు ఇటు తిరుగుతున్నారు కాని ఏ దుకాణాలు లేవు ... ఆ ప్రక్కనే ఉన్న న స్నేహితుని ఇంటికి వెళ్ళాను .... వాడు అప్పుడే బైటకు వచ్చాడు .... వాడి మోహంలో ఎంతో ఆనందం వుంది ... నన్ను చూడగానేగట్టిగా కవుగిలించుకొని అరె మన కష్టాలు తీరిపోయాయి ... అని చెప్పి వెంటనే ఎవరికీ చెప్పానంటే ఒక విషయం చేబతనన్నాడు .... ఏమిటి అంటే ... మాఇంట్లో ఎవరు పెట్టారో తెలియదు కాని వెయ్యి రూపాయల కట్టలు కోట్లల్లో పెట్టారు అన్నాడు ... నాకు అర్ధం అయ్యింది మా ఇంట్లో నే కాదు వీడి ఇంట్లో కుడా ఇలాగే జరిగింది అని.....మీ నాన్నను ఫాక్టరీ దగ్గర దిపేసి రా అలా రోడ్ మీదకు వెళదాం ..... అన్నాను ఇకేందుకు ఆ ముష్టి వుద్యాగం ఇంట్లో కోట్లు డబ్బుపెట్టుకొని ... ఆ వుద్యోగం మనేసేనట్లే అన్నాడు ... మరి నువ్వు అన్నాను ... నేను కుడా ఇక వుద్యోగం చెయ్యాల్సిన పని లేదు అన్నాడు ... సరే రా అలా రోడ్ మీదకు వెళ్లి పాల పెక్కేటు తీసుకోని దమ్ము కొడదాం అని అన్నాను ...
ఇద్దరం రోడ్ మీదకు వచ్చాం అక్కడ షరా మూములే ఏ దుకాణం తెరిచి లేదు ... అక్కడే ఉన్న దుకాణం + ఇల్లు ఉన్న వాడింటికి వెళ్లి దుకాణం తియ్యమని అడిగాం వాడు చిన్నప్పటినుంచి తెలుసు ... వెంటనే మమ్మలను ప్రక్కకు తీసుకు వెళ్లి వాళ్ళింట్లో కుడా డబ్బులు వచ్చాయని చెప్పాడు ఇక దుకాణం తియ్యవలసిన అవసరం లేదని చెప్పాడు ... ఇలా ఆ చుట్టుప్రక్కలున్న అన్ని ఇళ్ళల్లో డబ్బులు వచ్చాయని చెప్పాడు ... నాకు విషయం అర్ధం అయ్యింది మా ఒక్క ఇంట్లో మాత్రమే కాదు అందరి ఇంట్లో కుడా ఇలాగెడబ్బులు వచ్చాయని ... అందుకే ఎవరు దుకాణాలు తియ్యటం లేదని... అసలు ఏమిజరుగుతుందో తెలుసుకుందామని అలా బండి మీద వెళుతున్నాం .... అన్ని చోట్ల ఇదే మాట మాఇంట్లో డబ్బులు వచ్చాయని ... రోజు కులిలతో కల కల లాడే అడ్డ మీద ఒక్కరు లేరు ... అసలు ఏ దుకాణం లేదు ఒక్క హోటల్ కుడా లేదు .... అందరు ఇంక కష్టాలు తిరిపోయయని ఇక పని చెయ్యాల్సిన అవసరం లేదని ఈ డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చని అంటున్నారు ..... ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు ఒక్క కూరగాయ దుకాణం లేదు ఉప్పు పప్పు అమ్మే దుకాణం లేవు బస్స్టాండ్ కు వెళ్ళాం అక్కడ అన్ని బస్సులు వున్నాయి కాని డ్రైవర్ లేరు అసలు బస్సు స్టాండ్ లో ఉద్యోగులు ఎవరు లేరు ... అక్కడ కుడా ఇదే పరిస్తితి డబ్బు అని అర్ధం అయ్యింది ....పెట్రోలో పంపు లు తెరచి లేవు ... ఆటోలు లేవు బస్సులు లేవు రైళ్ళు విమానాలు ఏవి లేవు ... ఆఖరికి టీవీ లు కుడా రావటం లేదు ... ఫోన్ మోగటం లేదు ..... రైతులు పంటలు కొయ్యటం లేదు పండించటం లేదు ..... రోడ్ మీద అక్కడక్కడ వెయ్యి రూపాయల నోట్లు పడి వున్నాయి కాని వాటిని ఎవరు తీసుకోవటం లేదు .... అందరి జేబుల్లో డబ్బులు వున్నాయి కాని తినటానికి కడుపునింపుకోవటానికి ఏమి లేవు .... అందరికి ఒకేసారి కష్టపడకుండా కోట్లు డబ్బు వస్తే ఎలా వుంటుందో అర్ధం అయ్యింది ..... ఒక్క సారి భయం వేసిందితిండి లేకుండా ఎలా బతకాలని .... ఒరే లేవరా అన్న అమ్మ మాటలకు మెలుకవ వచ్చింది .... అప్పుడు అర్ధం అయ్యింది ఇది కల అని ... అమ్మయ్య అని అనుకొన్నాను ... అయినా ఎక్కడో అనుమానం ... అమ్మ పాలు వచ్చాయా అని అడిగాను ... వచ్చాయి కాఫీ కుడా పెట్టాను.. అని చెప్పింది ... ఇంటి బయటకు వెళ్లి చూసాను అన్ని దుకాణాలు తెరిచి వున్నాయి ... అమ్మయ్య అనుకొన్నాను టైం చూసాను అమ్మో షాపుకి కు వెళ్ళే సమయం అయ్యింది .....
*ఏలావుందో కామెంట్ రాయండి*
(Forwarded from WhatsApp)