ఆ ఏడుగురిలోమీరున్నారా?





💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

🍁ఆ ఏడుగురిలోమీరున్నారా?🍁

ఒక రోజు వస్తుంది...
భూమి చాపలా చుట్టుకుపోతుంది.

ఆకాశం పైకప్పు విరిగిపడుతుంది.

సూర్యుడు భూమిమీదకు వస్తాడు. అది ప్రళయం.

ఆ రోజు ఏ నీడా ఉండదు. తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థంకాక బెంబేలెత్తుతుంటాడు. అలాంటి విపత్తు ఘడియలో ఏడు రకాల ధర్మాలు నిర్వహించిన మనుషులకెలాంటి భయం, మరెలాంటి దుఃఖం, ఇంకెలాంటి బాధ ఉండవు. అలాంటి వారు అల్లాహ్‌ సింహాసనం నీడలో సేదతీరతారని ముహమ్మద్‌ ప్రవక్త (స) చెప్పారు. మరి ఆ ఏడు ధర్మాలు పాటించిన వారెవరు?

* తనపై నమ్మకంతో, విశ్వాసంతో అధికారపీఠాన్ని అప్పగిస్తే ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తించిన నాయకుడు.

తన రాజ్యంలో న్యాయానికి పెద్దపీట వేస్తూ, చక్కని పరిపాలనదక్షతతో ప్రజావ్యవహారాలను చక్కదిద్దిన న్యాయపాలకుడు.

* అశ్లీలం, అనైతిక చేష్టల నుంచి యవ్వనాన్ని కాపాడుకున్న యువకుడు. జీవితాన్ని అనుభవించాలన్న యవ్వనోత్సాహాన్ని అదుపులో ఉంచుకుని అల్లాహ్‌ ఆరాధనలో గడిపే యువకుడు.

* ఏకాంతంలో దైవారాధనలో గడిపే వ్యక్తి. అల్లాహ్‌ పేరు వినగానే పాపభీతితో కంపించేవాడు.

* ప్రాపంచిక వ్యవహారాల్లో ఎంతగా లీనమైనప్పటికీ తన మనస్సును మసీదులోనే లగ్నం చేసినవాడు.

* అల్లాహ్‌ మార్గంలో దానం చేసి చెప్పుకోనివారు. కుడిచేత్తో దానం చేస్తే ఎడం చేతికి కూడా తెలియకుండా చూసుకునేవారు.

* ఒకరినుంచి ఏమీ ఆశించకుండా అల్లాహ్‌ ప్రీతికోసమే స్నేహం చేసే ఇద్దరు స్నేహితులు. స్నేహమైనా, శతృత్వమైనా కేవలం అల్లాహ్‌ ప్రేమే వారికి ప్రాతిపదిక.

* అల్లాహ్‌ చూస్తున్నాడన్న భీతితో అనైతిక పనులకు, అక్రమాలకు దూరంగా ఉండేవారు.🍁

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది