👌*పోరాడు*! *పోరాడు*! *పోరాడు* ! .....
*ఈ మధ్య సమాజం లో బాగా చక్కర్లు కొడుతున్న పదం ఇది వినడానికి బాగానే ఉంది* ,.....
*కానీ ఒక్క సారైనా ఆంతర్మధనం చేసుకున్నావా? ఎందుకోసం పోరాడాలి? ఎవరి మీద పోరాడాలి?*............................
*పోరాడు కానీ ఎందుకోసం*
✓ *నీ కోసం పోరాడు*
✓ *నీ జ్ఞానం పెంచుకోవడం కోసం పోరాడు*
✓ *నీ బతుకు బాగు కోసం పోరాడు*
✓ *నీ బలహీనతలను జయించడం కోసం పోరాడు*
✓ *నిన్ను నువ్వు ఉద్దరించుకోడం కోసం పోరాడు*
✓ *నీ తల్లి తండ్రులను శేష జీవితం లో బాగా చూస్కో వడం కోసం పోరాడు*
✓ *తర తరాల నీ కుటుంబ తల రాత మార్చడం కోసం పోరాడు*
✓ *అన్న తమ్ముల ఆత్మీయ బందువుల అభివృద్ధి కోసం పోరాడు*
✓ *నీ ఇరుగు పొరుగున ఉన్న అన్నార్తుల ఆకలి తీర్చడం కోసం పోరాడు*......
*అంతిమంగా*
*ఇంట గెలిచి రచ్చ గెలువు*.
*నీ ఇంటిని నువ్వు ఉద్దరించుకో కుండ నీవు చేసే ఏ పని అయినా, చెప్పే ఏ మాట అయిన నీటి మీద బుడగ లాంటిదే*.........
*నినాదాలు మెరుపు లాంటివి మెరుపు ఉన్నప్పుడు చాలా వెలుగు ఉంటుంది కానీ మెరుపు పోయిన మరు క్షణం దట్టమైన చీకటి వస్తుంది అది మనం గ్రహించాలి*...
*జీవితం కూడా అలాంటిదే అందుకే ఆత్మవిమర్శ చేస్కో ఏ పోరాటం కావాలో*...
*చప్పట్లు కొట్టే ఈ సమాజమే నువు బలహీనుడు గా మారిన క్షణాన సమాధి చేస్తుంది* ....
*అందుకే*
*వట్టి మాటలు కట్టి పెట్టీ గట్టి మేలు తల పెట్టవొయ్ అన్న గురజాడ సాక్షిగా*....
*ఈ సమాజం ఆచరించే వారికే సలాం కొడుతుంది...... కాబట్టి పోరాటం చెయ్*......
*నీ పోరాటం నీకు నీ కుటుంభానికి దారి చూపేదాకా.........నీ ఒంట్లో సత్త ఉన్నంత కాలం పోరాడు*........................
*ఈ పోరాటమే ఆదర్శనీయం అనుసరణీయం*........
Saidulu Pole
Psychologist & Author.